T20 World Cup Finals 2022: టీ20 ప్రపంచకప్ తుదిపోరు నేడే, ఇంగ్లండ్, పాకిస్తాన్ ప్లేయింగ్ 11 జట్లు ఇవే

T20 World Cup Finals 2022: నెలరోజుల టీ20 ప్రపంచకప్ 2022 సమరం ముగియవచ్చింది. నవంబర్ 13 ఆదివారం నాడు మెల్‌బోర్న్ వేదికగా పాకిస్తాన్ వర్సెస్ ఇంగ్లండ్ మ్యాచ్‌తో విజేత ఎవరనేది తేలనుంది. తుదిపోరు కోసం రెండు జట్లూ సిద్దమయ్యాయి.  

Written by - Md. Abdul Rehaman | Last Updated : Nov 13, 2022, 12:57 AM IST
T20 World Cup Finals 2022: టీ20 ప్రపంచకప్ తుదిపోరు నేడే, ఇంగ్లండ్, పాకిస్తాన్ ప్లేయింగ్ 11 జట్లు ఇవే

టీ20 ప్రపంచకప్ 2022 తుది సమరం మరి కొద్దిగంటల్లో జరగనుంది. ఆస్ట్రేలియాలోని మెల్‌బోర్న్ వేదికపై ఫైనల్ పోరుకు ఇంగ్లండ్, పాకిస్తాన్ జట్లు సిద్ధం కాగా..కప్ కోసం జాస్ బట్లర్, బాబర్ ఆజమ్‌లు సేన సిద్ధం చేశారు.

నెలరోజులుగా రసవత్తరంగా సాగిన టీ20 ప్రపంచకప్ 2022లో చాలా సంచలనాలు చోటుచేసుకున్నాయి. క్రికెట్ పసికూనలైన నెదర్లాండ్స్, ఐర్లాండ్ వంటి జట్లు అగ్రజట్లను ఓడించి సంచలనం రేపాయి. మరోవైపు ఆతిధ్య ఆస్ట్రేలియా జట్టుకు సెమీస్‌కు ముందే ఇంటికి చేరింది. ఇక హాట్ ఫేవరైట్‌గా బరిలో దిగిన టీమ్ ఇండియా సెమీస్‌లో ఇంగ్లండ్ చేతిలో ఘోర పరాజయం చెందింది. అదే సమయంలో గ్రూప్ ఎ లో టాప్‌‌లో నిలిచిన న్యూజిలాండ్‌‌ను మట్టి కరిపించి పాకిస్తాన్ సెమీస్‌కు చేరింది. 

నవంబర్ 13 వతేదీ ఆదివారం భారత కాలమానం ప్రకారం మద్యాహ్నం 1.30 నిమిషాలకు మెల్‌బోర్న్ వేదికగా టీ20 ప్రపంచకప్ 2022 తుది పోరు జరగనుంది. తొలి ఫైనలిస్ట్ పాకిస్తాన్ సెమీస్‌కు ముందు ఇండియాతో, ఆ తరువాత జింబాబ్వేపై ఓడిపోయి విమర్శల పాలైంది. ఆ తరువాత పుంజుకుని..వరుసగా మూడు విజయాలు నమోదు చేసింది. నెదర్లాండ్స్ రూపంలో అదృష్టం కలిసిరావడంతో దక్షిణాఫ్రికాను కాదని సెమీస్‌లో ప్రవేశించింది. సెమీస్‌లో మాత్రం న్యూజిలాండ్‌పై ఘన విజయమే సాధించింది. 

ఇక రెండవ పైనలిస్ట్ ఇంగ్లండ్ జట్టుకు ఆస్ట్రేలియాతో మ్యాచ్ వర్షం కారణంగా రద్దయింది. క్రికెట్ పసికూన ఐర్లాండ్ చేతిలో పరాజయం పాలైంది. ఆ తరువాత పుంజుకుని సెమీస్ వరకూ చేరింది. ఇండియాపై 10 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. రెండు జట్లలోనూ ఓపెనర్లే కీలకం కావడం విశేషం. రెండు జట్లూ సెమీస్‌లో నే అదరగొట్టడం విశేషం. టీ20 ప్రపంచకప్‌ను ఇప్పటివరకూ రెండుసార్లు గెల్చింది వెస్ట్ ఇండీస్ మాత్రమే. పాకిస్తాన్‌కు బాబర్ ఆజమ్ రిజ్వాన్, నవాజ్, షాదాబ్ ఖాన్, హారిస్ అహ్మద్ బలంగా మారనున్నారు. ఇక ఇంగ్లండ్ జట్టుకు ఓపెనర్లు అలెక్స్ హేల్స్, జాస్ బట్లర్ కీలకంగా ఉంటారు. వీరితో పాటు మొయిన్ అలీ, స్టోక్స్, లివింగ్ స్టోన్స్ అద్భుతంగా రాణిస్తున్నారు.

ఇంగ్లండ్ జట్టు

జాస్ బట్లర్, అలెక్స్ హేల్స్, స్టోక్స్, అలీ, లివింగ్ స్టోన్స్, బ్రూక్స్, సాల్ట్, కరణ్, వోక్స్, వుడ్, ఆదిల్ రషీద్

పాకిస్తాన్

బాబర్ ఆజమ్, రిజ్వాన్, హారిస్, ఇఫ్తికర్ అహ్మద్, షాన్ మసూద్, షాదాబ్ ఖాన్, నవాజ్, ఇమాద్ వసీం, షాహిన్ అఫ్రిది, నసీం షా, రవూఫ్

Also read: Pak Controversy Decision: పాకిస్తాన్ జట్టుపై కొత్త వివాదం, ఫైనల్ రోజు ఉపవాసం ఆచరించనున్న పాక్ క్రికెటర్లు

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     

Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu      

Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News