NZ vs AFG: టీ20 వరల్డ్ కప్‌లో భాగంగా అబుదాబీ వేదికగా నేడు (నవంబర్ 7 ఆదివారం) అఫ్గాన్‌తో జరిగిన మ్యాచ్‌లో న్యూజిలాండ్ ఘన విజయం సాధించింది. 8 వికెట్ల తేడాతో విజయాన్ని తన ఖాతాలో (New Zealand Beat Afghanistan) వేసుకుంది న్యూజిలాండ్.
కవీస్ విజయంతో టీ20 వరల్డ్ కప్‌లో టీమ్ ఇండియా సెమీస్ (team india semi final hopes closed) ఆశలు గల్లంతయ్యాయి. అప్గానిస్థాన్ గెలిస్తే.. భారత్‌కు సెమీస్ చేసే అవకాశాలు ఉన్న నేపథ్యంలో ఈ మ్యాచ్‌పై ఇండియా ఫ్యాన్స్ భారీ ఆశలు పెట్టుకున్నారు. అయితే అఫ్గాన్ విఫలమవడంతో ఒక మ్యాచ్ మిగిలి ఉండగానే ఈ టోర్నీపై భారత్ ఆశలు వదులుకోవాల్సిన పరిస్థితి తలెత్తింది.
తొలుత బ్యాటింగ్‌లో తడబడిన అఫ్గానిస్థాన్..
తొలుత టాస్ గెలిచిన బ్యాటింగ్ ఎంచుకున్న(Afg bat firts with NZ) అఫ్గానిస్థాన్.. కివీస్ బౌలర్ల ధాటికి డీలా పడింది. నిర్ణీణ 20 ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి 124 పరుగుల స్వల్ప లక్ష్యాన్ని న్యూజిలాండ్ ముందు ఉంచింది.
అఫ్గాన్ జట్టులో నజీబుల్లా(73) మినహా మిగతా ఆటగాళ్లంతా చేతులెత్తేశారు.
Also read: Shoaib Akthar: 'అఫ్గాన్‌తో మ్యాచ్‌లో కివీస్ ఓడిపోతే..చాలా ప్రశ్నలు తలెత్తుతాయ్'..
స్వల్ప లక్ష్యం కావడంతో న్యూజిలాండ్ బ్యాటర్లు ఆధిపత్యం చూపారు. 18.1 ఓవర్లలో 2 వికెట్ల నష్టానికి విజయాన్ని ఖాతాలో వేసుకుని సేమీస్‌కు చేరింది కివీస్ జట్టు.
దీనితో రేపు (సోమవారం) టీమ్ ఇండియా, నమీబియా జట్ల మధ్య జరిగే మ్యాచ్ నామమాత్రం కానుంది.
Also read: Afghan vs Kiwis: ఆఫ్ఘన్-కివీస్ మ్యాచ్‌పైనే టీమ్ ఇండియా ఆశలు, లేదా ఇంటికే
Also read: Ashish Nehra: 'టీమ్ఇండియా టీ20 కెప్టెన్‌గా ఆ పేసర్‌కు అర్హతలున్నాయ్'
తొలి రెండు మ్యాచుల్లో ఒక్కటైనా గెలిచి ఉంటే..
టీ20 వరల్డ్ కప్‌లో భాగంగా భారత్ తొలుత (India vs Pak) పాకిస్థాన్‌తో, రెండో మ్యాచ్‌ను న్యూజిలాండ్‌తో (India vs NZ) ఆడింది. అయితే ఈ రెండు మ్యాచుల్లో భారత్ ఘోరంగా విఫలమైంది. ఆ తర్వాత అప్గానిస్థాన్, స్కాట్లాండ్లతో జరిగిన మ్యాచుల్లో ఘన విజయం సాధించింది.
అయితే తొలి రెండు మ్యాచుల్లో పరాజయం పాలైనందున.. సెమీస్ చేరాలంటే.. ఇతర జట్లపై ఆధారపడాల్సిన పరిస్థితి తలెత్తింది. అలా కాకుండా మొదటి రెండు మ్యాచుల్లో కనీసం ఒకదాంట్లోనైనా నెగ్గి ఉంటే.. టీమ్ ఇండియాకు సెమీస్ ఆశలు సజీవంగా ఉండేవని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.
Also read: England Vs South Africa: ఇంగ్లాండ్ పై సౌతాఫ్రికా విజయం.. గెలిచినా టోర్నీ నుంచి ఔట్
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook
NZ vs AFG: అఫ్గానిస్థాన్‌పై న్యూజిలాండ్ ఘన విజయం- భారత్ సెమీస్ అవకాశాలకు గండి
టీ20 వరల్డ్‌కప్: అఫ్గాన్‌పై న్యూజిలాండ్ విజయం
8 వికెట్ల తేడాతో విజయం సాధించిన కివీస్ జట్టు
అఫ్గాన్ ఓటమితో భారత్ సెమీస్ ఆశలు గల్లంతు