PBKS vs RCB: డుప్లెసిస్ వీర బాదుడు... పంజాబ్‌కు భారీ టార్గెట్ సెట్ చేసిన ఆర్సీబీ...

PBKS vs RCB: ముంబైలోని డీవై పాటిల్ స్టేడయంలో పంజాబ్‌ కింగ్స్‌తో జరిగిన మ్యాచ్‌లో బెంగళూరు రాయల్ ఛాలెంజర్స్ బ్యాటింగ్‌లో దుమ్ము రేపింది. పంజాబ్‌కి 206 పరుగుల భారీ లక్ష్యాన్ని నిర్దేశించింది.

Written by - ZH Telugu Desk | Last Updated : Mar 27, 2022, 09:55 PM IST
  • పంజాబ్ వర్సెస్ ఆర్సీబీ మ్యాచ్
  • బ్యాటింగ్‌లో దుమ్మురేపిన ఆర్సీబీ
  • డుప్లెసిస్ వీర విహారం.. 87 పరుగులు
PBKS vs RCB: డుప్లెసిస్ వీర బాదుడు... పంజాబ్‌కు భారీ టార్గెట్ సెట్ చేసిన ఆర్సీబీ...

PBKS vs RCB: పంజాబ్‌ కింగ్స్‌తో మ్యాచ్‌లో బెంగళూరు రాయల్ ఛాలెంజర్స్ బ్యాటింగ్‌లో దుమ్ము రేపింది. టాస్ ఓడి బ్యాటింగ్‌కి దిగిన ఆర్సీబీ తొలి నుంచి దూకుడుగా ఆడి.. పంజాబ్ ముందు 206 పరుగుల భారీ లక్ష్యాన్ని ఉంచింది. ఈ క్రమంలో ఆ జట్టు కేవలం రెండే వికెట్లు నష్టపోయింది. ఆర్సీబీ ప్లేయర్స్‌లో కెప్టెన్ డుప్లెసిస్ బ్యాట్‌తో వీర విహారం చేశాడు. కేవలం 57 బంతుల్లోనే 7 సిక్స్‌లు, మూడు ఫోర్లతో 87 పరుగులు బాదాడు.

తొలి వికెట్‌కు ఓపెనర్లు డుప్లెసిస్ అనుజ్ రావత్‌లు 50 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పారు. ఆరో ఓవర్‌లో అనుజ్ రాహుల్ చహర్ బౌలింగ్‌లో పెవిలియన్ చేరాడు. ఆ తర్వాత విరాట్, డుప్లెసిస్ కలిసి పరుగుల వరద పారించారు. రెండో వికెట్‌కి ఈ ఇద్దరు 118 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పారు. టీమ్ స్కోర్ 168 పరుగుల వద్ద డుప్లెసిస్ ఔట్ అవడంతో దినేశ్ కార్తీక్ క్రీజులోకి వచ్చాడు.

దినేశ్ కార్తీక్ కేవలం 14 బంతుల్లో 3 ఫోర్లు, 3 సిక్స్‌లతో 32 పరుగులు చేశాడు. విరాట్ కోహ్లి 29 బంతుల్లో రెండు సిక్స్‌లు, ఒక ఫోర్‌తో 41 పరుగులు చేశాడు. చివరలో ఈ ఇద్దరి మెరుపులతో ఆర్సీబీ 205 పరుగుల భారీ స్కోర్ సాధించగలిగింది.  ఈ భారీ టార్గెట్‌ను పంజాబ్ చేధిస్తుందా లేక చతికిలపడుతుందా చూడాలి.

Also Read: Video: రామ్ చరణ్ బర్త్ డే వేడుకల్లో ఎన్టీఆర్, రాజమౌళి.. ఎంతలా ఎంజాయ్ చేశారో చూడండి

Also read: Pooja Hegde: టైట్‌ఫిట్ అథ్లెటిక్ డ్రెస్‌తో మెరుస్తున్న రాధేశ్యామ్ హీరోయిన్ పూజా హెగ్డే

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి. 

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

 

Trending News