VVS Laxman praises Bus Driver Sushil Kumar for saved Rishabh Pant Life: టీమిండియా యువ వికెట్ కీపర్ రిషబ్ పంత్ ఘోరమైన రోడ్డు ప్రమాదానికి గురైన విషయం తెలిసిందే. కుటంబ సభ్యులతో కలిసి నూతన సంవత్సర వేడుకల్లో పాల్గొనేందుకు ఢిల్లీ నుంచి తన స్వస్థలమైన రూర్కికి వెళ్తూ రోడ్డు ప్రమాదంకు గురయ్యాడు. శుక్రవారం (డిసెంబర్ 30) తెల్లవారుజామున 5.30 గంటలకు పంత్ ప్రయాణిస్తున్న కారు ఢిల్లీ-డెహ్రాడూన్ జాతీయ రహదారిలో రూర్కీ నర్సన్ సరిహద్దు వద్ద హమ్మద్‌పూర్ ఝల్ వద్ద అదుపు తప్పి డివైడర్‌ను ఢీకొట్టింది. తీవ్రంగా గాయాలు అయిన అతడు ప్రస్తుతం డెహ్రాడూన్‌లోని ఒక ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు.
ప్రమాదం జరిగిన వెంటనే రిషబ్ పంత్ కారు మెర్సిడెస్ ఏఎమ్‌జి జిఎల్‌ఇ 43 4మ్యాటిక్ కూపేలో మంటలు చెలరేగాయి. దాంతో కారు అద్దం పగలగొట్టి బయటకు వచ్చేందుకు పంత్ ప్రయత్నించాడు. అదే సమయంలో అటుగా వెళ్తున్న హరియాణా బస్సు డ్రైవర్ సుశీల్ కుమార్ తన వాహనాన్ని రోడ్డు పక్కన ఆపేసి ఘటనా స్థలానికి పరిగెత్తుకొచ్చాడు. కారు కిటికీలో నుంచి సగం బయటకు వచ్చిన పంత్‌ను బయటకు లాగాడు. ఓ బెడ్‌షీట్‌తో పంత్ శరీరాన్ని కప్పాడు. వెంటనే అంబులెన్సుకు సమాచారం అందించి.. అందులో ఎక్కించాడు.
అయితే బస్సు డ్రైవర్ సుశీల్ కుమార్ క్రికెట్ చూడడు కాబట్టి రిషబ్ పంత్ ఎవరో అతడికి తెలియదు. తాను క్రికెటర్ పంత్‌ను అని, తన తల్లికి ఫోన్ చేయమని చెప్పాడు. సుశీల్ కుమార్ రిషబ్ తల్లికి కాల్ చేయగా.. ఆమె ఫోన్ స్విచాఫ్ వచ్చిందని సుశీల్ తెలిపాడు. కారులో పంత్ నీలం రంగు బ్యాగ్ ఉందని, అందులో రూ.7,000 నగదు ఉందని చెప్పారు. బ్యాగ్, డబ్బును అంబులెన్స్‌లో ఉన్న అతడికి అప్పగించాం అని బస్సు డ్రైవర్ సుశీల్ పేర్కొన్నాడు.
Gratitude to #SushilKumar ,a Haryana Roadways driver who took #RishabhPant away from the burning car, wrapped him with a bedsheet and called the ambulance.
We are very indebted to you for your selfless service, Sushil ji 🙏 #RealHero pic.twitter.com/1TBjjuwh8d— VVS Laxman (@VVSLaxman281) December 30, 2022
రిషబ్ పంత్‌కు సాయం చేసిన బస్సు డ్రైవర్ సుశీల్ కుమార్‌కు టీమిండియా మాజీ లెజెండ్, హైదరాబాద్ సొగసరి వీవీఎస్ లక్ష్మణ్ కృతజ్ఞతలు తెలిపారు. సుశీల్.. నువ్ ఓ రియల్ హీరో అని పేర్కొన్నారు. 'తగలబడుతున్న కారు నుంచి రిషబ్ పంత్‌ను బయటికి తీసి, బెడ్‌షీట్‌తో చుట్టి, అంబులెన్సుకు సమాచారం ఇచ్చిన హరియాణా రోడ్‌వేస్ డ్రైవర్ సుశీల్ కుమార్‌కు కృతజ్ఞతలు. మీ నిస్వార్థ సేవకు మేము ఎంతో రుణపడి ఉంటాం. సుశీల్ గారూ మీరు రియల్ హీరో' అని లక్ష్మణ్ ట్వీట్ చేశారు.
Also Read: Rishabh Pant Health Update: రిషబ్ పంత్ పరిస్థితి విషమం.. విమానంలో ఢిల్లీకి తరలింపు?
Also Read: Heroine Poorna Pregnant : తల్లి కాబోతోన్న హీరోయిన్ పూర్ణ.. అందుకే వాటికి దూరమైందా?
లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter, Facebook.