వ్యూహం మార్చిన కివీస్.. మరో భంగపాటు తప్పదా?

NZVsIND 3rd T20 Live Updates : తొలి రెండు టీ20ల్లో భారత్ ఛేజింగ్ కావడంతో ఈజీగా మ్యాచ్‌లను గెలిచింది. అయితే భారత్ దూకుడుకు అడ్డుకట్ట వేయాలంటే సెకండ్ బ్యాటింగ్ అవసరమని భావించిన విలియమ్సన్ ఫీల్డింగ్ ఎంచుకున్నాడు.

Last Updated : Jan 29, 2020, 12:52 PM IST
వ్యూహం మార్చిన కివీస్.. మరో భంగపాటు తప్పదా?

భారత్‌తో జరగనున్న మూడో ట్వంటీ20 మ్యాచ్‌లో ఆతిథ్య న్యూజిలాండ్ టాస్ నెగ్గింది. టాస్ నెగ్గిన కివీస్ కెప్టెన్ ఫీల్డింగ్ ఎంచుకున్నాడు. తొలి రెండు టీ20ల ఫలితాలతో కివీస్ ఈసారి వ్యూహం మార్చింది. ఐదు టీ20ల సిరీస్‌లో భాగంగా జరిగిన రెండు టీ20ల్లో భారత్ చేతిలో పరాజయం పాలైన కివీస్ మూడో టీ20లో నెగ్గి బోణీ కొట్టాలని భావిస్తోంది. సిరీస్‌లో 2-0తో ఆధిక్యంలో ఉన్న టీమిండియా ఈ మ్యాచ్‌లోనూ నెగ్గి సిరీస్ కైవసం చేసుకోవాలని భావిస్తోంది.

న్యూజిలాండ్ జట్టులో ఓ మార్పుతో బరిలోకి దిగుతోంది. బ్లెయిర్ టిక్‌నర్‌కు ఉద్వాసన పలికిన మేనేజ్ మెంట్ అతడి స్థానంలో స్కాట్ కుగ్లెజన్ కు చోటిచ్చింది. మరోవైపు విరాట్ కోహ్లీ సేన ఏ మార్పుల్లేకుండా బరిలోకి దిగింది. హామిల్టన్‌ వేదికగా జరిగిన గత నాలుగు మ్యాచ్‌ల్లో ఫస్ట్ బ్యాటింగ్ చేసిన జట్టునే విజయం వరించగా.. టాస్ నెగ్గిన విలియమ్సన్ టాస్ నెగ్గడం అందర్నీ ఆశ్చర్య పరుస్తోంది. పరిస్థితి గమనిస్తే కివీస్‌కు ఈ మ్యాచ్‌లోనే నిరాశ ఎదురై.. సిరీస్ కోల్పోయే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి.

New Zealand: 
Martin Guptill, Colin Munro, Kane Williamson (capt), Colin de Grandhomme, Ross Taylor, Tim Seifert (wk), Mitchell Santner, Tim Southee, Ish Sodhi, Hamish Bennett, Scott Kuggeleijn.

India:
Rohit Sharma, KL Rahul (wk), Virat Kohli (capt), Shreyas Iyer, Manish Pandey, Shivam Dube, Ravindra Jadeja, Shardul Thakur, Yuzvendra Chahal, Mohammed Shami, Jasprit Bumrah.

జీ హిందుస్తాన్ తెలుగు టీవీ లైవ్ లింక్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి. Watch Zee Hindustan Telugu live here..

Trending News