Viral Video: భారత క్రికెట్లో సచిన్ టెండూల్కర్, జహీర్ ఖాన్ వీరిద్దరి గురించి ప్రత్యేకించీ చెప్పాల్సిన అవసరం లేదు. ఎందుకంటే వీరు భారత క్రికెట్లో చెరగని ముద్ర వేశారు. వీళ్లు క్రికెట్ ప్రపంచానికి దూరమైన చాలా ఏళ్లు గడుస్తున్నా ఇంకా అభిమానులు మాత్రం వాళ్ల ఘనతలను ఎప్పటికప్పుడు నెమరేసుకుంటూనే ఉంటారు. తాజాగా క్రికెట్ గాడ్ సచిన్ టెండూల్కర్ ట్విట్టర్ లో షేర్ చేసిన ఒక వీడియో ఇప్పుడు నెట్టింట వైరల్ అవుతోంది.
Massive Fire Breaks Out in Zaheer Khan restaurant building in Pune. మహారాష్ట్రలోని పూణె నగరంలో టీమిండియా మాజీ క్రికెటర్ జహీర్ ఖాన్ రెస్టారెంట్ భవనంలో భారీ అగ్నిప్రమాదం చోటుచేసుకుంది.
టీమిండియా వెటరన్ ఆఫ్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్‌పై భారత మాజీ పేసర్ జహీర్ ఖాన్ ప్రశంసల వర్షం కురిపించారు. బౌలింగ్‌లో ఎప్పటికప్పుడూ వైవిధ్యం చూపుతూ యాష్ వికెట్లు పడగొడుతున్నాడన్నాడు. అశ్విన్ ఇదే ఫామ్‌ను మరి కొన్నేళ్లు కొనసాగిస్తే.. భారత స్పిన్ దిగ్గజం అనిల్ కుంబ్లే రికార్డును కూడా బద్దలు కొడతాడని జహీర్ అభిప్రాయపడ్డాడు.
Ishant Sharma Becomes Third Indian To Achieve This Record: చెన్నై వేదికగా ఇంగ్లాండ్ జట్టుతో జరుగుతున్న తొలి టెస్టులో నాలుగో రోజు ఆటలో భాగంగా టీమిండియా స్టార్ పేసర్ ఇషాంత్ శర్మ అరుదైన మార్కు చేరుకున్నాడు. కపిల్ దేవ్, జహీర్ ఖాన్ తరువాత ఈ ఫీట్ నమోదు చేసిన మూడో పేసర్‌గా నిలిచాడు.
జహీర్ ఖాన్ తన 40వ పుట్టినరోజు వేడుకలను మాల్దీవుల్లో జరుపుకుంటుండగా.. అతని చిరకాల స్నేహితుడైన యూవీ ఆ ఫంక్షన్‌కు అనుకోని అతిథిగా హాజరై అందరినీ ఆశ్చర్యపరిచాడు.
నవంబర్ 23వ తేదీన జహీర్ ఖాన్- సాగరిక వివాహం జరిగింది. తాజాగా ముంబైలోని తాజ్ లాండ్స్ లో విందు ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో వీరూ- అనుష్క శర్మ జోడీ ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు.
అక్టోబరు 7వ తేదీ.. బౌలర్ జహీర్ ఖాన్ 39వ పుట్టిన రోజు. ఈ రోజును పురస్కరించుకొని ఆ క్రికెటర్‌కి ట్విటర్లో శుభాకాంక్షలు వెల్లువెత్తాయి. ఈ క్రమంలో జహీర్‌కు ఒకవైపు కితాబు ఇస్తూనే మరో వైపు ఒక ఫన్నీ వార్నింగ్ ఇచ్చాడు వీరేంద్ర సెహ్వాగ్. ఇండియాలోనే అసాధారణమైన బౌలర్ మరియు షార్పింగ్ క్రికెటింగ్ బ్రెయిన్ అయిన జహీర్‌కు జన్మదిన శుభాకాంక్షలు. అయితే కాస్తా జాగ్రత్త బాబా.. ఇదే నీకు ఆఖరి బ్యాచిలర్స్ బర్త్ డే.. అని చిన్న వార్నింగ్ కూడా ఇచ్చాడు సెహ్వాగ్. ప్రస్తుతం ఆ ట్వీట్ ఇంటర్నెట్లో హల్ చల్ చేస్తోంది.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.