రాహుల్‌కి ప్రశంసలు.. పాక్ క్రికెట్ బోర్డుకి చురకలు..

శుభ్‌మన్ గిల్ లాంటి ఆటగాళ్లకు సానపట్టిన క్రెడిట్ రాహుల్ ద్రావిడ్‌కే దక్కుతుందన్న రమీజ్ రజా

Last Updated : Feb 1, 2018, 01:25 PM IST
రాహుల్‌కి ప్రశంసలు.. పాక్ క్రికెట్ బోర్డుకి చురకలు..

పాకిస్థాన్ క్రికెట్‌కి రాహుల్ ద్రావిడ్ లాంటి క్రికెట్ కోచ్ కావాలని అన్నారు పాక్ మాజీ క్రికెటర్ రమీజ్ హసన్ రజా. న్యూజీలాండ్‌లో జరిగిన ఐసీసీ అండర్ 19 వరల్డ్ కప్ సెమీ ఫైనల్స్‌లో పాక్ భారత్ చేతిలో ఘోర పరాజయం పాలవడంపై తీవ్ర అసహనం వ్యక్తంచేసిన రమీజ్ రజా.. భారత్‌లో యువ ఆటగాళ్లకు రాహుల్ ద్రావిడ్ మెరుగుపెడుతున్న తీరు అభినందనీయం అని అన్నారు. అందుకే పాకిస్థాన్‌కి కూడా అటువంటి కోచ్‌ల సహాయం ఎంతో అవసరం అని రమీజ్ రజా అభిప్రాయపడ్డారు.

పాక్‌పై సెమీ ఫైనల్ మ్యాచ్‌లో భారత ఆటగాళ్లు రెచ్చిపోయిన తీరు అద్భుతం. శుభ్‌మన్ గిల్ లాంటి ఆటగాళ్లకు సానపట్టిన క్రెడిట్ రాహుల్ ద్రావిడ్‌కే దక్కుతుంది. భారత ఆటగాళ్లకు రాహుల్ ద్రావిడ్ లాంటి కోచ్ వుండటం వారికి మరింత మరింత కలిసొచ్చే అంశం అంటూ మిస్టర్ డిపెండబుల్‌ని అభినందనల్లో ముంచెత్తుతూనే పాక్ క్రికెట్ బోర్డ్‌లోని లోపాలని తనదైన స్టైల్లో వేలెత్తి చూపించాడు రజా. 

Trending News