Team India Kala Chashma: టీమిండియా కాలా చష్మా డాన్స్.. ఇరగదీశిర్రు

Team India Kala Chashma: టీమ్ ఇండియా ఆటగాళ్ల డ్యాన్స్ వీడియో ఒకటి ఇటీవల వైరల్ అవుతోంది. కాలా చష్మా పాటకు ఇరగదీసి మరీ డ్యాన్స్ చేస్తున్న వీడియో అది. ఆ వివరాలు మీ కోసం..

Written by - Md. Abdul Rehaman | Last Updated : Aug 29, 2022, 08:29 PM IST
Team India Kala Chashma: టీమిండియా కాలా చష్మా డాన్స్.. ఇరగదీశిర్రు

Team India Kala Chashma: టీమ్ ఇండియా ఆటగాళ్ల డ్యాన్స్ వీడియో ఒకటి ఇటీవల వైరల్ అవుతోంది. కాలా చష్మా పాటకు ఇరగదీసి మరీ డ్యాన్స్ చేస్తున్న వీడియో అది. ఆ వివరాలు మీ కోసం..

ప్రస్తుతం టీమ్ ఇండియా ఆసియా కప్ 2022లో బిజిగా ఉంది. పాకిస్తాన్‌పై విజయంతో ఉత్సాహంతో ఉంది. ఈ క్రమంలో టీమ్ ఇండియా ఆటగాళ్లు విరగబడి డ్యాన్స్ చేస్తున్న వీడియో ఒకటి బాగా వైరల్ అవుతోంది. అయితే ఇది పాకిస్తాన్‌పై విజయానికి సంబంధించిన వీడియో కానేకాదు. 

ఇటీవల జరిగిన జింబాబ్వే పర్యటనలో టీమ్ ఇండియా 3-9 ఆధిక్యంతో వన్డే సిరీస్ క్లీన్‌స్వీప్ చేసింది. ఆ ఆనందంలో ఆటగాళ్లు అత్యంత ఉత్సాహంతో తమ సంబరాల్ని జరుపుకుంటున్న సందర్భమిది. ప్రముఖ పంజాబీ పాట కాలా చష్మాకు ఎవరికి నచ్చిన రీతిలో వాళ్లు..విరగబడి డ్యాన్స్ చేస్తున్న వీడియో ఇది. బార్ బార్ దేఖో సినిమాలోని పంజాబీ పాప్ సాంగ్ కాలా చష్మాకు ఒక రేంజ్‌లో డ్యాన్స్ చేస్తున్న దృశ్యమిది. శుభమన్ గిల్, అవేశ్ ఖాన్, మొహమ్మద్ సిరాజ్, దీపక్ చహర్, కుల్దీప్ యాదవ్, ధావన్ కలిసికట్టుగా కాలా చష్మా పాటకు ఎంజాయ్ చేస్తున్న వీడియో ఇది.

 
 
 
 

 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by Shikhar Dhawan (@shikhardofficial)

ఈ వీడియోను శిఖర్ ధావన్, శుబమన్ గిల్‌లు షేర్ చేస్తూ..మా విజయాన్ని ఇలా వేడుక చేసుకున్నామంటూ ట్యాగ్ లైన్ పెట్టారు. ఈ వీడియో బాగా వైరల్ అవుతోంది. పెద్ద ఎత్తున కామెంట్లు, లైక్స్ చేస్తున్నారు. మరొకరికి షేర్ చేస్తున్నారు. 

Also read: Rohit Sharma T20I Record: ప్రపంచ రికార్డు బద్దలు కొట్టిన రోహిత్‌ శర్మ.. 'ఒకే ఒక్కడు'!

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.    

Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu

Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News