Ishant Sharma Worst Over: టీమిండియా వెటరన్ ఫాస్ట్ బౌలర్ ఇషాంత్ శర్మ తన కెరీర్‌లో అత్యంత బ్యాడ్ టైమ్ గురించి రీసెంట్‌గా ఓ ఇంటర్వ్యూలో పంచుకున్నాడు. 2013లో ఆస్ట్రేలియాతో జరిగిన మొహాలీ వన్డేలో ఓడిపోయిన తర్వాత తాను నెల రోజుల పాటు ఏడుస్తూనే ఉన్నానని చెప్పాడు. తన స్నేహితురాలు తనను ఎంతో ఓదార్చిదని.. ఆమెకు రోజు ఫోన్ చేసే బాధపడేవానని గుర్తు చేసుకున్నాడు. మొహాలీలో పదేళ్ల క్రితం జరిగిన వన్డే మ్యాచ్‌లో టీమిండియాపై ఆస్ట్రేలియా గెలవాలంటే మూడు ఓవర్లలో 44 పరుగులు చేయాల్సి ఉంది. అయితే ఇషాంత్ శర్మ ఒకే ఓవర్లో 30 పరుగులు ఇచ్చాడు. దీంతో ఆస్ట్రేలియా సులభంగా గెలిచింది. ఈ ఓటమి బాధలో ఇషాంత్ చాలా రోజులు ఇబ్బంది పడ్డాడు.
క్రిక్‌బజ్ 'రైజ్ ఆఫ్ న్యూ ఇండియా' షోలో ఇషాంత్ తన గతాన్ని గుర్తుచేసుకున్నాడు. '2013లో మొహాలీలో ఆస్ట్రేలియాతో ఆడిన వన్డే నాకు బ్యాడ్ టైమ్. నా కెరీర్‌లో ఇంతకంటే దారుణమైన సమయం ఉండదు. ఇది చాలా కష్టమైన సమయం. నేను ఎక్కువ పరుగులు ఇచ్చినందుకు కాదు.. నా వల్లనే జట్టు ఓడిపోయిందని బాధ నన్ను కుంగదీసింది. నేను ఆ సమయంలో నా కాబోయే భార్యతో డేటింగ్ చేసేవాడిని.. నేను ఆమెతో ఫోన్‌లో మాట్లాడినప్పుడల్లా నాకు ఏడుపు వచ్చేది. నేను దాదాపు ఒక నెల పాటు ఏడుస్తూనే ఉన్నాను.
'మ్యాచ్ తరువాత కెప్టెన్ ఎంఎస్ ధోని, ఓపెనర్ శిఖర్ ధావన్ నా రూమ్‌కు వచ్చారు. నన్ను బాగా ఆడుతున్నావని ప్రోత్సహించారు. అయితే ఆ ఒక్క మ్యాచ్ వల్ల నేను వైట్ బాల్ క్రికెట్ బౌలర్‌ను కాను అనే అభిప్రాయం కూడా నాపై ఏర్పడింది..' అని ఇషాంత్ చెప్పాడు. ఈ 34 ఏళ్ల బౌలర్ చివరిసారిగా 2021లో టీమిండియా తరుఫున టెస్ట్ మ్యాచ్ ఆడాడు. టెస్ట్ క్రికెట్‌లో తనదైన ముద్ర వేసిన ఇషాంత్ శర్మ.. ఇప్పటివరకు 311 వికెట్లు తీసుకున్నాడు. ప్రస్తుతం ఫామ్‌లేమితో ఇబ్బంది పడుతున్న ఈ ఫాస్ట్ బౌలర్.. టీమిండియాలోకి తిరిగి వచ్చేందుకు శ్రమిస్తున్నాడు.
Also Read: Womens T20 World Cup: మహిళా టీ20 ప్రపంచకప్ విజేతగా ఆసీస్.. ప్రైజ్‌మనీ ఎంత గెలుచుకుందో తెలుసా..!
Also Read: Doctor Preethi Death: మృత్యువుకు తలవంచిన ప్రీతి.. విషాదంలో కుటుంబం, స్నేహితులు
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి