తొలి రోజు న్యూజీలాండ్ దే పైచేయి

భారత్ న్యూజిలాండ్ ల మధ్య క్రిస్ట్ చర్చ్ వేదికగా జరుగుతున్న రెండో టెస్టు తొలి ఇన్నింగ్స్ లో టీమిండియా 242 పరుగులకు ఆలౌటైంది. భారత బ్యాట్స్ మెన్స్ ఓపెనర్ పృథ్వీషా (54) పరుగులతో జట్టుకు గౌరవప్రదమైన స్కోరును అందించాడు. మరో ఓపెనర్ మయాంక్ అగర్వాల్

Last Updated : Feb 29, 2020, 04:40 PM IST
తొలి రోజు న్యూజీలాండ్ దే పైచేయి

క్రిస్ట్ చర్చ్: భారత్ న్యూజిలాండ్ ల మధ్య క్రిస్ట్ చర్చ్ వేదికగా జరుగుతున్న రెండో టెస్టు తొలి ఇన్నింగ్స్ లో టీమిండియా 242 పరుగులకు ఆలౌటైంది. భారత బ్యాట్స్ మెన్స్ ఓపెనర్ పృథ్వీషా (54) పరుగులతో జట్టుకు గౌరవప్రదమైన స్కోరును అందించాడు. మరో ఓపెనర్ మయాంక్ అగర్వాల్(07), కెప్టెన్ విరాట్ కోహ్లి(03)నిరాశపర్చగా, మిడిలార్డర్ లో పూజారా (54), హనుమ విహారి(55) రాణించారు. అటు కివీస్ బౌలర్లలో జామిసన్ 5 వికెట్లు తీయగా, టిమ్ సాథీ, బౌల్డ్ కు చెరో 2 వికెట్లు పడగొట్టారు. కాగా, ఇన్నింగ్స్ ప్రారంభించిన న్యూజిలాండ్ వికెట్ నష్టపోకుండా 63 పరుగులు చేసింది. అద్భుతమైన ఫామ్ లో, భయంకరంగా  విరుచుకుపడే విరాట్ కోహ్లీ, టెస్టుల్లో విఫలమవుతుండడంపై క్రీడావర్గాల్లో చర్చ జరుగుతోంది. 

ఇటీవల విరాట్ కోహ్లీ ఆడిన 5 ఇన్నింగ్స్ (3,19,2,9,15)ల్లో ఫెయిలయ్యాడు. దీంతో విరాట్ పై నెటిజన్లు ట్వీట్లు చేస్తున్నారు. మొదటి మ్యాచ్‌లో ఓడిన భారత్ శనివారం ప్రారంభమైన రెండో చివరి టెస్టులో విజయమే లక్షంగా పెట్టుకుంది. ఈ మ్యాచ్‌లో గెలిచి సిరీస్‌ను సమం చేయాలనే పట్టుదలతో టీమిండియా ఉండగా, అటు ఇప్పటికే ఓ మ్యాచ్ గెలిచిన న్యూజిలాండ్ క్లీన్‌స్వీప్ దృష్టి పెట్టింది. ఈ మ్యాచ్‌లోనూ గెలిచి సిరీస్‌ను వైట్‌వాష్ చేయాలని ఉవ్విళ్లూరుతోంది. 
 జీ హిందుస్తాన్ తెలుగు టీవీ లైవ్ లింక్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి. Watch Zee Hindustan Telugu live here..

Trending News