Suresh Raina to play IPL 2022 for Gujarat Titans: ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2022 మెగా వేలంలో టీమిండియా మాజీ బ్యాటర్, మిస్టర్ ఐపీఎల్ సురేష్ రైనా అమ్ముడుపోని విషయం తెలిసిందే. కనీస ధర రూ. 2 కోట్లతో వేలంలోకి వచ్చిన రైనాను ఏ జట్టు కొనుగోలు చేసేందుకు ఆసక్తి చూపలేదు. అతడి పేరు రెండు సార్లు వచ్చినా.. ఒక్క ప్రాంచైజీ కూడా కొనలేదు. ఐపీఎల్ ఆరంభం నుంచి ఆడిన చెన్నై సూపర్ కింగ్స్ కూడా రైనాను కొనేందుకు ముందుకు రాలేదు. దాంతో అతడు అన్ సోల్డ్ జాబితాలోకి వెళ్లిపోయాయడు. అయితే మిస్టర్ ఐపీఎల్ ఐపీఎల్ 2022 ఆడనున్నాడని సమాచారం తెలుస్తోంది.
ఐపీఎల్ 2022 ప్రారంభానికి ముందే కొత్త ఫ్రాంచైజీ గుజరాత్ టైటాన్స్‌కు భారీ షాక్ తగిలింది. బయో బబుల్ కారణంగా అలసిపోయిన రాయ్ ఐపీఎల్ 15వ సీజన్ నుంచి తప్పుకున్నాడు. దాంతో శుభ్‌మన్ గిల్‌తో ఇన్నింగ్స్‌ను ఆరంభించే ఆటగాడు టైటాన్స్‌కు లేకుండా పోయాడు. రాయ్ స్థానంలో మంచి ఆటగాడిని తీసుకునేందుకు గుజరాత్ ప్రాంచైజీ ప్రయత్నాలు చేస్తోందని సమాచారం. రాయ్ స్థానంలో మిస్టర్ ఐపీఎల్ సురేష్ రైనాను తీసుకోనుందని సోషల్ మీడియాలో ఓ న్యూస్ చక్కర్లు కొడుతోంది.
ఆస్ట్రేలియా క్రికెటర్ మాథ్యూ వేడ్‌ను ఓపెనింగ్ పంపించి సురేష్ రైనాను ఫస్ట్ డౌన్‌లో దించాలని గుజరాత్ టైటాన్స్ చూస్తోందని సమాచారం. రైనా లెఫ్ట్ హ్యాండర్ కాబట్టి.. కుడి ఎడమ కాంబినేషన్ కూడా ఉపయోగపడనుంది. ఈ వార్తే నిజమైతే ఐపీల్ 2022లో మిస్టర్ ఐపీఎల్‌ను మనం చూడొచ్చు. ఈ వార్త తెలుసుకున్న రైనా అభిమానులు సంతోషపడుతున్నారు. రైనా ఐపీఎల్ 2022లో ఆడాలని వారు కోరుకుంటున్నారు. ఇప్పటికే కొందరు ఫాన్స్.. టైటాన్స్ జెర్సీలో ఉన్న రైనా ఫొటోను సోషల్ మీడియాలో షేర్ చేస్తున్నారు. ప్రస్తుతం రైనా పేరు ట్రెండింగ్ అవుతోంది.
సురేష్ రైనా 2008 నుంచి 2015 వరకూ చెన్నై సూపర్ కింగ్స్ జట్టుకే ఆడాడు. చెన్నైపై ఉన్న రెండేళ్ల నిషేధం కారణంగా 2016, 2017లో రైనా గుజరాత్ లయన్స్ జట్టుకు ఆడాడు. ఆపై 2018 నుంచి 2021 వరకూ చెన్నై జట్టులో కొనసాగాడు. ఐపీఎల్ చరిత్రలో నాలుగో అత్యధిక పరుగులు సాధించిన ఆటగాడిగా రైనా కొనసాగుతున్నాడు. 205 మ్యాచుల ఆడి 5528 పరుగులు చేశాడు. ఇందులో ఒక సెంచరీ, 39 హాఫ్ సెంచరీలు ఉన్నాయి. ఇక చెన్నై తరఫున 4687పరుగులు నమోదు చేశాడు.
Also Read: IPL 2022: ఐపీఎల్ 2022 ఆరంభానికి ముందే గుజరాత్ టైటాన్స్‌కు భారీ షాక్.. స్టార్ ఓపెనర్ ఔట్!!
Also Read: Dog Death Video: అచ్చు మనుషుల మాదిరే.. కుక్కకు దహన సంస్కారాలు చేసిన తోటి శునకాలు!!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook