Megastar Chiranjeevi Master Plan: తెలుగులో ఉన్న సినిమాని రీమేక్ చేయడానికి పిచ్చోళ్లేమీ కాదు.. మాస్టర్ ప్లాన్ వేరే ఉందండోయ్!

Megastar Chiranjeevi Master Plan behind making God Father Movie: ఇప్పటికే తెలుగులో కూడా అందుబాటులో ఉన్న లూసిఫెర్ సినిమాను మళ్లీ తెలుగులో రీమేక్ చేయడం వెనుకం పెద్ద మాస్టర్ ప్లానే ఉందని ప్రచారం  జరుగుతోంది. ఆ వివరాల్లోకి వెళితే 

Written by - Chaganti Bhargav | Last Updated : Oct 3, 2022, 09:51 AM IST
  • ఆల్రెడీ తెలుగులో ఉన్న లూసిఫర్ కు తెలుగు రీమేక్
  • గాడ్ ఫాదర్ వెనుక పెద్ద ప్లాన్ ఉందంటూ ప్రచారం
  • పవన్ పార్టీనే టార్గెట్ గా గాడ్ ఫాదర్ నిర్మాణం
Megastar Chiranjeevi Master Plan: తెలుగులో ఉన్న సినిమాని రీమేక్ చేయడానికి పిచ్చోళ్లేమీ కాదు.. మాస్టర్ ప్లాన్ వేరే ఉందండోయ్!

Megastar Chiranjeevi Master Plan behind making God Father Movie: మెగాస్టార్ చిరంజీవి హీరోగా గాడ్ ఫాదర్ అనే సినిమా రూపొందిన సంగతి తెలిసిందే. మలయాళంలో సూపర్ హిట్ గా నిలిచిన లూసిఫర్ అనే సినిమా తెలుగులో గాడ్ ఫాదర్ పేరుతో రీమేక్ చేశారు. ఒకప్పుడు తెలుగులో సినిమాలు చేసి ప్రస్తుతం తమిళంలో సెటిల్ అయిన మోహన్ రాజా డైరెక్టర్ గా ఈ సినిమా రూపొందింది. ఈ సినిమాలో మలయాళ మాత్రుకలో మోహన్ లాల్ నటించిన పాత్రలో చిరంజీవి, పృథ్వీరాజ్ సుకుమారన్ నటించిన పాత్రలో సల్మాన్ ఖాన్, మంజు వారియర్ నటించిన పాత్రలో నయనతార, వివేక్ ఓబెరాయ్ నటించిన పాత్రలో సత్యదేవ్ వంటి వారు నటిస్తున్నారు.

వీరు కాకుండా సముద్రఖని, సునీల్, గెటప్ శ్రీను వంటి వారు ఇతర కీలక పాత్రలలో నటిస్తున్నారు. నిజానికి లూసిఫర్ సినిమా మలయాళంలో విడుదలై సూపర్ హిట్ గా నిలిచింది. దాని తెలుగు డబ్బింగ్ హక్కులు కూడా కొనుక్కున్న అమెజాన్ ప్రైమ్ వీడియో తెలుగులో డబ్బింగ్ చేసి అమెజాన్ ప్రైమ్ వీడియోలో రిలీజ్ చేసింది.  ఈ సినిమాని దాదాపు అమెజాన్ ప్రైమ్ సభ్యత్వం ఉన్న తెలుగు వారందరూ వీక్షించారు. కొందరు టెలిగ్రామ్ చానల్స్ ద్వారా, ఐ బొమ్మ లాంటి వెబ్సైట్స్ ద్వారా కూడా వీక్షించారు. అయితే అలాంటి సినిమాని మళ్లీ తెలుగులో రీమేక్ చేయడం అనేది సినిమా మొదలుపెట్టిన నుంచే అనేక రకాల చర్చలకు దారితీస్తోంది. దానికి తోడు ఇటీవల ఈ సినిమా నుంచి విడుదలైన ట్రైలర్ కూడా అనేక కొత్త చర్చలకు దారితీసింది.

అయితే చిరంజీవి ఈ సినిమా చేయడం కరెక్ట్ కాదని చాలామంది భావిస్తున్నారు కానీ ఈ సినిమా చేయడం వెనుక పెద్ద ఉద్దేశమే ఉందనే ప్రచారం ఇప్పుడు ఊపందుకుంది. అదేమిటంటే గాడ్ ఫాదర్ సినిమా ద్వారా తన తమ్ముడు పవన్ కళ్యాణ్ కు చెందిన జనసేన పార్టీని మెగాస్టార్ చిరంజీవి ప్రమోట్ చేయబోతున్నారంటూ సోషల్ మీడియాలో ఒక వింత వాదన తెరమీదకు వచ్చింది. అసలు విషయం ఏమిటంటే మలయాళ మాతృకలో మోహన్ లాల్ ఒక ఎమ్మెల్యేగా కనిపిస్తారు. తనకు తండ్రి లాంటి ఒక వ్యక్తి స్థాపించిన పార్టీలో ఎమ్మెల్యేగా పనిచేస్తున్న ఆయనను ఆ తండ్రి లాంటి వ్యక్తి చనిపోతే దగ్గరకు రానివ్వకుండా కుట్ర చేస్తారు/ ఇప్పుడు అదే పాత్రలో చిరంజీవి నటిస్తున్నారు.

అయితే సినిమాలో చాలా చోట్ల జనసేన రిఫరెన్స్ వాడారు అనే ప్రచారం జరుగుతోంది. పవన్ కళ్యాణ్ పార్టీ పేరు జనసేన కాగా గాడ్ గాదర్ సినిమా ట్రైలర్ ప్రకారం సినిమాలో చూపించిన పార్టీ పేరు జన జాగృతి పార్టీ. అంతేకాదు జనసేన కండువాని పోలిన కండువాలే ఈ సినిమాలో వాడినట్లుగా చెబుతున్నారు.  ఆ విషయాలు ట్రైలర్ లో కూడా కాస్త నిరూపితం అయినట్లుగానే చెప్పాలి. అలాగే ఆ జన జాగృతి పార్టీ బిల్డింగ్ కి జేఎస్పీ అని ఎలా అయితే షార్ట్ కట్ లో జనసేనను పిలుస్తారు అదే విధంగా జేజేపి అని పెట్టినట్లుగా ట్రైలర్ చూసినవారు ఇప్పుడు అభిప్రాయపడుతున్నారు. అంతేకాక జెండా కూడా జనసేన జెండానే పోలి ఉందని, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఎక్కువగా పిడికిలి బిగించి గాల్లోకి పిడిగుద్దులు గుద్దుతూ ఉంటారు.

ఇప్పుడు ఆ సింబల్ ని కూడా పార్టీ సింబల్ గా వాడినట్లుగా చెబుతున్నారు. అలాగే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ జనసేన ప్రారంభించినప్పటి కంటే ముందు నుంచి చేనేత కార్మికులను ప్రమోట్ చేస్తూ వారు నేసిన బట్టలు ధరిస్తూ ఉండేవారు. ఇప్పుడు ఈ సినిమాలో కూడా మెగాస్టార్ చిరంజీవి అదే పద్ధతి ఫాలో అయినట్లుగా చెబుతున్నారు. అలాగే దాదాపుగా పవన్ కళ్యాణ్ లుక్స్ అన్నీ చిరంజీవి కాపీ కొట్టినట్టుగా ప్రచారం జరుగుతోంది.

కాబట్టి ఇప్పటికే తెలుగులో ఉన్న సినిమాని మళ్లీ ఎందుకు తెలుగులో రీమిక్స్ చేస్తున్నారు అంటే కేవలం తన తమ్ముడి పార్టీని మరింత బలోపేతం చేయడం కోసం దాన్ని ప్రజల్లోకి బాగా తీసుకువెళ్లడం కోసమే మెగాస్టార్ చిరంజీవి సినిమా చేసినట్లుగా చెబుతున్నారు. దానికి ఉదాహరణగా ఈ సినిమాకి ఎవరూ డబ్బులు పెట్టకపోతే సొంత ప్రొడక్షన్ లో ఎన్వీ ప్రసాద్ నిర్మాతగా ఈ సినిమా చేస్తున్నారని, మధ్యలో ఆర్బీ చౌదరి కూడా కలవడంతో సూపర్ గుడ్ ఫిలిమ్స్ బ్యానర్ కూడా సినిమాలో  భాగం అయిందని అంటున్నారు. మరి ఇందులో నిజానిజాలు ఏమేరకు ఉన్నాయి అనేది సినిమా విడుదలైతే గాని చెప్పలేం.

Also Read: Adipurush Teaser : రాముడిగా మెప్పించిన ప్రభాస్.. ఆ షాట్స్‌కు దండం పెట్టాల్సిందే

Also Read: Actress Anaya Soni Faints: టీవీ నటి కిడ్నీ ఫెయిల్.. సీరియల్ సెట్స్ లోనే అపస్మారక స్థితికి.. ఆర్ధిక సాయం కోసం ఎదురుచూపులు!

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

Android Link - https://bit.ly/3P3R74U

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.Twitter , Facebook

Trending News