మళ్లీ విశ్వవిజేతగా "మేరీకోమ్"

  

Last Updated : Nov 9, 2017, 05:14 PM IST
మళ్లీ విశ్వవిజేతగా "మేరీకోమ్"

భారతీయ మహిళా బాక్సర్ మేరీకోమ్ మళ్లీ సత్తా చాటింది. ఆసియన్ బాక్సింగ్ ఛాంపియన్ షిప్‌లో అయిదవ గోల్డ్ మెడల్ పొంది చరిత్రను తిరగరాసింది.34 ఏళ్ళ మేరీకోమ్ బుధవారం జరిగిన ఛాంపియన్‌షిప్ ఫైనల్స్‌లో కిమ్‌ హ్యాంగ్‌ మి (ఉత్తర కొరియా)పై 5-0 పాయింట్లతో గెలిచి మళ్లీ విశ్వవిజేతగా నిలిచింది.  ఈ ప్రపంచ చాంపియన్‌షిప్‌లో ఇప్పటికి ఆరుసార్లు ఫైనల్స్‌కు వరకూ వెళ్లిన మేరీకోమ్‌ ఐదుసార్లు స్వర్ణాలు సాధించగా, కేవలం ఒకసారి మాత్రమే రజతాన్ని దక్కించుకుంది. గతంలో 51 కేజీల క్యాటగిరీలో పోటీకి సిద్ధమైన, ఇటీవలే 48 కేజీలకు మారిపోయింది.  మంగళవారం జరిగిన సెమీఫైనల్లో 5-0 స్కోరుతో సుబాసా కొమురా (జపాన్‌) ను ఓడించి సత్తా చాటిన మేరీకోమ్‌.. ఫైనల్‌లో కూడా అదే దూకుడును ప్రదర్శించి ప్రత్యర్థిని కట్టడి చేసింది. పదే పదే పంచ్‌లు విసురుతూ తన అనుభవాన్ని మొత్తం మ్యాచ్‌లో చూపించింది. ఆద్యంతం ఆసక్తికరంగా సాగిన మ్యాచ్‌లో ఆఖరికి గెలుపు మేరీకోమ్‌నే వరించింది. 

Trending News