న్యూఢిల్లీ: దేశంలో కరోనా బాధితుల సంఖ్య పెరగడానికి తబ్లిగీ జమాత్ ప్రార్థనలే కారణమని భారత స్టార్ రెజ్లర్, బీజేపీ మహిళా నేత బబితా ఫోగాట్ ట్వీట్ చేసింది. అయితే దీనికి బ్యాడ్మింటన్ క్రీడాకారిణి గుత్తా జ్వాల స్పందిస్తూ స్పందిస్తూ ఒకవైపు బబితాను మందలిస్తూనే ఆ ట్వీట్ తొలగించమంటూ విజ్ఞప్తి చేశారు. ' సారీ బబితా.. ఈ కరోనా వైరస్ జాతి లేదా మతాన్ని చూస్తుందని అనుకోను. నేను ఒకటే విజ్ఞప్తి చేస్తున్నా. మనం స్పోర్ట్స్ పర్సనాలటీలం. మనం దేశానికే ప్రాతినిథ్యం వహిస్తున్నాం. మనం గెలిచినప్పుడు ప్రజలంతా కులాలు-మతాలు లేకుండా సెలబ్రేట్ చేసుకుంటారు. మన విజయాల్ని వారి గెలుపులుగా భావిస్తారు' అని జ్వాల పేర్కొన్నారు.
అంతేకాకుండా మరొక ట్వీట్లో పేర్కొంటూ.. తాను విమర్శలు ఎదుర్కొన్నప్పుడు భారతీయురాలిగానే ఉన్నానని, అదే సమయంలో తాను పతకాలు గెలిచినప్పుడు ఎవరూ ఏమతం అనేది చూడలేదన్నారు. ఏ పరిస్థితుల్లోనైనా మనల్ని భారతీయులగా మాత్రమే గుర్తించారన్నారు. ప్రతీ ఒక్కరూ తన విజయాన్ని వారి విజయంగానే చూశారన్నారు. సమైక్యతే మన బలమని, దేశాన్ని విడగొట్టద్దు' అని జ్వాల పేర్కొన్నారు. వివాదాలు వద్దు. సమైక్యతే మన బలం. ఆ ట్వీట్‌ను తీసేయ్ అంటూ బబితా ఫోగాట్‌కు గుత్తా జ్వాల విజ్ఞప్తి చేస్తూ ట్వీట్ చేశారు. జీ హిందుస్తాన్ తెలుగు టీవీ లైవ్ లింక్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి. Watch Zee Hindustan Telugu live here..