Adam Zampa COVID 19: టీ20 ప్రపంచకప్‌ 2022లో కరోనా కలకలం.. స్టార్ బౌలర్‌కు పాజిటివ్‌!

Australia vs Sri Lanka, Adam Zampa test Positive for COVID 19. టీ20 ప్రపంచకప్ 2022లో కరోనా వైరస్ కలకలం సృష్టించింది. ఆస్ట్రేలియా  స్పిన్నర్ ఆడమ్ జంపాలో కరోనా లక్షణాలు బయటపడినట్టు ఒక నివేదిక తెలిపింది.   

Written by - P Sampath Kumar | Last Updated : Oct 25, 2022, 04:06 PM IST
  • టీ20 ప్రపంచకప్‌ 2022లో కరోనా కలకలం
  • స్టార్ బౌలర్‌కు కరోనా పాజిటివ్‌
  • ఆస్ట్రేలియాకు భారీ షాక్
Adam Zampa COVID 19: టీ20 ప్రపంచకప్‌ 2022లో కరోనా కలకలం.. స్టార్ బౌలర్‌కు పాజిటివ్‌!

Australia bowler Adam Zampa test Positive for COVID 19 Ahead Of Sri Lanka Match: ఆస్ట్రేలియా వేదికగా జరుగుతోన్న టీ20 ప్రపంచకప్ 2022లో కరోనా వైరస్ మహమ్మారి కలకలం సృష్టించింది. ఆస్ట్రేలియా స్టార్ స్పిన్నర్ ఆడమ్ జంపాకు కరోనా పాజిటివ్‌‌గా నిర్ధారణ అయినట్టు క్రికెట్‌ ఆస్ట్రేలియా (సీఏ) తెలిపింది. ప్రస్తుతం జంపాలో స్వల్ప లక్షణాలు మాత్రమే ఉన్నాయట. దాంతో జంపా మరికొద్ది సేపట్లో శ్రీలంకతో జరిగే మ్యాచ్‌లో ఆడుతాడా లేదా అన్న అనుమానం నెలకొంది. కీలక మ్యాచ్ ఆడుతున్న ఆతిథ్య ఆస్ట్రేలియాకు ఈ వార్త భారీ ఎదురుదెబ్బే అని చెప్పాలి.

లెగ్-స్పిన్నర్ ఆడమ్ జంపా తేలికపాటి జ్వరం, దగ్గు, జలుబుతో బాధపడుతున్నాడని సీఏ అధికారి ఒకరు తెలిపారు. శ్రీలంకతో జరిగే మ్యాచ్‌లో అతడిని ఎంపిక చేయాలా వద్దా అన్న దానిపై ఇంకా ఎటువంటి నిర్ణయం తీసుకోలేదని చెప్పారు. జంపా కీలక బౌలర్‌ కావడం, కరోనా లక్షణాలు స్వల్పంగా ఉండటంతో.. అతడు లంకపై ఆడే అవకాశాలే ఎక్కువగా ఉన్నాయి. ఒకవేళ ఆస్ట్రేలియా యాజమాన్యం జంపాను పక్కన పెడితే.. ఆస్టన్‌ అగర్‌ తుది జట్టులోకి వస్తాడు.  

కరోనా వైరస్ మహమ్మారి బారిన పడ్డ ప్లేయర్స్ కూడా మ్యాచ్ ఆడొచ్చని ఇటీవలే అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ) ప్రకటించిన విషయం తెలిసిందే. అక్టోబర్‌ 23న శ్రీలంకతో జరిగిన మ్యాచ్‌లో ఐర్లాండ్‌ ప్లేయర్ జార్జ్‌ డాక్రెల్‌ కరోనా మహమ్మారి నిర్ధారణ అయినప్పటికీ మ్యాచ్ ఆడాడు. 16 బంతుల్లో 14 రన్స్‌ చేసి పెవిలియన్‌ చేరాడు. అయితే కరోనా సోకిన వ్యక్తి జట్టు సభ్యులకు కాస్త దూరంగా ఉండాలి, అంతేకాకుండా విడిగా ప్రయాణించాల్సి ఉంటుంది.

టీ20 ప్రపంచకప్‌ 2022 మొదటి మ్యాచ్‌లోనే డిఫెండింగ్‌ ఛాంపియన్‌ ఆస్ట్రేలియాకు భారీ షాక్ తగిలిన విషయం తెలిసిందే. న్యూజిలాండ్‌ చేతిలో ఓడి సెమీస్‌ చేరే అవకాశాలను సంక్లిష్టం చేసుకుంది. లంకతో జరగాల్సిన మ్యాచ్‌లో తప్పక గెలవాల్సిన పరిస్థితి ఏర్పడింది.  గ్రూప్‌-1లో అన్ని జట్లు పటిష్టంగా ఉండడంతో సెమీస్‌ బెర్తులకు తీవ్ర పోటీ తప్పకపోవచ్చు. ఆసీస్‌ తొలి మ్యాచ్‌లో ఓడటంతో.. మిగిలిన  4 మ్యాచ్‌ల్లో గెలవాల్సి ఉంటుంది. 

Also Read: Ashwin - Karthik: అశ్విన్‌ భయ్యా వెరీ థాంక్స్‌.. నువ్ ఆడకుంటే నా పని అయ్యేది: దినేష్ కార్తీక్  

Also Read: Pooja Hegde Pics: దీపావళి స్పెషల్.. దేవకన్యలా మెరిసిపోతున్న పూజా హెగ్డే!

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

Android Link https://bit.ly/3P3R74U

Apple Link - https://apple.co/3loQYe 

Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి

 

Trending News