Viral Photo: పుష్ప రాజ్‌గా టీమిండియా స్టార్ ప్లేయర్స్.. ఎవరు బాగా సెట్ అయ్యారంటే?

Ravindra Jadeja as Pushparaj: టీమిండియా స్టార్ క్రికెటర్ రవీంద్ర జడేజా పుష్ప రాజ్ గెటప్‌లోకి మారిపోయాడు. అచ్చు అల్లు అర్జున్ మాదిరే నోట్లో బీడీ పెట్టుకుని అలరించాడు.

Written by - ZH Telugu Desk | Last Updated : Feb 9, 2022, 12:43 PM IST
  • బన్నీ ఊరమాస్‌ యాంగిల్‌
  • పుష్ప రాజ్‌గా టీమిండియా స్టార్ ప్లేయర్స్
  • పుష్ప రాజ్‌గా ఎవరు బాగా సెట్ అయ్యారంటే?
Viral Photo: పుష్ప రాజ్‌గా టీమిండియా స్టార్ ప్లేయర్స్.. ఎవరు బాగా సెట్ అయ్యారంటే?

Ravindra Jadeja is really looking like Pushparaj: ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, కన్నడ సోయగం రష్మిక మందాన్న నటించిన 'పుష్ప: ది రైజ్‌' సినిమా భారీ హిట్ కొట్టిన విషయం తెలిసిందే. ప్రస్తుతం దేశవ్యాప్తంగా ఏడ చూసినా.. పుష్ప మేనియానే నడుస్తోంది. ఎవరిని కదిలించినా పుష్ప సినిమాలోని 'శ్రీవల్లి', 'ఊ అంటావా మావా.. ఊఊ అంటావా మావా' పాటలు పాడడం, టిక్‌టాక్ వీడియోలు, ఇన్‌స్టా రీల్స్ రూపొందిస్తున్నారు. మరోవైపు అల్లు అర్జున్ పుష్ప రాజ్ గెటప్‌ కూడా చాలా ఫేమస్ అయింది. పుష్ప రాజ్ గెటప్‌లోకి అభిమానులే కాకుండా ప్రముఖులు కూడా మారుతున్నారు. ఇందులో టీమిండియా క్రికెటర్లు కూడా ఉన్నారు.  

అందరికంటే ముందుగా టీమిండియా స్టార్ క్రికెటర్ రవీంద్ర జడేజా పుష్ప రాజ్ గెటప్‌లోకి మారిపోయాడు. అచ్చు అల్లు అర్జున్ మాదిరే నోట్లో బీడీ పెట్టుకుని అలరించాడు. 'పుష్ప అంటే ఫ్లవర్ అనుకున్నావా.. ఫైరూ' అంటూ తెలుగు డైలాగ్ కూడా రాసాడు జడ్డు. ఆపై కెప్టెన్ రోహిత్ శర్మ, మాజీ సారథి విరాట్ కోహ్లీ, వైస్ కెప్టెన్ కేఎల్ రాహుల్ కూడా పుష్ప రాజ్ గెటప్‌లోకి మారిపోయారు. ఈ పోస్టర్లకు అభిమానుల నుంచి మంచి స్పందన వచ్చింది. 

'రోహిషాబ్ ఫ్యాన్ గర్ల్' అనే ట్విట్టర్ యూసర్ పుష్ప రాజ్ గెటప్‌లో ఉన్న రవీంద్ర జడేజా, విరాట్ కోహ్లీ, కేఎల్ రాహుల్, రోహిత్ శర్మ పోటోలను జతచేసి.. పుష్పరాజ్‌గా ఎవరు సెట్ అయ్యారో నిజాయితీగా చెప్పండి అని ప్రశ్నించాడు. చాలా మంది ఫాన్స్ రవీంద్ర జడేజా అచ్చు పుష్ప రాజ్‌గా ఉన్నదంటూ ట్వీట్లు చేస్తున్నారు. జడేజా తర్వాత రోహిత్ శర్మకి ఓటేశారు. రాహుల్, కోహ్లీలు అంతగా సెట్ అవలేదని కామెంట్లు చేస్తున్నారు. ఈ ట్వీట్ నెట్టింట వైరల్ అయింది. 

మరోవైపు పుష్ప సినిమా రిలీజ్ అయినప్పటినుంచి స్టార్ క్రికెటర్లు వరుసగా 'శ్రీవల్లి' పాటలో అల్లు అర్జున్ వేసిన స్లిప్పర్ స్టెప్‌ను రిక్రియేషన్ చేస్తున్నారు. డేవిడ్ వార్నర్, రవీంద్ర జడేజా, సురేష్ రైనా, హార్దిక్ పాండ్యా, సూర్యకుమార్ యాదవ్, ఇషాన్ కిషన్, డ్వేన్ బ్రావో, షకిబుల్ హాసన్ శ్రీవల్లి స్టెప్ చేసారు. ఆ వీడియోను తమ తమ సోషల్ మీడియా హ్యాండిల్స్‌లో పంచుకున్నారు. దాంతో ఆ వీడియో తెగ వైరల్ అయ్యాయి. ఎర్రచందనం స్మగ్లింగ్‌ నేపథ్యంలో తెరకెక్కిన 'పుష్ప'లో అల్లు అర్జున్‌ 'పుష్ప రాజ్‌'గా నటించారు. బన్నీ ఊరమాస్‌ యాంగిల్‌ అందరికి బాగా నచ్చింది. 

Also Read: Liger Prime Video: భారీ మొత్తానికి అమ్ముడైన 'లైగర్' నాన్ థియేట్రికల్ రైట్స్.. పుష్ప కంటే డబుల్!!

Also Read: Sampreeti Yadav: 24 ఏళ్లకే 50 ఇంటర్వ్యూలు.. చివరికి గూగుల్‌లో కోటి రూపాయల ఉద్యోగం!!

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి TwitterFacebook 

Trending News