Virat Kohli Instagram Record: టీమ్ఇండియా కెప్టెన్​ విరాట్​ కోహ్లీ ఖాతాలో సరికొత్త రికార్డు

Virat Kohli Instagram Followers: టీమ్ఇండియా కెప్టెన్​ విరాట్ కోహ్లీ మరో రికార్డు నెలకొల్పాడు. అయితే ఇది ఆటలో మాత్రం కాదు. ఇన్​స్టాగ్రామ్​లో (Kohli Instagram) 163 మిలియన్ల ఫాలోవర్ల మార్క్​ను అందుకున్న తొలి భారత సెలబ్రిటీగా నిలిచాడు. 

Written by - ZH Telugu Desk | Last Updated : Oct 24, 2021, 08:29 PM IST
Virat Kohli Instagram Record: టీమ్ఇండియా కెప్టెన్​ విరాట్​ కోహ్లీ ఖాతాలో సరికొత్త రికార్డు

Virat Kohli Instagram Record: టీమ్ఇండియా సారథి విరాట్ కోహ్లీ అటు ఆటలోనూ.. ఇటు సామాజిక మాధ్యమాల్లోనూ రికార్డులు తిరగరాస్తున్నాడు. తాజాగా ఇతడు ప్రముఖ సోషల్ మీడియా ఇన్​స్టాగ్రామ్​లో 163 మిలియన్ ఫాలోవర్స్ మార్క్​ను (Virat Kohli Instagram Follwers) అందుకున్నాడు. ఈ క్రమంలోనే ఇన్​స్టాలో (Kohli Instagram) అత్యధిక అనుచరులు కలిగిన భారత సెలబ్రిటీల జాబితాలో తొలి స్థానంలో నిలిచాడు. అలాగే ప్రపంచవ్యాప్తంగా మూడో స్థానానికి చేరుకొని సరికొత్త రికార్డును సృష్టించాడు.

మొత్తంగా ప్రపంచ వ్యాప్తంగా ఉన్న క్రీడాకారుల్లో అత్యధిక ఇన్​స్టా ఫాలోవర్లతో అగ్రస్థానంలో దూసుకెళ్తున్నాడు పోర్చుగల్ ఫుట్​బాల్ స్టార్ క్రిస్టియానో రొనాల్డో. ప్రస్తుతం ఇతడి ఖాతాను అసురించేవారి సంఖ్య 359 మిలియన్లుగా ఉంది. రొనాల్డో తర్వాత మెస్సీ 277 మిలియన్లు, నెయ్​మర్ జూనియర్ 163 మిలియన్ల ఫాలోవర్లతో (Virat Kohli Instagram Follwers) వరుసగా రెండు, మూడు స్థానాల్లో ఉన్నారు. ఇప్పుడు నెయ్​మర్​ స్థానాన్ని సమం చేస్తూ విరాట్​ కోహ్లీ తన ఇన్​స్టాగ్రామ్​లో 163 మిలియన్ల ఫాలోవర్స్​ను దక్కించుకున్నాడు. అదే విధంగా ఈ ఏడాది మార్చిలో 100 మిలియన్ల ఇన్​స్టాగ్రామ్​ ఫాలోవర్స్​ క్లబ్​ చేరిన తొలి భారత క్రికెటర్​గా చరిత్ర సృష్టించాడు.

Also Read: India Vs Pakistan Match Promo: ఇంటర్నెట్ ను షేక్ చేస్తున్న భారత్‌-పాక్‌ మ్యాచ్‌ ప్రోమో..

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

 
 

Trending News