IPL Auction 2024 Live: ఉత్కంఠగా ముగిసిన ఐపీఎల్ వేలం.. జాక్‌పాట్ కొట్టేసిన ప్లేయర్లు వీళ్లే..!

IPL Auction 2024 Live Updates: ఐపీఎల్ మినీ వేలం మరికాసేపట్లో ప్రారంభంకానుంది. ఏ ఆటగాడికి ఏ జట్టును తీసుకుంటుంది..? ఏ ప్లేయర్‌కు అత్యధిక ధర దక్కుతుంది..? అనేది సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. ఐపీఎల్ వేలం లైవ్‌ అప్‌డేట్స్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి.   

Written by - Ashok Krindinti | Last Updated : Dec 19, 2023, 09:07 PM IST
IPL Auction 2024 Live: ఉత్కంఠగా ముగిసిన ఐపీఎల్ వేలం.. జాక్‌పాట్ కొట్టేసిన ప్లేయర్లు వీళ్లే..!
Live Blog

IPL Auction 2024 Live Updates: దుబాయ్‌ వేదికగా ఇండియన్ ప్రీమియర్ లీగ్-2024 వేలం నేడు జరగనుంది. ఇందుకోసం ఇప్పటికే అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. తొలిసారిగా దేశం వెలుపల ఐపీఎల్ వేలం నిర్వహిస్తున్నారు. మొత్తం 333 మంది ఆటగాళ్లు వేలంలో పాల్గొననున్నారు. ఇందులో 214 మంది భారతీ ఆటగాళ్లు, 119 మంది విదేశీ ఆటగాళ్లు ఉన్నారు. వీరిలో 116 మంది క్యాప్డ్, 215 మంది అన్‌క్యాప్డ్ ప్లేయర్లు ఉన్నారు. మినీ వేలంలో 10 ఫ్రాంచైజీలు 77 మంది ఆటగాళ్లను ఎంపిక చేసుకోనున్నాయి. ఇందులో 30 మంది విదేశీ ఆటగాళ్లకు తీసుకోవాల్సి ఉంటుంది. దుబాయ్‌లోని కోకాకోలా ఎరీనాలో ఆటగాళ్ల వేలం జరగనుంది. ఉమెన్స్ ప్రీమియర్ లీగ్‌లో వేలంపాట నిర్వహించిన మల్లికా సాగర్.. మినీ ఐపీఎల్ వేలం కూడా నిర్వహించనున్నారు. ఐపీఎల్ చరిత్రలో వేలం నిర్వహిస్తున్న తొలి మహిళా క్రీడాకారిణి కూడా ఆమెనే కావడం విశేషం. ఐపీఎల్ వేలానికి సంబంధించి లైవ్ అప్‌డేట్స్ కోసం ఇక్కడ ఫాలో అవ్వండి.
 

19 December, 2023

  • 21:05 PM

    IPL Auction 2024 Live Updates: రెండోసారి అమ్ముడైన అన్‌సోల్డ్ ప్లేయర్లు వీళ్లే

    ==> షైహోప్-రూ.75 లక్షలు-DC
    ==> అట్కిన్సన్-రూ.కోటి-KKR
    ==> స్వస్తిక్ చికార-రూ.20 లక్షలు-DC
    ==> శివాలిక్ శర్మ-రూ.20 లక్షలు-MI
    ==> స్వప్నిల్ సింగ్-రూ.20 లక్షలు-RCB
    ==> అవినిష్ అరవెల్లి-రూ.20 లక్షలు-CSK
    ==> నాండ్రే బర్గర్-రూ.50 లక్షలు-RR
    ==> షాకిబ్ హుస్సేన్-రూ.2 లక్షలు-KKR
    ==> సౌరవ్ చౌహన్-రూ.2 లక్షలు-RCB

  • 20:49 PM

    IPL Auction 2024 Live Updates: అఫ్గాన్ ఆల్‌రౌండర్ మహ్మద్ నబీని రూ.కోటి 50 లక్షలకు ముంబై తీసుకుంది.
     

  • 20:47 PM

    IPL Auction 2024 Live Updates: అన్‌క్యాప్‌డ్‌ ఆల్‌రౌండర్ అర్షద్‌ ఖాన్‌ను రూ.20 లక్షల కనీస ధరకు లక్నో తీసుకుంది.

  • 20:46 PM

    IPL Auction 2024 Live Updates: అఫ్గాన్ స్పిన్నర్ ముజీబ్ రెహ్మన్‌ను రూ.2 కోట్ల బేస్‌ప్రైస్‌కు కేకేఆర్ సొంతం చేసుకుంది.
     

  • 20:45 PM

    IPL Auction 2024 Live Updates: లూకీ ఫెర్గుసన్‌ను రూ.2 కోట్ల బేస్‌ప్రైస్‌కు ఆర్‌సీబీ సొంతం చేసుకుంది.

  • 20:43 PM

    IPL Auction 2024 Live Updates: సౌతాఫ్రికా బ్యాట్స్‌మెన్ రిలీ రోసో మొదట్లో అన్‌సోల్డ్‌గా మిగిలిపోగా.. రెండోసారి పేరు వేలంలోకి వచ్చింది. రూ.2 కోట్లు బేస్‌ ప్రైస్‌ కాగా.. ఢిల్లీ, పంజాబ్ జట్లు పోటీపడ్డాయి. చివరకు రూ.8 కోట్లకు పంజాబ్ దక్కించుకుంది.

  • 20:38 PM

    IPL Auction 2024 Live Updates: అన్‌సోల్డ్ ప్లేయర్లను మళ్లీ వేలంలోకి తీసుకువచ్చారు. రూ.50 లక్షల బేస్‌ ప్రైస్‌కు మనీశ్ పాండేను కేకేఆర్ సొంతం చేసుకుంది.

  • 20:23 PM
  • 20:11 PM

    IPL Auction 2024 Live Updates: టీమిండియా అన్‌క్యాప్‌డ్‌ ప్లేయర్ జాతవేద్ సుబ్రమణ్యన్‌ను రూ.20 లక్షల బేస్‌ ప్రైస్‌కు ఎస్‌ఆర్‌హెచ్‌ దక్కించుకుంది.
     

  • 20:05 PM

    IPL Auction 2024 Live Updates: టీమిండియా అన్‌క్యాప్‌డ్‌ ప్లేయర్ ప్రిన్స్ చౌదరిని రూ.20 లక్షల బేస్‌ ప్రైస్‌ పంజాబ్ దక్కించుకుంది.
     

  • 20:04 PM

    IPL Auction 2024 Live Updates: అన్‌క్యాప్‌డ్‌ ప్లేయర్ రాబిన సింగ్‌ రూ.20 లక్షల కనీస ధరతో వేలంలోకి రాగా.. ముంబై, చెన్నై జట్లు పోటీ పడ్డాయి. చెన్నై తప్పుకోగా.. గుజరాత్ ఎంట్రీ ఇచ్చింది. తరువాత ఎస్‌ఆ్‌హెచ్‌కు కూడా పోటీ పడింది. చివరకు రూ.3 కోట్ల 60 లక్షలకు గుజరాత్ టైటాన్స్ సొంతం చేసుకుంది. 
     

  • 20:00 PM

    IPL Auction 2024 Live Updates: తనయ్ త్యాగరాజన్‌ను రూ.20 లక్షల బేస్‌ ప్రైస్‌ పంజాబ్ దక్కించుకుంది.

  • 19:58 PM

    IPL Auction 2024 Live Updates: శశాంగ్ సింగ్‌ను రూ.20 లక్షల కనీస ధరకు పంజాబ్ కింగ్స్ తీసుకుంది.
     

  • 19:57 PM

    IPL Auction 2024 Live Updates: విశ్వనాథ్‌ సింగ్‌ను రూ.20 లక్షల కనీస ధరకు పంజాబ్ కింగ్స్ తీసుకుంది.
     

  • 19:56 PM

    IPL Auction 2024 Live Updates: ఆల్‌రౌండర్ అశుతోష్‌ శర్మను రూ.20 లక్షల కనీస ధరకు పంజాబ్ కింగ్స్ తీసుకుంది.

  • 19:52 PM

    IPL Auction 2024 Live Updates: అన్‌క్యాప్‌డ్‌ ప్లేయర్ సుమిత్ కుమార్ రూ.20 లక్షల బేస్‌ ప్రైస్‌తో వేలంలోకి రాగా.. రూ.కోటికి ఢిల్లీ దక్కించుకుంది.

  • 19:51 PM

    IPL Auction 2024 Live Updates: అన్‌క్యాప్‌డ్‌ ప్లేయర్ అన్షుల్ కాంబోజ్‌ను రూ.20 లక్షల కనీస ధరకు ముంబై తీసుకుంది.
     

  • 19:45 PM

    IPL Auction 2024 Live Updates: ఆల్‌రౌండర్ నమన్ దీప్‌ను రూ.20 లక్షల కనీస ధరకు ముంబై తీసుకుంది.

  • 19:41 PM

    IPL Auction 2024 Live Updates: శ్రీలంక బౌలర్ నువాన్ తుషార రూ.50 లక్షల కనీస ధరతో వేలంలో పాల్గొన్నాడు. ఆర్‌సీబీ, ముంబై జట్లు పోటీ పడగా.. చివరకు రూ.4 కోట్ల 80 లక్షలకు ముంబై ఇండియన్స్ తీసుకుంది. 

  • 19:39 PM

    IPL Auction 2024 Live Updates: ఆసీస్ బౌలర్ రిజర్డ్ సన్‌ రూ.కోటి 50 లక్షల బేస్‌ప్రైస్‌తో వేలంలోకి రాగా.. ఢిల్లీ, ఆర్‌సీబీ జట్లు పోటీ పడ్డాయి. చివరకు రూ.5 కోట్లకు ఢిల్లీ క్యాపిటల్స్ సొంతం చేసుకుంది. 

  • 19:38 PM

    IPL Auction 2024 Live Updates: బంగ్లా ఫాస్ట్ బౌలర్ ముస్తాఫిజుర్ రెహ్మన్‌ను రూ.2 కోట్ల బేస్‌ప్రైస్‌కు చెన్నై దక్కించుకుంది.

  • 19:28 PM

    IPL Auction 2024 Live Updates: ఆసీస్ బౌలర్ స్పెన్సర్ జాన్సన్‌ రూ.50 లక్షలతో వేలంలోకి రాగా.. గుజరాత్, ఢిల్లీ క్యాపిటల్స్ జట్లు పోటీ పడ్డాయి. రేటు అంతకుఅంత పెరగ్గా.. చివరకు రూ.10 కోట్లకు గుజరాత్ టైటాన్స్ సొంతం చేసుకుంది.
     

  • 19:25 PM

    IPL Auction 2024 Live Updates: ఇంగ్లాండ్ ఆల్‌రౌండర్ డేవిడ్ విల్లీ రూ.2 కోట్లతో వేలంలోకి రాగా.. కనీస ధరకు లక్నో సూపర్ జెయింట్స్ తీసుకుంది.

  • 19:22 PM

    IPL Auction 2024 Live Updates: ఇంగ్లాండ్ ఆల్‌రౌండర్ టామ్ కరన్ రూ.కోటి 50 లక్షల బేస్‌ప్రైస్‌కు ఆర్‌సీబీ దక్కించుకుంది.
     

  • 19:19 PM

    IPL Auction 2024 Live Updates: ఆస్ట్రేలియా ప్లేయర్ టర్నర్‌ను రూ.కోటి బేస్‌ప్రైస్‌కు లక్నో సొంతం చేసుకుంది.

  • 19:18 PM

    IPL Auction 2024 Live Updates: విండీస్ బ్యాట్స్‌మెన్ రూథర్ ఫర్డ్‌ను రూ.కోటి 50 లక్షల బేస్‌ప్రైస్‌కు కేకేఆర్ సొంతం చేసుకుంది.

  • 19:14 PM

    IPL Auction 2024 Live Updates: ఐపీఎల్ వేలంలో జట్లలో మిగిలిన పర్స్ ఎంతంటే..?

    ==> RCB - 6.75 కోట్లు
    ==> KKR - 6.55 కోట్లు
    ==> PBKS - 13.15 కోట్లు
    ==> CSK- 3.20 కోట్లు
    ==> DC - 16.85 కోట్లు
    ==> RR - 0.90 కోట్లు
    ==> MI - 7.95 కోట్లు
    ==> SRH - 3.40 కోట్లు
    ==> LSG - 4.15 కోట్లు
    ==> GT - 21.45 కోట్లు

     

  • 18:33 PM

    IPL Auction 2024 Live Updates: స్పిన్నర్ శ్రేయాస్ గోపాల్‌ను రూ.20 లక్షల కనీస ధరకు ముంబై ఇండియన్స్ తీసుకుంది.

  • 18:31 PM

    IPL Auction 2024 Live Updates: అన్‌క్యాప్‌డ్‌ ప్లేయర్ ఎం.సిద్ధార్థ్ రూ.20 లక్షల బేస్‌ ప్రైస్‌తో వేలంలోకి రాగా.. రూ.2 కోట్ల 40 లక్షలకు లక్నో సూపర్ జెయింట్స్‌ దక్కించుకుంది.

  • 18:27 PM

    IPL Auction 2024 Live Updates: మానవ్ సుతార్‌ను రూ.20 లక్షల కనీస ధరకు గుజరాత్ టైటాన్స్ తీసుకుంది.

  • 18:23 PM

    IPL Auction 2024 Live Updates: రసీక్ దార్‌ను రూ.20 లక్షల బేస్‌ ప్రైస్‌కు ఢిల్లీ క్యాపిటల్స్ సొంతం చేసుకుంది.

  • 18:20 PM

    IPL Auction 2024 Live Updates: బౌలర్ కార్తీక్ త్యాగి రూ.20 లక్షల బేస్‌ ప్రైస్‌తో వేలంలోకి రాగా.. రూ.60 లక్షలకు గుజరాత్ టైటాన్స్ వేలంలో దక్కించుకుంది.
     

  • 18:18 PM

    IPL Auction 2024 Live Updates: అన్‌క్యాప్‌డ్ ప్లేయర్ ఆకాశ్ సింగ్‌ను రూ.20 లక్షల కనీస ధరకు ఎస్‌ఆర్‌హెచ్ తీసుకుంది.

  • 18:16 PM

    IPL Auction 2024 Live Updates: సుశాంత్ మిశ్రా రూ.20 లక్షల బేస్‌ప్రైస్‌తో వేలంలోకి రాగా.. గుజరాత్, ముంబై జట్లు పోటీ పడ్డాయి. చివరకు రూ.2 కోట్ల 20 లక్షలకు గుజరాత్ సొంతం చేసుకుంది.

  • 18:15 PM

    IPL Auction 2024 Live Updates: యాష్ ధయాల్ రూ.20 లక్షల బేస్‌ప్రైస్‌తో వేలంలోకి వచ్చాడు. రూ.5 కోట్లకు ఆర్‌సీబీ దక్కించుకుంది. గుజరాత్ చివరకు పోటీపడి విరమించుకుంది.

  • 18:10 PM

    IPL Auction 2024 Live Updates: కుమార్ కుశాగ్ర భారీ ధర పలికాడు. రూ.20 లక్షలతో వేలంలోకి రాగా.. రూ.7 కోట్ల 20 లక్షలకు ఢిల్లీ క్యాపిటల్స్ సొంతం చేసుకుంది. చివరకు గుజారాత్ పోటీ పడింది.

  • 18:05 PM

    IPL Auction 2024 Live Updates: అన్‌క్యాప్‌డ్ ఆటగాడు రికీ భుయ్‌ను రూ.20 లక్షల కనీస ధరకు ఢిల్లీ క్యాపిటల్స్ దక్కించుకుంది.

  • 18:04 PM

    IPL Auction 2024 Live Updates: అన్‌క్యాప్‌డ్ ప్లేయర్ కోలర్ కాడ్‌మోర్‌ను రూ.40 లక్షల బేస్‌ ప్రైస్‌కు రాజస్థాన్ రాయల్స్ తీసుకుంది.

  • 17:44 PM

    IPL Auction 2024 Live Updates: అన్‌క్యాప్‌డ్ ప్లేయర్ రమణ్‌దీప్ సింగ్‌ను రూ.20 లక్షల బేస్‌ ప్రైస్‌కు కేకేఆర్ సొంతం చేసుకుంది.
     

  • 17:43 PM

    IPL Auction 2024 Live Updates: షారుక్ ఖాన్‌ రూ.20 లక్షల బేస్ ప్రైస్‌తో వేలంలోకి రాగా.. గుజరాత్, పంజాబ్ జట్లు పోటీపడ్డాయి. చివరకు రూ.7 కోట్ల 40 లక్షలకు గుజరాత్ టైటాన్స్ కైవసం చేసుకుంది. 
     

  • 17:34 PM

    IPL Auction 2024 Live Updates: అన్‌క్యాప్‌డ్ ప్లేయర్ ఆర్జిన్ కుల్‌కర్ణిని రూ.20 లక్షల బేస్‌ ప్రైస్‌కు లక్నో సూపర్ జెయింట్స్ దక్కించుకుంది.

  • 17:29 PM

    IPL Auction 2024 Live Updates: అన్‌క్యాప్‌డ్ ప్లేయర్ రఘువంశీని రూ.20 లక్షల బేస్‌ ప్రైస్‌కు కేకేఆర్ సొంతం చేసుకుంది.

  • 17:26 PM

    IPL Auction 2024 Live Updates: అన్‌క్యాప్‌డ్ ప్లేయర్ సమీర్ రిజ్వి రూ.20 లక్షల బేస్‌ ప్రైస్‌ వేలంలోకి రాగా.. చెన్నై, ఢిల్లీ జట్లు రేటు పెంచుకుంటూ పోయాయి. రూ.8 కోట్ల 40 లక్షలకు చెన్నై సూపర్ కింగ్స్‌ దక్కించుకుంది.
     

  • 17:17 PM

    IPL Auction 2024 Live Updates: అన్‌క్యాప్‌డ్ ప్లేయర్ శుభమ్‌ దూబేను రూ.20 లక్షల బేస్‌ ప్రైస్‌ వేలంలోకి రాగా.. అనూహ్యంగా భారీ ధర పలికాడు. రాజస్థాన్ రాయల్స్, ఢిల్లీ క్యాపిటల్స్ తీవ్రంగా పోటీపడ్డాయి. చివరకు రూ.5 కోట్ల 80 లక్షలకు రాజస్థాన్ రాయల్స్‌ సొంతం చేసుకుంది. 
     

  • 17:03 PM

    IPL Auction 2024 Live Updates: పంజాబ్ కింగ్స్ బౌలింగ్ దళం బలంగా మారింది. కగిసో రబడ, అర్ష్‌దీప్ సింగ్, సామ్ కర్రాన్‌, హర్షల్ పటేల్ ప్రధాన బౌలర్లుగా వ్యవహరిస్తారు.  

  • 16:03 PM

    IPL Auction 2024 Live Updates: సెట్ 6లోని ఆటగాళ్లలో ఒక్కరు కూడా అమ్ముడుపోలేదు.

    ==> అకేల్ హోసేన్- వెస్టిండీస్  
    ==> ముజీబ్ రెహమాన్ - ఆఫ్ఘనిస్తాన్ 
    ==> ఆదిల్ రషీద్ - ఇంగ్లాండ్ 
    ==> మహ్మద్ వకార్ సలాంఖైల్- ఆఫ్ఘనిస్తాన్ 
    ==> తబ్రైజ్ షమ్సీ- దక్షిణాఫ్రికా 
    ==> ఇష్ సోధి - న్యూజిలాండ్ 

Trending News