Shoaib Akhtar: గంగూలి గొప్ప నాయకుడు

పాకిస్తాన్ ( Pakistan ) మాజీ ఫాస్ట్ బౌలర్, రావల్పిండి ఎక్స్ ప్రెస్ షోయబ్ అఖ్తర్ ( Shoaib Akhtar ) నిత్యం భారత క్రికెట్ టీమ్ గురించి మాట్లాడుతూ ఉంటాడు.  పాత విషయాలను షేర్ చేస్తూ క్రికెట్ అభిమానులను సంతోష పెడుతుంటాడు. తాజాగా ఇలాంటి ఒక విషయాన్నే షోయబ్ షేర్ చేశాడు.  

Last Updated : Aug 12, 2020, 05:14 PM IST
Shoaib Akhtar: గంగూలి గొప్ప నాయకుడు

పాకిస్తాన్ ( Pakistan ) మాజీ ఫాస్ట్ బౌలర్, రావల్పిండి ఎక్స్ ప్రెస్ షోయబ్ అఖ్తర్ ( Shoaib Akhtar ) నిత్యం భారత క్రికెట్ టీమ్ గురించి మాట్లాడుతూ ఉంటాడు. పాత విషయాలను షేర్ చేస్తూ క్రికెట్ అభిమానులను సంతోష పెడుతుంటాడు. తాజాగా ఇలాంటి ఒక విషయాన్నే షోయబ్ షేర్ చేశాడు. తన ఇన్ స్టాగ్రామ్ ( Instagram ) లో గంగూలితో ( Saurav Ganguly ) ఉన్న ఒక ఫోటోను షేర్ చేసిన షోయబ్.. తను విమర్శకులను తట్టుకునేందుకు ఎప్పుడూ సిద్జం అని.. అది గ్రౌండ్ లో అయినా.. గ్రౌండ్ బయట అయినా రెండూ ఒకేటే అన్నాడు. 

 

ప్రత్యర్థులను కట్టి పడేసేందుకు నిత్యం వ్యూహాలు రచించేవాడిని అని తెలిపాడు షోయబ్ అఖ్తర్. కానీ గంగూలి ఎదురుగా ఉంటే మాత్రం కాస్త ఇబ్బంది అనిపించేది అని చెప్పాడు. ఎందుకంటే గంగూలి గొప్ప ఆటగాడు మాత్రమే కాదు.. గొప్ప లీడర్ అని అన్నాడు షోయబ్. ఐపిఎల్ ( IPL ) లో కోల్ కతా టీమ్ లో గంగూలీ కెప్టెన్సీలోనే ఆడాను అని తెలిపాడు.

Trending News