ఇండియన్ ప్రీమియర్ లీగ్ ( Indian premier league ) ( IPL ) టైటిల్ ను ఇప్పుడు ఎవరు స్పాన్సర్ చేస్తారు ? వివో కంపెనీ స్పాన్సర్ షిఫ్ నుంచి తప్పుకోవడంతో ఆ బాధ్యత ఎవరు తీసుకుంటున్నారనే ప్రశ్న తలెత్తుతోంది. కొత్త స్పాన్సర్ కోసం బీసీసీఐ అణ్వేషణ సాగుతోంది.
యూఏఈ ( UAE ) వేదికగా ఐపీఎల్ ( IPL ) సెప్టెంబర్ లో ప్రారంభం కానున్న సంగతి తెలిసిందే. అయితే గతంలో చేసుకున్న ఒప్పందం ప్రకారం ఐపీఎల్ టైటిల్ స్పాన్సర్ ( IPL Title sponsor ) గా 2022 వరకూ వివో కంపెనీ ( Vivo company ) నే వ్యవహరించనుంది. 2018-2022 వరకూ 440 కోట్లకు ఒప్పందం కుదిరింది. ఇప్పుడు ఇండో చైనా బోర్డర్ ( Indo china border ) లో నెలకొన్న ఉద్రిక్తతల నేపధ్యంలో ఐపీఎల్ టైటిల్ స్పాన్సర్ షిప్ నుంచి వివో కంపెనీ తప్పుకుంది. చైనాకు చెందిన 59 యాప్ లను భారత ప్రభుత్వం నిషేధించిన నేపధ్యంలో ఐపీఎల్ టైటిల్ స్పాన్సర్ గా వివోను కొనసాగించే బీసీసీఐ ( BCCI ) నిర్ణయంపై సోషల్ మీడియా సాక్షిగా పెద్దఎత్తున ట్రోలింగ్ సాగింది. దాంతో వివో స్పాన్సర్ నుంచి తప్పుకుంది. ఇక బీసీసీఐకు కొత్త స్పాన్సర్ ( New Sponsor ) అణ్వేషించే పని పడింది. కొత్త స్పాన్సర్ ఇండియన్ కంపెనీ అయితే బాగుంటుందనే ఆలోచనతో ఆ దిశగా ప్రయత్నాలు చేస్తోంది. Also read: Rohit Sharma: ముంబై జట్టులో రోహిత్‌కు అతి తక్కువ ప్రాధాన్యం
ఐపీఎల్ కొత్త స్పాన్సర్ కంపెనీల రేసులో ముఖ్యంగా రెండు కంపెనీల పేర్లు వినిపిస్తున్నాయి. ఒకటి జియో( Jio ), రెండవది పతంజలి ( Pathanjali ). టైటిల్ స్పాన్సర్ గా వివో చెల్లించినంత పెద్దమొత్తంలో కాకపోయినా...250-300 కోట్ల వరకూ బీసీసీఐకు ఇండియన్ కంపెనీల నుంచి రావచ్చని తెలుస్తోంది. జియో, పతంజలి సంస్థల్లో ఓ కంపెనీను ఐపీఎల్ టైటిల్ స్పాన్సరర్ గా ఖరారు చేసే అవకాశాలున్నాయి. Also read: ENG vs PAK: ఈసారైనా పాకిస్తాన్‌పై ఇంగ్లాండ్ కల నెరవేరేనా ?