Rohit Sharma Duck Outs records: ముంబై ఇండియన్స్ కెప్టెన్ రోహిత్ శర్మ ఐపీఎల్‌లో తన పేరిట చెత్త రికార్డును నమోదు చేశాడు. చెన్నై సూపర్ కింగ్స్‌తో గురువారం జరిగిన మ్యాచ్‌లో రోహిత్ శర్మ రెండో బాల్‌కే డకౌట్ అయ్యాడు. చెన్నై బౌలర్ ముఖేష్ చౌదరి వేసిన తొలి ఓవర్‌లోనే రోహిత్ పెవిలియన్ బాట పట్టాడు. దీంతో ఐపీఎల్ హిస్టరీలో అత్యధిక డకౌట్లు అయిన ఆటగాడిగా రికార్డు సృష్టించాడు రోహిత్. ఇప్పటివరకు డకౌట్లలో ఫస్ట్ ప్లేస్‌లో ఉన్న పియూష్ చావ్లాను రోహిత్ వెనక్కి నెట్టి ఫస్ట్ ప్లేస్‌కు చేరుకున్నాడు.
ఐపీఎల్‌లో రోహిత్ శర్మ ఇప్పటివరకు 14 సార్లు డకౌట్ అయ్యాడు. 13 డకౌట్లతో రెండు, మూడు స్థానాల్లో పీయూష్ చావ్లా, హర్భజన్ సింగ్ ఉన్నాడు. నాలుగో స్థానంలో మన్‌దీప్ సింగ్, ఐదో స్థానంలో పార్థివ్ పటేల్, ఆరు, ఏడు స్థానాల్లో అంబటి రాయుడు, అంజిక్య రహానే ఉన్నారు. వీరంతా కూడా 13 సార్లు డకౌట్ అయ్యారు. ఇక 12 డకౌట్లతో దినేశ్ కార్తీక్ మనీష్ పాండే, గంభీర్ తర్వాతి స్థానాల్లో ఉన్నారు.
రోహిత్ శర్మ ఐపీఎల్ 2022 సీజన్‌లో పేలవ ప్రదర్శన కొనసాగుతోంది. ఇప్పటివరకు రోహిత్ ఈ సీజన్‌లో ఒక్క హాఫ్ సెంచరీ కూడా నమోదు చేయలేదు. ఇప్పటివరకు ఆడిన మ్యాచ్‌ల్లో వరుసగా 41, 10, 3, 26, 28, 6 పరుగులు మాత్రమే చేశాడు. రోహిత్ నుంచి ఇలాంటి ప్రదర్శన వస్తుండటంతో భారత అభిమానులు ఆందోళన చెందుతున్నారు. త్వరలో జరిగే ఐసీసీ టీట్వంటీ వరల్డ్ కప్‌లో రోహిత్ శర్మ (Rohit Sharma) ఎలాంటి పర్‌ఫామెన్స్ ఇస్తాడోనని టీమిండియా క్రికెట్ ఫ్యాన్స్ టెన్షన్ పడుతున్నారు.
Also read : MI vs CSK: ఐపీఎల్‌లో ఆ రెండు జట్ల పోరు భారత్-పాక్ మ్యాచ్‌ను తలపిస్తుంది.. హర్భజన్ ఆసక్తికర వ్యాఖ్యలు!
Also read : Video: అర్జున్ టెండూల్కర్ అదిరిపోయే యార్కర్.. అతనికి ఒక్క ఛాన్స్ ఇవ్వాలంటున్న నెటిజన్లు
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి