Fire Breaks Out at Kolkata Eden Gardens: భారత్ వేదికగా జరిగే వన్డే ప్రపంచ కప్‌కు అన్ని స్టేడియాలు సిద్ధమవుతున్నాయి. ఈ నేపథ్యంలో ప్రతిష్టాత్మక ఈడెన్ గార్డెన్స్‌లో మెగా ఈవెంట్‌కు సిద్ధం చేస్తున్న తరుణంలో భారీ అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. డ్రెస్సింగ్ రూమ్‌లో షార్ట్ సర్క్యూట్ కారణంగా అగ్ని ప్రమాదం సంభవించింది. ఈ ఘటన అర్థరాత్రి జరగడంతో ఎలాంటి ప్రాణనష్టం జరగలేదు. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది వెంటనే ఘటన స్థలానికి చేరుకున్నారు. గంటకు పైగా శ్రమించి మంటలను అదుపులోకి తీసుకువచ్చారు.
వన్డే ప్రపంచకప్ ఆతిథ్యానికి ఈడెన్ గార్డెన్స్‌ను సిద్ధం చేస్తున్నారు. ఈ క్రమంలో బుధవారం రాత్రి 11:50 గంటల ప్రాంతంలో ఈడెన్ గార్డెన్స్ స్టేడియంలో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. పెద్దగా నష్టం జరగలేదని.. అయితే ఈ ఘటనపై అధికార యంత్రాంగం సీరియస్‌గా తీసుకున్నట్లు తెలుస్తోంది. రెండు అగ్నిమాపక వాహనాలను రప్పించి.. మరింత నష్టం జరగకుండా చూసుకున్నారు. డ్రెస్సింగ్ రూమ్‌లో కొన్ని వస్తువులు కాలి బూడిదైనట్లు సమాచారం. అగ్నిప్రమాదంతో ఎవరికీ ప్రత్యక్ష సంబంధం లేదని.. షార్ట్ సర్క్యూట్ కారణమని పేర్కొంటున్నారు. ప్రపంచ కప్‌కు ముందు స్టేడియంలో మంటలు చెలరేగడం ఆందోళన కలిగిస్తోంది.
బెంగాల్ క్రికెట్ అసోసియేషన్ ఈ సంఘటనపై ఇంకా స్పందిచలేదు. సెప్టెంబర్ 15వ తేదీ నాటికి వేదికను సిద్ధం చేయాలని నిశ్చయించుకుంది. అగ్నిప్రమాదానికి గల కారణాలను క్యాబ్ అధికారులు తెలుసుకుంటున్నారు. స్డేడియం అధికారులతో సంప్రదింపులు జరుపుతున్నారు. మళ్లీ ఇలాంటి ఘటనలు చోటు చేసుకోకుండా అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ఐసీసీ కమిటీ గతవారం వరల్డ్ కప్‌కు ఆతిథ్యం ఇస్తున్న స్టేడియాలను సందర్శించింది. ఈడెన్ గార్డెన్స్ స్డేడియం సన్నాహాల పట్ల సంతృప్తి వ్యక్తం చేసింది. అయితే వచ్చే నెలలో ఐసీసీ ప్రతినిధుల బృందం మరోసారి స్టేడియంను సందర్శించనుంది.
కోల్‌కతాలోని ఈడెన్ గార్డెన్స్ స్టేడియంలో సెమీ ఫైనల్ మ్యాచ్‌తో సహా మొత్తం 5 మ్యాచ్‌లు జరగనున్నాయి. ఈ స్టేడియంలో మొదటి మ్యాచ్‌లో నెదర్లాండ్స్, బంగ్లాదేశ్ జట్ల మధ్య అక్టోబర్ 28న తలపడనున్నాయి. ఆ తరువాత అక్టోబర్ 31న పాకిస్థాన్, బంగ్లాదేశ్ మధ్య పోరు జరగనుంది. నవంబర్ 5న భారత్, సౌతాఫ్రికాతో పాటు నవంబర్ 11న ఇంగ్లాండ్, పాకిస్థాన్ జట్లు తలపడనున్నాయి. నవంబర్ 16న రెండో సెమీఫైనల్ మ్యాచ్‌కు కూడా ఈడెన్ గార్డెన్స్ ఆతిథ్యం ఇవ్వనుంది.
Also Read: Asian Champions Trophy 2023: పాకిస్థాన్ పై గెలిచి.. సెమీస్ కు దూసుకెళ్లిన భారత్..
Also Read: RBI Repo Rate: గుడ్‌న్యూస్ చెప్పిన ఆర్‌బీఐ.. రెపో రేటుపై కీలక నిర్ణయం
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి