విరాట్ కోహ్లీ డ్యాన్స్‌కి షేక్ అయిన సోషల్ మీడియా.. వైరల్ వీడియో

అడిలైడ్ స్టేడియంలో విరాట్ కోహ్లీ డ్యాన్స్‌

Last Updated : Dec 9, 2018, 11:27 AM IST
విరాట్ కోహ్లీ డ్యాన్స్‌కి షేక్ అయిన సోషల్ మీడియా.. వైరల్ వీడియో

టీమిండియా కెప్టేన్ విరాట్ కోహ్లీ తన ఆటతోనే కాకుండా డ్యాన్స్‌తోనూ క్రికెట్ ప్రియులను అలరిస్తున్నాడు. ఆస్ట్రేలియాతో తొలి టెస్టులో భాగంగా నేడు ఆడిలైడ్ స్టేడియంలో మూడో రోజు ఆట ఆడుతున్న సందర్భంగా మైదానంలో ఫీల్డింగ్ చేస్తూనే మధ్యలో విరాట్ కోహ్లీ చేసిన లైట్ డ్యాన్స్‌కి సోషల్ మీడియాలో సూపర్ రెస్పాన్స్ కనిపిస్తోంది. ఆసీస్ తొలి ఇన్నింగ్స్‌లో నిలుచున్న చోటు నుంచి కదలకుండానే అక్కడక్కడే కోహ్లీ ఉత్సాహంగా స్టెప్పులేస్తున్న దృశ్యాన్ని అక్కడి కెమెరాలు పదిలంగా తమ మెమొరీలో నిక్షిప్తంచేశాయి.

 

 

ఆస్ట్రేలియా క్రికెట్ బోర్డు తమ అధికారిక ట్విటర్‌ ఖాతాలో పోస్ట్ చేసిన ఈ వీడియోకు కోహ్లీ ఫ్యాన్స్ బ్రహ్మరథం పడుతున్నారు. దీంతో కొన్ని నిమిషాల వ్యవధిలోనే ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. 

 

Trending News