IPL 2022, LSG vs RCB: Bangalore beat Lucknow by 18 runs: ఐపీఎల్ 2022లో భాగంగా లక్నో సూపర్ జెయింట్స్ జట్టుతో జరిగిన మ్యాచులో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు అద్భుత విజయం సాధించింది. 182 పరుగుల లక్ష్య ఛేదనలో లక్నో నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి 163 పరుగులకే పరిమితం అవ్వడంతో బెంగళూరు 18 రన్స్ తేడాతో విజయాన్ని అందుకుంది. కృనాల్ పాండ్యా (42; 28 బంతుల్లో 5x4, 2x 6) టాప్ స్కోరర్. కేఎల్ రాహుల్ (30), మార్కస్ స్టోయినిస్ (24) పరుగులు చేశారు. బెంగళూరు పేసర్ జోష్ హాజిల్‌వుడ్ నాలుగు వికెట్లు పడగొట్టాడు.
లక్ష్య ఛేదనలో లక్నోకు బెంగళూరు పేసర్ హాజిల్‌వుడ్ ఆరంభంలోనే షాక్ ఇచ్చాడు. ఓపెనర్ క్వింటన్ డీకాక్ (3), స్టార్ బ్యాటర్ మనీష్ పాండే (6) వికెట్లను పడగొట్టాడు. పవర్‌ప్లేలోనే రెండు కీలక వికెట్లు కోల్పోయిన లక్నోను కెప్టెన్ కేఎల్ రాహుల్, ఆల్‌రౌండర్ కృనాల్ పాండ్యా ఆదుకున్నారు. అయితే హర్షల్, మ్యాక్స్‌వెల్ వీళ్లిద్దరిని ఔట్ చేశారు. ఆపై రాహుల్ సేన కోలుకునేలా కనిపించలేదు.
ఆడుకుంటారనుకున్న దీపక్ హుడా (13), ఆయుష్ బదోని (13), మార్కస్ స్టొయినిస్ (24) స్వల్పస్కోర్లకే ఔట్ అయ్యారు. దాంతో లక్నో అభిమానులు మ్యాచుపై ఆశలు వదిలేసుకున్నారు. చివర్లో జేసన్ హోల్డర్ (16) దూకుడుగా ఆడినా.. హర్షల్ పటేల్ బౌలింగ్‌లో క్యాచ్ ఔట్ అయ్యాడు. దీంతో 20 ఓవర్లు ముగిసే సరికి లక్నో జట్టు 8 వికెట్ల నష్టానికి 163 పరుగులు మాత్రమే చేయగలిగింది. బెంగళూరు బౌలర్లలో హాజిల్‌వుడ్ నాలుగు వికెట్లతో సత్తా చాటాడు.
That's that from Match 31.@RCBTweets win by 18 runs against #LSG.
Scorecard - https://t.co/9Dwu1D2Lxc #LSGvRCB #TATAIPL pic.twitter.com/oSxJ4fAukI
— IndianPremierLeague (@IPL) April 19, 2022
అంతకుముందు బ్యాటింగ్ చేసిన రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 181 పరుగులు చేసింది. కెప్టెన్ ఫాఫ్ డుప్లెసిస్ (96; 64 బంతుల్లో 11x4, 2x 6) తృటిలో సెంచరీ మిస్ చేసుకున్నాడు. గ్లెన్ మ్యాక్స్‌వెల్ (23), షెబాజ్ అహ్మద్ (26) కీలక పరుగులు చేశారు. స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ గోల్డెన్ డకౌట్ అయ్యాడు. లక్నో బౌలర్లలో జాసన్ హోల్డర్, దుష్మంత్ చమీరా రెండేసి వికెట్లు తీయగా.. కృనాల్ పాండ్యా ఓ వికెట్ తీశాడు.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook