Rahul Dravid-Saha: సాహా వ్యాఖ్యలు నన్నేమీ బాధించలేదు: రాహుల్‌ ద్రవిడ్‌

Rahul Dravid-Saha:  సీనియర్‌ వికెట్‌ కీపర్‌ వృద్ధిమాన్‌ సాహా చేసిన వ్యాఖ్యలపై హెడ్‌కోచ్‌ రాహుల్‌ ద్రవిడ్‌ వివరణ ఇచ్చాడు. అతడి మాటలకు తను బాధపడటం లేదని ద్రవిడ్‌ స్పష్టం చేశాడు.  

Edited by - ZH Telugu Desk | Last Updated : Feb 21, 2022, 01:30 PM IST
  • సాహా వ్యాఖ్యలపై ద్రవిడ్​ వివరణ
  • జట్టులో చోటు దక్కని వారు బాధపడటం సహజమన్న ద్రవిడ్
Rahul Dravid-Saha: సాహా వ్యాఖ్యలు నన్నేమీ బాధించలేదు: రాహుల్‌ ద్రవిడ్‌

Rahul Dravid on Wriddhiman Saha comments: టీమ్‌ఇండియా వికెట్‌ కీపర్‌ వృద్ధిమాన్‌ సాహా చేసిన వ్యాఖ్యలపై హెడ్‌కోచ్‌ రాహుల్‌ ద్రవిడ్‌ (Rahul Dravid) స్పందించారు. అతడు చేసిన వ్యాఖ్యలు తనకు బాధ కలిగించలేదని ద్రవిడ్ చెప్పాడు. 

ఇటీవల మార్చిలో శ్రీలంకతో జరిగే టెస్టు సిరీస్‌కు భారత జట్టును ప్రకటించారు సెలెక్టర్లు. ఈ జట్టులో సీనియర్ ఆటగాళ్లు రహానే, పూజారా, ఇషాంత్ శర్మలతోపాటు సాహాకు చోటు దక్కలేదు. దీంతో తీవ్ర అసంతృప్తి చెందిన సాహా..కోచ్ ద్రవిడ్, బీసీసీఐ అధ్యక్షుడు గంగూలీపై పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ద్రవిడ్​ తనను రిటైర్మెంట్​ అవ్వమన్నాడంటూ సాహా (Wriddhiman Saha) షాకింగ్ కామెంట్స్ చేశాడు. ఈ నేపథ్యంలో సాహా వ్యాఖ్యలకు కోచ్ ద్రవిడ్ సమాధానమిచ్చారు. 

"సాహా మాటలు నన్నేమీ బాధ పెట్టలేదు. భారత క్రికెట్​కు ఆటగాడిగా అతడు అందించిన సేవల పట్ల నాకు పూర్తి గౌరవం ఉంది. క్రికెటర్లతో ఎప్పుడూ మాట్లాడిట్లుగానే సాహాతోనూ మాట్లాడాను. సాహాకు ఈ విషయంలో స్పష్టత ఉండాలి. అయినా ప్రతిసారి మనం చెప్పే ప్రతి విషయం ఆటగాళ్లకు నచ్చాలని లేదు కదా.  అందుకే నేను ఎక్కువగా బాధపడటం లేదు. తుది జట్టు ఎంపికలో నేను లేదా కెప్టెన్​ రోహిత్​ శర్మ ఆటగాళ్లతో కచ్చితంగా మట్లాడతాం. వాళ్లని ఎందుకు ఎంపిక చేయలేదో అందుకు గల కారణాలను తెలియజేస్తాం. జట్టులో చోటు దక్కని వాళ్లు నిరాశకు గురవ్వటం సహజం." అని ద్రవిడ్ చెప్పుకొచ్చాడు. 

Also Read: Wriddhiman Saha: 'అతడు నన్ను రిటైరవమన్నాడు'.. ద్రవిడ్‌, దాదాలపై సాహా షాకింగ్ కామెంట్స్

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి. 

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link https://apple.co/3loQYe 

Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి 

Trending News