ఐపీఎల్ లో తెలుగు తేజాలు మెరిశాయి. రెండు రోజులపాటు ఐటీ నగరం బెంగళూరులో జరిగిన ఆటగాళ్ల వేలంపాటలో తెలుగు రాష్ట్రాలకు చెందిన క్రికెట్ ఆటగాళ్లు కోట్లకు ధర పలికారు.
1. అంబటి రాయుడు - 2.2 కోట్లు -చెన్నైసూపర్ కింగ్స్
అంబటి రాయుడు 1985, సెప్టెంబర్ 23న ఆంధ్రప్రదేశ్‌లోని గుంటూరులో జన్మించిన భారత క్రీడాకారుడు. 2001-02లో రంజీ ట్రోఫిలో హైదరాబాదు తరఫున ప్రాతినిధ్యం వహించాడు. రాయుడు 2002లో అండర్-19 భారత క్రికెట్ జట్టు తరఫున ఇంగ్లాండు పర్యటించి భారత జట్టు విజయానికి దోహదపడ్డాడు. 2003-04 లో జరిగిన అండర్-19 ప్రపంచ కప్ పోటీలో రాయుడు భారత జట్టుకు నేతృత్వం వహించాడు. రాయుడు ఐపీఎల్లో 2010లో ప్రవేశించాడు. నిరుడు ముంబై ఇండియన్స్ జట్టులో ఆడగా.. ప్రస్తుతం చెన్నైసూపర్ కింగ్స్ తరఫున ఆడనున్నారు.
2. మహ్మద్ సిరాజ్ - 2.6 కోట్లు- రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు
గతేడాది ఐపీఎల్ వేలంలో 2.6 కోట్లు పలికి అందరినీ ఆశ్చర్యపరిచిన హైదరాబాదీ పేసర్ మహ్మద్ సిరాజ్.. ఈసారి కూడా అదేస్థాయిలో ఆ రేటుకే(2.6 కోట్లు) అమ్ముడైపోయాడు. ఇదివరకు సిరాజ్ సన్‌రైజర్స్‌కు ఆడగా.. ఈ సీజన్లో బెంగళూరు తరఫున ఆడనున్నాడు.
3. రోహిత్ శర్మ- 15 కోట్లు - ముంబై ఇండియన్స్
రోహిత్ శర్మకు తెలుగు నేలతో బంధం ఉంది. రోహిత్ తల్లి పూర్ణిమ శర్మ వైజాగ్‌కు చెందినవారు. రోహిత్‌ను ముంబై ఇండియన్స్ 15 కోట్లకు కొనుగోలుచేసింది. ముంబై ఇండియన్స్ జట్టుకి కెప్టెన్ గా 2018 ఐపీఎల్లో వ్యవహరిస్తారు.