టీ20ల్లో చివరి బంతి సిక్స్‌తో.. అదరగొట్టిన ధీరులు వీరే..!

ముక్కోణపు టీ20 ఫైనల్లో చివరి బంతికి సిక్స్‌ కొట్టి టీమిండియాకి గుర్తుపెట్టుకోదగ్గ విజయాన్ని అందించిన బ్యాట్స్‌మన్‌గా దినేష్ కార్తీక్ విజయాన్ని అందించాడు.

Last Updated : Mar 19, 2018, 04:48 PM IST
టీ20ల్లో చివరి బంతి సిక్స్‌తో.. అదరగొట్టిన ధీరులు వీరే..!

ముక్కోణపు టీ20 ఫైనల్లో చివరి బంతికి సిక్స్‌ కొట్టి టీమిండియాకి గుర్తుపెట్టుకోదగ్గ విజయాన్ని అందించిన బ్యాట్స్‌మన్‌గా దినేష్ కార్తీక్ విజయాన్ని అందించాడు. ఆ ఫీట్ సాధించిన తొలి భారత బ్యాట్స్‌మన్ కూడా దినేష్ కార్తీక్ కావడం విశేషం. అలాగే అంతర్జాతీయ టీ20ల్లో  చివరి బంతిని సిక్స్‌‌గా మలిచి జట్టుకు విజయం అందించిన ఐదో ఆటగాడిగానూ కార్తీక్‌ వార్తల్లోకెక్కాడు.

అతని కంటే ముందు 2010లో టీ20 వరల్డ్ కప్‌లో శ్రీలంకకు చెందిన చమర కపుగెదర భారత్‌పై ఈ ఫీట్ చేయగా.. 2012లో ఇంగ్లాండ్‌ ఆటగాడు ఇయాన్‌ మోర్గాన్ భారత్‌పై ఇదే రిపీట్ చేశాడు. 2013లో పాకిస్తాన్ ఆటగాడు  జుల్ఫికర్‌ బాబర్ వెస్టిండీస్‌పై సిక్స్ కొట్టి విజయాన్ని తన టీమ్‌కు అందించాడు. 2014లో టీ20 ప్రపంచకప్‌లో నెదర్లాండ్స్‌పై జింబాబ్వే ఆటగాడు ఊసి సిబాండ కూడా ఆఖరి బంతిని సిక్స్‌గా మలిచి తన జట్టుకి విజయాన్ని అందించారు

Trending News