Pondicherry T10 League: టీ10 లీగ్‌లో సరికొత్త రికార్డు..యువీని తలపించిన పాండే ఇన్నింగ్స్..!

Pondicherry T10 League: పాండిచ్చేరి టీ10 లీగ్‌లో అరుదైన రికార్డు నమోదు అయ్యింది. ఈ ఫీట్‌ అందుకున్న తొలి ఆటగాడిగా పేట్రియాట్స్‌ ప్లేయర్ కృష్ణ పాండే నిలిచాడు.

Written by - Alla Swamy | Last Updated : Jun 4, 2022, 09:12 PM IST
  • టీ10 లీగ్‌లో అరుదైన రికార్డు
  • ఆరు బంతుల్లో ఆరు సిక్సర్లు బాదిన ఆటగాడు
  • తొలి ఆటగాడిగా రికార్డు
Pondicherry T10 League: టీ10 లీగ్‌లో సరికొత్త రికార్డు..యువీని తలపించిన పాండే ఇన్నింగ్స్..!

Pondicherry T10 League: పాండిచ్చేరి టీ10 లీగ్‌లో అరుదైన రికార్డు నమోదు అయ్యింది. ఈ ఫీట్‌ అందుకున్న తొలి ఆటగాడిగా పేట్రియాట్స్‌ ప్లేయర్ కృష్ణ పాండే నిలిచాడు. ఆరు బంతుల్లో ఆరు సిక్సర్లు బాది సరికొత్త రికార్డు సృష్టించాడు. రాయల్స్‌తో జరిగిన మ్యాచ్‌లో వీరవిహారం చేశాడు. ఆకాశమే హద్దుగా చెలరేగిపోయాడు. వరుసగా ఆరు భారీ సిక్సర్లు కొట్టాడు. ఆరో ఓవర్‌ను నితీష్‌ కుమార్‌ బౌలింగ్ చేశాడు. ఆ ఓవర్‌లో పాండే సునామీ సృష్టించాడు.

కేవలం 19 బంతులు ఎదుర్కోని 12 సిక్స్‌లు, 2 ఫోర్లతో 83 పరుగులు చేశాడు. ఈమ్యాచ్‌లో అనూహ్యంగా పేట్రియాట్స్ 4 పరుగులతో తేడాతో ఓడిపోయింది. 158 పరుగుల టార్గెట్‌తో బరిలోకి దిగిన పేట్రియాట్స్ నిర్ణీత 10 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి 153 పరుగులు చేయగల్గింది. పాండే వీరవిహారం చేసినా.. ఇతర ఆటగాళ్లు కీలక సమయంలో ఔట్ కావడంతో మ్యాచ్‌ చేజారింది. ఐనా పాండే తన ఆటతీరుతో అందర్నీ అలరించాడు.

మరోవైపు టీ20ల్లో ఈఫీట్‌ను భారత ఆటగాడు యువరాజ్‌ సింగ్ అందుకున్నాడు. 2007 టీ20 వరల్డ్ కప్‌లో ఇంగ్లండ్‌ జరిగిన మ్యాచ్‌లో రికార్డు సృష్టించాడు. బ్రాండ్ వేసిన ఓవర్‌లో రెచ్చిపోయాడు. ఇటు శ్రీలంకతో జరిగిన టీ20 మ్యాచ్‌లో విండీస్ మాజీ కెప్టెన్ పొలార్డ్‌ సైతం ఈరికార్డును సాధించాడు. ఐతే టీ10 టోర్నీలో ఆరు సిక్సర్లు బాదిన తొలి ఆటగాడిగా కృష్ణ పాండే రికార్డు సృష్టించాడు.

Also read: Corbevax: దేశంలో బూస్టర్ డోస్‌గా కార్బెవాక్స్‌..డీసీజీఐ గ్రీన్‌సిగ్నల్..!

Also read:Pawan Kalyan Comments: వచ్చే ఎన్నికల్లో తగ్గేదేలే..పార్టీ కార్యకర్తలకు పవన్ కళ్యాణ్ దిశానిర్దేశం..!

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి TwitterFacebook

 

 

Trending News