మహిళల విషయంలో ద్రవిడ్‌ను చూసి నేర్చుకో - పాండ్యకు నెటిజన్లు చురకలు

Updated: Jan 11, 2019, 09:22 PM IST
మహిళల విషయంలో ద్రవిడ్‌ను చూసి నేర్చుకో - పాండ్యకు నెటిజన్లు చురకలు

మహిళ విషయంలో వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన చేసిన పాండ్యాపై సోషల్ మీడియాలో నెటిజన్లు విమర్శల వర్షం కురిపిస్తున్నారు. ఈ క్రమంలో ఓ టీవీ ఛానల్ లో  ద్రవిడ్ కు ఇంటర్వ్యూకు సంబంధించిన ఓ వీడియో పోస్ట్ చేసి.. పాండ్యాకు ద్రవిడ్ ను చూసి నేర్చుకోవాలని  నెటిజన్ల సలహా ఇస్తున్నారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది.

గత కొనేళ్ల క్రితం నిర్వహించిన ‘ఎంటీవీ బకరా’ అనే కార్యక్రమంలో  రాహుల్ ద్రవిడ్  పాల్గొన్నాడు. ఈ షోలో భాగంగా మహిళా జర్నలిస్టు ద్రవిడ్ ను ఇంటర్వ్యూ చేసి చివర్లో తనను పెళ్లి చేసుకోమంటూ ఒత్తిడి చేయసాగింది. వాస్తవానికి ద్రవిడ్‌ను ఆటపట్టించడానికే అలా చేసింది... అయితే ఈ  విషయం తెలియక ద్రవిడ్.. ఒక్కసారిగా ఆయోమయానికి గురై...ఆమెను కూల్‌గా ఉండమని చెప్పి బయటకు వెళ్లడానికి ప్రయత్నించాడు... కానీ ద్రవిడ్‌ను వెళ్లనీకుండా ఆమె తండ్రిలా నటించే వ్యక్తి కూడా  ఒప్పించడానికి ప్రయత్నించాడు. ద్రవిడ్ కాస్త నెమ్మదించి పెళ్లి చేసుకోవాలనే ఆలోచన కంటే ముందు చదువుమీద దృష్టి పెట్టాలని ఆ మహిళా అభిమానికి సలహా ఇచ్చాడు.

ఓ టీవీ షోలో క్రికెటర్ పాండ్యా మహిళల పట్ల వివాదాస్పదంగా మాట్లాడిన నేపథ్యంలో  ఈ  వీడియో పోస్టు చేసి మహిళలపట్ల ఎలా ఉండాలో ద్రవిడ్ చూసి నేర్చుకోవాలంటూ సలహా ఇస్తున్నారు. ప్రస్తుతం సోషల్ మీడియాలో ఈ వార్త వైరల్‌గా మారింది.