కూతురి విజయాన్ని చూసి సంబరపడిన సచిన్

మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండుల్కర్ తన కుమార్తె సారా టెండుల్కర్ సాధించిన విజయానికి ఎంతగానో సంబరపడ్డారు. 

Last Updated : Sep 9, 2018, 12:25 AM IST
కూతురి విజయాన్ని చూసి సంబరపడిన సచిన్

మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండుల్కర్ తన కుమార్తె సారా టెండుల్కర్ సాధించిన విజయానికి ఎంతగానో సంబరపడ్డారు. ఇంతకీ ఆమె సాధించిన విజయమేంటని అనుకుంటున్నారా..? ఆమె లండన్ కాలేజీ నుండి వైద్యశాస్త్రంలో పట్టా అందుకున్నారు. లండన్‌లోనే మెడిసిన్ చదివిన సారా గ్రాడ్యుయేషన్ ప్రోగ్రామ్‌కి ఆమె తల్లిదండ్రులు సచిన్, అంజలి కూడా హాజరై తమ కూతురు డిగ్రీ తీసుకుంటున్న క్షణాలను దగ్గరుండి చూసి ఎంతగానో సంబరపడ్డారు. ఆ ఫోటోలను సోషల్ మీడియాలో పోస్టు కూడా చేశారు.

సారా తల్లి అంజలి కూడా డాక్టర్ అన్న సంగతి మనకు తెలిసిందే. ప్రస్తుతం సచిన్ తన ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేసిన కుమార్తె సారా ఫోటోలు బాగా వైరల్ అవుతున్నాయి. సారా ముంబయిలోని ధీరూభాయి అంబానీ ఇంటర్నేషనల్ స్కూల్‌లోనే చదువుకున్నారు. ముంబయి మారథాన్ వంటి ఫండ్ రైజింగ్ కార్యక్రమాల్లో కూడా ఆమె గతంలో పాల్గొని మీడియాని ఆకర్షించారు. అలాగే ముఖేష్ అంబానీ కుమారుడు ఆకాష్ అంబానీ నిశ్చితార్థ కార్యక్రమానికి హాజరైన సారా.. అక్కడ కూడా అందరి దృష్టిని ఆకర్షించారు. 

సచిన్ టెండుల్కర్ కుమార్తె సారాకి సోషల్ మీడియాలో అభిమానులు కూడా చాలామంది ఉన్నారు. ఆమె పేరు మీద ఫ్యాన్ పేజీలు కూడా ఉన్నాయి. బీ టౌన్ సెలబ్రిటీల్లో సారా కూడా ఒకరని అంటూ ఉంటారు. అయితే ఆమె తాను సినిమాల్లో నటించాలని అనుకోవడం లేదని తెలిపారు. 20 సంవత్సరాల సారా.. ఈ మధ్యకాలంలోనే ఎక్కువగా సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉండడం విశేషం. 

 

 
 
 
 

 
 
 
 
 
 
 
 
 

I did what?🙊

A post shared by Sara Tendulkar (@saratendulkar) on

Trending News