Anushka-Virat: ప్రఖ్యాత టీమ్ ఇండియా క్రికెటర్ విరాట్ కోహ్లి, బాలీవుడ్ నటి అనుష్కాలు ముంబై వీధుల్లో ఏ విధమైన జన సందడి, ఫ్యాన్స్ హడావిడి లేకుండా స్వేచ్ఛగా తిరిగారు. ఆశ్చర్యంగా ఉందా..ఎలా సాధ్యమనుకుంటున్నారా..
అనుష్క శర్మ, విరాట్ కోహ్లీలు చాలా సింపుల్‌గా, సామాన్యంగా ఓ స్కూటీ ఎక్కి, హెల్మెట్ పెట్టుకుని నిన్న శనివారమంతా ముంబై వీధుల్లో గడిపారు. కారు పక్కనబెట్టి వర్షం పడిన, గతుకుల రోడ్లపై హాయిగా తిరిగేశారు. ఆ ఫోటోలు వీడియోలు ఇప్పుడు వైరల్ అవుతున్నాయి. విరాట్ కోహ్లీ గ్రీన్ షర్ట్, బ్లాక్ ప్యాంట్ వేసుకుంటే..అనుష్క ఫుల్ బ్లాక్‌లో కన్పిస్తోంది. ఇద్దరూ హెల్మెట్ పెట్టుకుని ఉండటంతో జనం ఎవరూ గుర్తుపట్టలేకపోయారు అందుకే స్వేచ్ఛగా తిరిగేశారు ముంబై రోడ్లపై.
విరాట్ కోహ్లీ, అనుష్క శర్మలు ఇద్దరూ ఇన్‌స్టాలో బిజీగా ఉంటుంటారు. ఇటీవలే భర్త విరాట్ కోహ్లీతో ఎంజాయ్ చేస్తున్న చిల్ ఫోటోల్ని అనుష్క శర్మ షేర్ చేసింది.హెల్మెట్ పెట్టుకోకపోతే ఇంతటి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్న ఇద్దరిని అభిమానులు అంత సులభంగా ముంబై రోడ్లపై తిరగనిచ్చేవారే కాదు. అటు ఫ్యాన్స్ వెంటబడకుండా..హాయిగా రోడ్లపై తిరిగి ఎంజాయ్ చేశారట ఈ ఇద్దరూ.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu
Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook