జహీర్ బర్త్‌డేకి.. సెహ్వాగ్ ఫన్నీ వార్నింగ్

Last Updated : Oct 7, 2017, 07:12 PM IST
జహీర్ బర్త్‌డేకి.. సెహ్వాగ్ ఫన్నీ వార్నింగ్

అక్టోబరు 7వ తేదీ.. బౌలర్ జహీర్ ఖాన్ 39వ పుట్టిన రోజు. ఈ రోజును పురస్కరించుకొని ఆ క్రికెటర్‌కి ట్విటర్‌లో శుభాకాంక్షలు వెల్లువెత్తాయి. ఈ క్రమంలో జహీర్‌కు ఒకవైపు కితాబు ఇస్తూనే మరో వైపు ఒక ఫన్నీ వార్నింగ్ ఇచ్చాడు వీరేంద్ర సెహ్వాగ్. ఇండియాలోనే అసాధారణమైన బౌలర్‌ మరియు షార్పింగ్ క్రికెటింగ్ బ్రెయిన్ అయిన జహీర్‌కు జన్మదిన శుభాకాంక్షలు. అయితే కాస్తా జాగ్రత్త బాబా.. ఇదే నీకు ఆఖరి బ్యాచిలర్స్ బర్త్ డే.. అని చిన్న వార్నింగ్ కూడా ఇచ్చాడు సెహ్వాగ్. ప్రస్తుతం ఆ ట్వీట్ ఇంటర్నెట్‌లో హల్ చల్ చేస్తోంది. ఇటీవలే జహీర్ తను త్వరలోనే పెళ్ళి చేసుకోబోతున్నట్లు ప్రకటించిన విషయం తెలిసిందే. త్వరలోనే "చక్  దే ఇండియా" ఫేమ్ మరియు హాకీ ప్లేయర్  సాగరిక ఘట్గేతో జహీర్ వివాహం కానుంది. గతంలో కూడా జహీర్ మీద ఇలాంటి జోకులే వేశాడు సెహ్వాగ్. జహీర్ హకీ ప్లేయర్ చేతిలో క్లీన్ బౌల్డ్ అయ్యాడని సెహ్వాగ్ ట్వీట్ చేయగా, అదే హాకీ స్టిక్‌ని సెహ్వాగ్ సతీమణి ఆర్తికి గిఫ్ట్ అందిస్తే ఎలా ఉంటుందని రిటర్న్ ట్వీట్ చేశాడు జహీర్. 

 

 

 

Trending News