Shoaib Malik: ఒకే ఓవర్‌లో మూడు నో బాల్స్.. షోయబ్ మాలిక్‌పై ఫిక్సింగ్ ఆరోపణలు

Shoaib Malik BPL Contract: ఒకే ఓవర్‌లో మూడు నో బాల్స్‌ వేయడంతో షోయబ్ మాలిక్‌పై ఫిక్సింగ్ ఆరోపణలు వస్తున్నాయి. అంతేకాకుండా క్రమశిక్షణ చర్చలు ఉల్లంఘించడంతో బీపీఎల్ కాంట్రాక్ట్ రద్దయిందని వార్తలు వచ్చాయి. అయితే ఈ ప్రచారంపై స్పందించిన మాలిక్.. పూర్తిగా ఫేక్ అని కొట్టిపారేశారు.   

Written by - Ashok Krindinti | Last Updated : Jan 26, 2024, 06:40 PM IST
Shoaib Malik: ఒకే ఓవర్‌లో మూడు నో బాల్స్.. షోయబ్ మాలిక్‌పై ఫిక్సింగ్ ఆరోపణలు

Shoaib Malik BPL Contract: పాకిస్థాన్ స్టార్ ప్లేయర్ షోయబ్ మాలిక్‌పై ఫిక్సింగ్ ఆరోపణలతో చిక్కుల్లో పడ్డాడు. బంగ్లాదేశ్ ప్రీమియర్ లీగ్ (బీపీఎల్) కాంట్రాక్ట్ రద్దయిందని ప్రచారం జరుగుతోంది. ఫార్చ్యూన్ బ‌రీషాన్ జట్టుకు షోయబ్ మాలిక్ ప్రాతినిధ్యం వహిస్తుండగా.. ఒకే ఓవర్‌లో మూడు నో బాల్స్ వేయడంపై సర్వత్రా అనుమానాలు వ్యక్తమయ్యాయి. క్రమశిక్షణ కారణాల కూడా మాలిక్ కాంట్రాక్ట్ రద్దు చేయడానికి కారణంగా భావిస్తున్నారు. ఫార్చ్యూన్ బ‌రీషాన్, ఖుల్నా టైగ‌ర్స్ జట్ల మధ్య జరిగిన మ్యాచ్‌లో షోయబ్ మాలిక్ వేసిన ఓ ఓవర్‌పై ఫిక్సింగ్ ఆరోపణలు వస్తున్నాయి. ఈ ఓవర్‌లో మాలిక్ 18 పరుగులు ఇచ్చాడు. ఇందులో ఎవిన్ లూయిస్ ఒక సిక్స్, ఒక ఫోర్ కొట్టగా.. మూడు నోబాల్స్ ఉన్నాయి. దీంతో ఫార్చ్యూన్ బ‌రీషాన్ విధించిన 188 ప‌రుగుల లక్ష్యాన్ని మ‌రో రెండు ఓవ‌ర్లు మిగిలుండ‌గానే ఖుల్నా టైగ‌ర్స్ ఛేదించింది.

షోయ‌బ్ వేసిన ఓవ‌ర్ వివాదాస్ప‌దంగా మారగా.. అతను కావాలనే మూడు నో బాల్స్ వేసినట్లు అంపైర్స్‌తోపాటు క్రికెట్ నిపుణులు కూడా చెబుతున్నాయి. భారీగా పరుగులు ఇచ్చేందుకు మాలిక్ ఇలా నోబాల్స్ వేసినట్లు అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. అంతేకాకుండా ఈ సీజన్‌లో బీపీఎల్‌లో కేవలం మూడు మ్యాచ్‌లు మాత్రమే ఆడిన మాలిక్.. తన భార్య సనా జావేద్‌తో సమయం గడపడానికి సెలవును కోరాడు. దుబాయ్‌కి వెళ్లి తరువాత మ్యాచ్‌కు జట్టుతో చేరాల్సి ఉండగా.. ఫిబ్రవరి 3న జరిగే మ్యాచ్‌కు అందుబాటులో ఉంటానని ఫార్చ్యూన్ బ‌రీషాన్ ఫ్రాంచైజీకి తెలిపాడు. ఇది ఫ్రాంచైజీ అధికారులకు మింగుడు జట్టుతో కాంట్రాక్ట్ కూడా ఫిబ్రవరి 10 వరకు మాత్రమే ఉంది. కీలకమైన మ్యాచ్‌లకు దూరం కావడంతో ఆ ఫ్రాంచైజీ సీరియస్‌గా ఉంది. 

ఫిక్సింగ్ ఆరోపణలకు తోడు క్రమశిక్షణ చర్యలు ఉల్లంఘించడంతో బీపీఎల్ కాంట్రాక్ట్ రద్దయినట్లు తెలిసింది. ఫిక్సింగ్ ఆరోప‌ణలు నిజమని తేలితే.. అంతర్జాతీయ క్రికెట్‌కు కూడా మాలిక్ దూరమయ్యే అవకాశం ఉంది. 2010లో పీసీబీపై అనుచిత వ్యాఖ్య‌లు చేయడంతో ఏడాది పాటు సస్పెన్షన్‌కు గురైన విషయం తెలిసిందే. సానియా మీర్జాతో వైవాహిక జీవితానికి వీడ్కోలు చెప్పిన మాలిక్.. ఇటీవల పాకిస్థాన్ న‌టి సనా జావేద్‌ను పెళ్లి చేసుకున్న విషయం తెలిసిందే. 2010లో సానియా మీర్జాను మాలిక్ పెళ్లి చేసుకోగా.. దాదాపు 13 ఏళ్ల పాటు వీరి కాపురం సాజావుగా సాగింది. ఇద్దరి మధ్య మనస్పర్థలు రావడంతో వీడిపోయినట్లు తెలిసింది.

బీపీఎల్ కాంట్రాక్ట్ రద్దయినట్లు జరుగుతున్న ప్రచారంపై షోయాబ్ మాలిక్ స్పందించాడు. తాను కెప్టెన్ తమీమ్ ఇక్బాల్‌‌తో మాట్లాడనని.. దుబాయ్‌లో మీడియా నిశ్చితార్థం కోసం తాను టీమ్‌ను వీడాల్సి వచ్చిందన్నారు. ఫార్చ్యూన్ బరిషల్ రాబోయే మ్యాచ్‌లకు శుభాకాంక్షలు తెలిపాడు. జట్టుకు అవసరమైతే వారికి మద్దతు ఇవ్వడానికి తాను అందుబాటులో ఉంటానని చెప్పాడు. నిరాధారమైన పుకార్లను ఖండించిన మాలిక్.. ప్రతిష్టకు హాని కలిగించే తప్పుడు సమాచారాన్ని వ్యాప్తి చేయద్దని కోరాడు.

Also Read: KTR Republic Day: గవర్నర్‌ తీరుపై కేటీఆర్‌ ఆగ్రహం.. బీజేపీ, కాంగ్రెస్‌ ఫెవికాల్‌ బంధమంటూ వ్యాఖ్యలు

Also Read: Republic Day: విషాదం నింపిన 'గణతంత్ర వేడుకలు'.. జెండా కర్రకు విద్యుత్‌ తీగలు తగిలి ఇద్దరు దుర్మరణం

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     

Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     

Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

 

Trending News