వేడుకగా సీనియర్ క్రికెటర్ 100ఏళ్ల బర్త్ డే సెలబ్రేషన్

Sachin Tendulkar : భారత తొలితరం క్రికెటర్, అత్యంత ఎక్కువ వయసు కలిగిన క్రికెటర్ వసంత్ రాయ్‌జి పుట్టినరోజు వేడుకలను సచిన్, స్టీవ్ సెలబ్రేట్ చేశారు.

Last Updated : Jun 13, 2020, 12:17 PM IST
వేడుకగా సీనియర్ క్రికెటర్ 100ఏళ్ల బర్త్ డే సెలబ్రేషన్

భారత్‌లో తొలి తరం క్రికెటర్లలో ఒకరైన వసంత్ రాయ్‌జీ నేడు 100 వసంతాలు పూర్తిచేసుకున్నారు. మన దేశంలో మాజీ క్రికెటర్లలో అత్యంత వృద్ధుడిగా రికార్డుకెక్కిన వసంత్ రాయ్‌జీ పుట్టినరోజును దిగ్గజ క్రికెటర్లు సచిన్ టెండూల్కర్, స్టీవ్ వా సెలబ్రేట్ చేశారు. ఆయనతో కేక్ కట్ చేయించిన ఈ మాజీ క్రికెటర్లు.. ఆరోగ్యంగా ఉండాలని ఆకాంక్షించారు. 1941-42 సీజన్‌లో రంజీల్లో ముంబై జట్టుకు ప్రాతినిథ్యం వహించిన వసంత్ రాయ్.. 1944-45 నుంచి 1949-50 వరకు బరోడా జట్టుకు సేవలందించారు.

ఫస్ట్ క్లాస్‌ క్రికెట్‌లో ఓపెనింగ్ బ్యాట్స్‌మెన్ అయిన వసంత్ రాయ్ క్రికెట్ నుంచి రిటైర్మెంట్ తీసుకున్నాక రచయితగా మారారు. క్రికెట్‌కు సంబంధించి ఎన్నో విషయాలను తన పుస్తకాలలో వివరించేవారు. 1920 జనవరి 26న గుజరాత్ లోని బరోడాలో జన్మించారు. 2016లో మరో క్రికెటర్ బీకే గురుదచర్ మరణించిన తర్వాత అత్యంత వృద్ధి క్రికెటర్ అయ్యారు. కెరీర్‌లో 9 ఫస్ట్ క్లాస్ మ్యాచ్‌లాడిన ఆయన 277 పరుగులు చేశారు.

ప్రస్తుతం దక్షిణ ముంబైలోని వాకేశ్వర్ ఏరియాలో నివాసం ఉంటున్న వసంత్ రాయ్‌జీ  వేడుకల్ని సచిన్, స్టీవ్ వా జరిపించారు. మహమ్మద్ నిస్సార్ బౌలింగ్ అంటే తనకు ఇష్టమన్న ఆయన ఫ్రాంక్ ఓరెల్ బ్యాటింగ్‌ను ఎంజాయ్ చేసేవాడినన్నారు. విజయ్ మర్చంట్, విజయ్ హజారే టెక్నిక్ బాగుండేదన్నారు. 

సంతోషంగా ఉండటమే నా ఆరోగ్య రహస్యం. 100వ పుట్టినరోజును, అందులోనూ నా భార్య పన్నా (94) సమక్షంలో జరుపుకుంటున్నందుకు చాలా ఆనందంగా ఉంది. నేనెప్పుడూ బెడ్ పేషెంట్ అవ్వలేదు. క్రికెట్ అంటే నాకు పిచ్చి. ఇప్పటికీ విరాట్ కోహ్లీని, టీమిండియా మ్యాచ్‌లను చూస్తుంటానని’ సెంచరీ బర్త్ డే హీరో వసంత్ రాయ్‌జీ వెల్లడించారు. 

జీ హిందుస్తాన్ తెలుగు టీవీ లైవ్ లింక్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి. Watch Zee Hindustan Telugu live here..

Trending News