Red Card System: క్రికెట్‌లో త్వరలో పుట్‌బాల్ తరహా రెడ్ కార్డ్, తొలిసారిగా కరేబియన్ ప్రీమియర్ లీగ్‌లో

Red Card System: ప్రపంచవ్యాప్తంగా అత్యధికంగా క్రేజ్ కలిగిన క్రికెట్ రోజురోజుకూ మారుతోంది. కొత్త నియమాలు వచ్చి చేరుతున్నాయి. క్రికెట్ వేగం కూడా పెంచుకుంటోంది. త్వరలో మరో కొత్త నిబంధన అమల్లోకి రానుంది. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.  

Written by - Md. Abdul Rehaman | Last Updated : Aug 13, 2023, 10:32 PM IST
Red Card System: క్రికెట్‌లో త్వరలో పుట్‌బాల్ తరహా రెడ్ కార్డ్, తొలిసారిగా కరేబియన్ ప్రీమియర్ లీగ్‌లో

Red Card System: క్రికెట్ ఇంతకుముందులా లేదు. క్రికెట్ ఇప్పుడు వేగం పుంజుకుంది. ఎప్పటికప్పుడు కొత్త నియమ నిబందనలతో మరింత రసవత్తరంగా మార్చేందుకు వివిధ క్రికెట్ బోర్డులు ప్రయత్నాలు చేస్తున్నాయి. పవర్ ప్లే, ఇంపాక్ట్ ప్లేయర్, ఫ్రీ హిట్ ఇవన్నీ గతంలో లేని నిబంధనలు. ఇప్పుడు మరో నిబంధన రానుంది. కరేబియన్ క్రికెట్ బోర్డు దీనికి శ్రీకారం చుట్టనుంది.

క్రికెట్‌లో స్లో ఓవర్ రేట్ అతి పెద్ద సమస్యగా మారింది. దీనికి చెక్ పెట్టేందుకు ఐసీసీ గత ఏడాది కొన్ని మార్పులు చేసింది. టీ20 షెడ్యూల్‌లో నిర్ణీత సమయంలో ఓవర్లు పూర్తి చేయకపోతే తరువాత వేసే ఓవర్లలో ఫీల్జింగ్ సెట్టింగ్ మార్పులుంటాయి. అంటే 30 గజాల పరిధిలో ఓ ఫీల్డర్ ఎక్కువగా మొహరించాల్సి వస్తుంది. తాజాగా వన్డేల్లో ఇదే నిబంధన అమలు చేయాలని ఐసీసీ నిర్ణయించింది. ఐసీసీ నిబంధన ఏ మేరకు ఫలితాలు సాధిస్తుందో..స్లో ఓవర్ రేటు నియంత్రణ సాధ్యమౌతుందో లేదో గానీ వెస్టిండీస్ క్రికెట్ బోర్డ్ కొత్తగా మరో నిబంధన ప్రవేశపెట్టనుంది. అది రెడ్ కార్డ్ ప్రయోగం. 

రెడ్ కార్డ్ అనేది సాధారణంగా ఫుట్‌బాల్ ఆటలో ఉంటుంది. ఎవరైనా ఆటగాడు అతిగా ప్రవర్తించినా లేక మరో ఆటగాడిని కావాలని గాయపర్చినా అతడిని బయటకు పంపించేందుకు రిఫరీ వాడే ఆయుధం ఇది. ఇప్పుడు క్రికెట్‌లో కూడా ఇదే రెడ్ కార్డు ప్రయోగించేందుకు రంగం సిద్ధం చేస్తోంది వెస్టిండీస్ క్రికెట్ బోర్డు. తొలిసారిగా కరేబియన్ ప్రీమియం లీగ్‌లో రెడ్ కార్డ్ ప్రయోగించేందుకు సిద్ధమైంది. దీనికి కారణాలు లేకపోలేదు. ఈ టోర్నీలో టీ20 మ్యాచ్‌లు నిర్ణీత సమయంలో పూర్తి కావడం అనేది ప్రశ్నార్ధకంగా మారిపోయింది. సమయం పెరుగుతూనే ఉంది కానీ స్లో ఓవర్ రేట్ తగ్గడం లేదు. అందుకే దీన్ని నియంత్రించేందుకు రెడ్ కార్డ్ ప్రయోగం సముచితమని అనుకుంటున్నామని కరేబియన్ ప్రీమియర్ లీగ్ ఆపరేషన్స్ డైరెక్టర్ మైకేల్ హాల్ చెప్పాడు. మ్యాచ్ ఆలస్యమైతే ఫ్యాన్స్ కూడా అసహనానికి గురవుతారని..షెడ్యూల్‌లోగా మ్యాచ్ పూర్తి చేయాల్సిన బాధ్యత ప్లేయర్లు, ఫ్రాంచైజీలపై ఉంటుందన్నాడు. పెనాల్టీ వేసే కంటే ఇలా రెడ్ కార్డ్ ప్రయోగం అయితే స్లో ఓవర్ రేటు కచ్చితంగా తగ్గుతుందని వెస్టిండీస్ క్రికెట్ బోర్డు యోచిస్తోంది. 

క్రికెట్‌లో రెడ్ కార్డ్ ప్రయోగం ఎలా ఉంటుంది

18వ ఓవర్ షెడ్యూల్ సమయానికి పూర్తి కాకపోతే మిగిలిన రెండు ఓవర్లలో ఒక ఫీల్డర్ 30 చదరపు గజాల్లో మొహరించాల్సి ఉంటుంది. ఆఖరి ఓవర్ కూడా ఆలస్యమైతే మరో ఇద్దరు 30 చదరపు గజాల పరిధిలోకి రావల్సి ఉంటుంది. అంటే సర్కిల్ అవతల కేవలం ఆరుగురే ఉంటారు. ఈ సమయంలో అంటే 20వ ఓవర్‌లో రెడ్ కార్డ్ సిస్టమ్ అమల్లోకి వస్తుంది. చివరి ఓవర్‌లో ఓ ఆటగాడిని రెడ్ కార్డు ద్వారా బయటకు పంపిస్తారు. ఎవరికి పంపించాలనేది కెప్టెన్ తీసుకునే నిర్ణయం. ఒకవేళ బ్యాటింగ్ జట్టే కావాలని కాలయాపన చేస్తే రెండు సార్లు వార్నింగ్ తరువాత 5 పరుగులు పెనాల్టీ కట్ ఉంటుంది. 

కరేబియన్ ప్రీమియర్ లీగ్ ఒక్కొక్క టీ20 మ్యాచ్‌కు 85 నిమిషాలు సమయం కేటాయించింది. 18వ ఓవర్‌ను 76 నిమిషాల 30 సెకన్లలో, 19వ ఓవర్‌ను 80 నిమిషాల 45 సెకన్లలో పూర్తి చేయాలి. అంటే ఒక్కొక్క ఓవర్‌కు 4 నిమిషాల 1 సెకన్ల సమయం ఉంటుంది. ఆలస్యమయ్యే కొద్దీ రెడ్ కార్డ్ అవకాశాలు పెరుగుతుంటాయి. ప్రయోగాత్మకంగా కరేబియన్ ప్రీమియర్ లీగ్‌లో ప్రవేశపెడుతున్న ఈ నిబంధన ఆశించిన ఫలితాలు సాధిస్తే కచ్చితంగా ఐసీసీ ప్రపంచవ్యాప్తంగా అమలు చేసే అవకాశాలున్నాయి. ఎందుకంటే స్లో ఓవర్ రేటు సమస్య ఒక్క వెస్టిండీస్‌కే కాదు అంతటా ఉన్నదే. 

Also read: IND Vs WI 5th T20 Updates: ఫైనల్‌ పోరులో టాస్ గెలిచిన భారత్.. ప్లేయింగ్ 11 ఇదే..!

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     

Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     

Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitte , Facebook

Trending News