ఆ రికార్డు సొంతం చేసుకున్న ఏకైక క్రికెటర్ విరాట్ కోహ్లీనే

రికార్డుల వరద పారిస్తున్న విరాట్ కోహ్లీ 

Last Updated : Dec 16, 2018, 12:05 PM IST
ఆ రికార్డు సొంతం చేసుకున్న ఏకైక క్రికెటర్ విరాట్ కోహ్లీనే

టీమిండియా కెప్టేన్ విరాట్ కోహ్లీ ఎక్కడ పర్యటించినా అక్కడ రికార్డులే రికార్డులు సొంతం చేసుకుంటున్నాడు. ప్రస్తుతం ఆస్ట్రేలియా పర్యటనలో వున్న విరాట్ కోహ్లీ అక్కడ కూడా తన రికార్డుల పరంపర కొనసాగిస్తున్నాడు. ఆస్ట్రేలియాతో 2వ టెస్టులో కోహ్లీ చేసిన సెంచరీ.. టెస్టు క్రికెట్ కెరీర్‌లో 25వ శతకాన్ని నమోదు చేసుకున్నాడు. 214 బంతుల్లో కోహ్లీ ఈ సెంచరూ పూర్తిచేశాడు. ఏ ఏడాదికి ఆ ఏడాది అత్యంత పరుగులు తన ఖాతాలో వేసుకుంటూ పరుగుల మెషిన్‌గా పేరు తెచ్చుకున్న విరాట్ కోహ్లీ 2018లోనూ పరుగుల వరద పారించాడు. ఆస్ట్రేలియా గడ్డపై కోహ్లీ చేసిన ఈ సెంచరీ ఈ ఏడాదిలో అతడికి 5వ టెస్ట్ సెంచరీ కావడం విశేషం. ఇక ఆసీస్‌తో సిరీస్‌ విషయానికొస్తే, ఆసిస్‌పై అతడికి ఇది 7వ టెస్టు సెంచరీ కాగా ఆస్ట్రేలియా గడ్డపై ఇది 6వ సెంచరీ కావడం మరో విశేషం. 

ఇప్పటివరకు ఆస్ట్రేలియా గడ్డపై అత్యధిక సెంచరీలు చేసిన ఇండియన్ క్రికెటర్ రికార్డు సచిన్ టెండుల్కర్ పేరిట వుంది. ఆస్ట్రేలియా గడ్డపై మాస్టర్ బ్లాస్టర్ సచిన్ 6 సెంచరీలు చేయగా తాజాగా కోహ్లీ సైతం సచిన్ టెండూల్కర్ రికార్డును సమం చేశాడు. 30ఏళ్ల కోహ్లీ ఈ ఏడాదిలో ఇప్పటి వరకు 11 సెంచరీలు చేశాడు. 127 ఇన్నింగ్స్‌ల్లోనే 25 టెస్టు సెంచరీలు చేసి వరల్డ్ టాప్ క్రికెటర్స్‌కి తానేమీ తక్కువ కాదు అని నిరూపించుకున్నాడు కోహ్లీ. కోహ్లీ కన్నా ముందు బ్రాడ్‌మన్ మాత్రమే అతి తక్కువగా 68 ఇన్నింగ్స్‌ల్లో ఈ రికార్డ్ సొంతం చేసుకున్నాడు. 

ఇదిలావుంటే, ఒకే క్యాలండర్ ఇయర్‌లో సౌతాఫ్రికా, ఇంగ్లాండ్, ఆస్ట్రేలియా పర్యటనల్లో టెస్టుల్లో సెంచరీలు బాదిన ఏకైక ఆసియా క్రికెటర్ రికార్డ్ సైతం విరాట్ కోహ్లీ వశమైంది. విరాట్ కోహ్లీ 2018 ఏడాదిలో ఇప్పటి వరకు 1216 పరుగులు చేయగా అంచతన్నా ముందు 2016లో 1215పరుగులు, 2017లో 1059 పరుగులు, 2014లో 847 పరుగులతో కోహ్లీ రాణించాడు. పెర్త్ గడ్డపై కోహ్లీ చేసిన సెంచరీ ఇదే మొదటికి కాగా మొత్తంగా అంతర్జాతీయ మ్యాచ్‌ల్లో ఇది అతడికి 63వ సెంచరీ

Trending News