IPL 2022: కోల్‌కతా నైట్ రైడర్స్ జట్టు కెప్టెన్‌గా శ్రేయస్ అయ్యర్, పూర్తయిన సంప్రదింపులు

IPL 2022: ఐపీఎల్ 2022లో చాలా మార్పులు చోటుచేసుకోబోతున్నాయి. వివిద టీమ్ ఆటగాళ్లే కాదు..కెప్టెన్స్ కూడా మారనున్నారు. కోల్‌కత్తా నైట్ రైడర్స్ జట్టు సైతం కెప్టెన్సీ మార్పుపై ఆలోచన చేస్తోంది. ఇతర టీమ్ ఆటగాళ్లపై కన్నేసింది.  

Written by - Md. Abdul Rehaman | Last Updated : Jan 11, 2022, 09:00 AM IST
IPL 2022: కోల్‌కతా నైట్ రైడర్స్ జట్టు కెప్టెన్‌గా శ్రేయస్ అయ్యర్, పూర్తయిన సంప్రదింపులు

IPL 2022: ఐపీఎల్ 2022లో చాలా మార్పులు చోటుచేసుకోబోతున్నాయి. వివిద టీమ్ ఆటగాళ్లే కాదు..కెప్టెన్స్ కూడా మారనున్నారు. కోల్‌కత్తా నైట్ రైడర్స్ జట్టు సైతం కెప్టెన్సీ మార్పుపై ఆలోచన చేస్తోంది. ఇతర టీమ్ ఆటగాళ్లపై కన్నేసింది.

ప్రతిష్టాత్మకమైన ఐపీఎల్ 2022 వేలంలో భాగంగా ఇప్పటికే వివిధ జట్ల రిటైన్ లిస్ట్ పూర్తయింది. కొత్తగా అహ్మదాబాద్, పూణే జట్టు ఐపీఎల్‌లో ఎంట్రీ ఇస్తున్నాయి. ఈసారి జరగనున్న ఐపీఎల్‌లో చాలా మార్పులు చేర్పులు వస్తున్నాయి. చాలాకాలంగా వివిధ జట్ల తరపున ప్రాతినిధ్యం వహించిన ఆటగాళ్లు ఈసారి ఆయా టీమ్‌లు వదిలి..ఇతర టీమ్‌లలో చేరనున్నారు. రిటైనింగ్ ప్రక్రియను బట్టి ఆటగాళ్లు వేరే జట్లను ఎంచుకునే పరిస్థితి కన్పిస్తోంది. కొన్ని టీమ్స్ అయితే కెప్టెన్సీ కూడా మార్చే ఆలోచన చేస్తున్నాయి.

ఐపీఎల్ 2022 సీజన్ మెగా ఆక్షన్‌కు (IPL 2022 Mega Auction) ముందు జరిగిన రిటైనింగ్ ప్రక్రియలో ఢిల్లీ కేపిటల్స్ జట్టు..శ్రేయస్ అయ్యర్‌ను వదిలేసింది. ఫలితంగా శ్రేయస్ అయ్యర్ కోసం చాలా జట్లు ప్రయత్నించనున్నాయి. ఐపీఎల్‌లో కొత్తగా ఎంట్రీ ఇస్తున్న అహ్మాదాబాద్ జట్టు శ్రేయస్ అయ్యర్‌పై కన్నేసింది. అసలు అయ్యర్‌ని కెప్టెన్‌గా తీసుకునే ఆలోచన చేస్తుందనే వార్తలు కూడా విన్పించాయి. అయితే ఇప్పుడు మరో వార్త శ్రేయస్‌కు సంబంధించి వైరల్ అవుతోంది. కోల్‌కతా నైట్ రైడర్స్(Kolkata knight Riders) జట్టు కెప్టెన్‌గా శ్రేయస్ అయ్యర్ పేరు ఎక్కువగా విన్పిస్తోంది. ఇప్పటి వరకూ ఆ జట్టుకు కెప్టెన్‌గా వ్యవహరించిన ఇయాన్ మోర్గాన్‌ని కేకేఆర్ రిటైన్ చేసుకోకపోవడం ఇందుకు కారణంగా తెలుస్తోంది. 

ఈ విషయమై ఇప్పటికే పలు జాతీయ పత్రికలు వార్తలు ప్రచురించాయి. కేకేఆర్ జట్టు (KKR Team) కెప్టెన్సీ బాధ్యతలు శ్రేయస్ అయ్యర్‌కు అప్పగించాలని యాజమాన్యం భావిస్తోందని తెలుస్తోంది. ఇప్పటికే శ్రేయస్ అయ్యర్‌తో ఆ దిశగా సంప్రదింపులు కూడా పూర్తయ్యాయి. ఐపీఎల్ సీజన్ 2020లో అద్భుతంగా రాణించిన శ్రేయస్ అయ్యర్ (Shreyas Iyer)..జట్టు ఫైనల్‌కు చేరుకోవడంలో కీలకపాత్ర పోషించాడు. గాయం కారణంగా ఐపీఎల్ 2021 తొలిదశకు దూరమైన శ్రేయస్ అయ్యర్..ఆ తరువాత తిరిగి జట్టులో వచ్చినా..కెప్టెన్సీ మాత్రం దక్కలేదు. 

Also read: India vs South Africa: టీమ్ ఇండియా, దక్షిణాఫ్రికాల మధ్య కీలక టెస్ట్ నేడే, టీమ్ ఇండియా చరిత్ర తిరగరాయనుందా

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.Twitter , Facebook

Trending News