PKL Telugu Titans Match: ప్రొ కబడ్డీ లీగ్ సీజన్-8లో తెలుగు టైటాన్స్ టీమ్ మరో ఓటమిని చవిచూసింది. తొలి విజయం కోసం తెలుగు టైటాన్స్‌కు ఎదురు చూపులు కొనసాగుతున్నాయి. గత నాలుగు మ్యాచ్‌ల్లో రెండింట్లో ఓడి.. రెండింటిని డ్రా చేసుకున్న టైటాన్స్.. అయిదో మ్యాచ్‌లో పరాజయం చవిచూసింది.
పీకేఎల్ లో సోమవారం జరిగిన మ్యాచులో టైటాన్స్ 30-31తో పట్నా పైరేట్స్ చేతిలో పోరాడి ఓడింది. ఈ మ్యాచ్‌లో ఆరంభం నుంచి పైరేట్స్ ఆధిపత్యం ప్రదర్శించింది. టైటాన్స్ నుంచి ప్రతిఘటన ఎదురైనా ముందంజలో నిలిచింది.
పట్నా కెప్టెన్ ప్రశాంత్, సచిన్, మోను గోయత్ రాణించడం వల్ల అర్ధభాగంలోపే ఒకసారి తెలుగు టైటాన్స్ ను ఆలౌట్ చేసి.. విరామ సమయానికి 18-13తో పైచేయి సాధించింది. అయితే విరామం తర్వాత తెలుగు టైటాన్స్ పుంజుకుంది. పట్నాను ఆలౌట్ చేయడమే కాక ఆపై 24-24తో స్కోరు సమం చేసి మ్యాచ్‌లోకి వచ్చింది.
స్కోరు సమం అయిన పట్నా పైరేట్స్ పట్టువదల్లేదు. అవకాశాలను జారవిడవలేదు. మరో అయిదు నిమిషాల్లో మ్యాచ్ ముగుస్తుందనగా ఆ జట్టు 5 పాయింట్ల ఆధిక్యంతో విజయం దిశగా సాగింది. కానీ అనూహ్యంగా విజృంభించిన టైటాన్స్ వరుస పాయింట్లతో 30-29తో గెలుపు ముంగిట నిలిచింది. అయితే చివరి నిమిషంలో అంకిత్ అద్భుతమైన రైడ్.. సచిన్ గొప్ప ట్యాకిల్‌తో పట్నా 31-30తో గెలిచి టైటాన్స్‌కు నిరాశను మిగిల్చింది.
బంగాల్ వారియర్స్ భళా
ప్రొ కబడ్డీ లీగ్ లో సోమవారం జరిగిన మరో మ్యాచ్‌లో మణీందర్‌సింగ్ (13 పాయింట్లు) అదరగొట్టడంతో డిఫెండింగ్ ఛాంపియన్ బెంగాల్ వారియర్స్ 31-28తో జైపుర్ పింక్ పాంథర్స్‌ను ఓడించింది. అర్ధభాగం ముగిసే సమయానికి 18-14తో ఆధిక్యంలో నిలిచిన బెంగాల్‌కు ద్వితీయార్ధంలో ప్రత్యర్థి నుంచి గట్టి పోటీ ఎదురైంది.
కానీ ఒత్తిడికి నిలిచిన బెంగాల్ ఆఖర్లో రెండు పాయింట్లు సాధించి విజయాన్ని అందుకుంది. బెంగాల్‌కు ఆరు మ్యాచ్‌ల్లో ఇది మూడో గెలుపు. ఈ మ్యాచ్‌లో మణీందర్ సింగ్ 800 పీకేఎల్ రైడ్ పాయింట్ల మైలురాయిని చేరుకోవడం విశేషం.
Also Read: IND Vs SA 2nd Test: తొలిరోజు చేతులెత్తేసిన ఇండియన్ బ్యాటర్లు.. దక్షిణాఫ్రికా స్కోరు 35/1
Also Read: Jayasuriya Ex Girlfriend: భార్య సెక్స్ టేప్ లీక్ చేసిన మాజీ క్రికెటర్.. ప్రతీకారం తీర్చుకునేందుకే!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి