రిటైర్మెంట్‌ పై యువరాజ్ సింగ్ రియాక్షన్

Last Updated : Feb 28, 2018, 06:01 PM IST
రిటైర్మెంట్‌ పై యువరాజ్ సింగ్ రియాక్షన్

యువరాజ్ రిటైర్మెంట్ విషయం ప్రస్తుతం చర్చనీయశంగా మారింది. గత ఎనిమిది నెలల నుంచి ఒక్క అంతర్జాతీయ మ్యూచ్ లోనూ యువరాజ్ ఆడింది లేదు. ఈ నేపథ్యంలో ఆయన రిటైర్మెంట్ ప్రకటిస్తే మంచిదని పలువురు మాజీలు సలహాలు ఇస్తున్న తరుణంలో యువరాజ్ సింగ్ స్పందించాడు. తను రిటైర్మెంట్ గురించి మీడియాతో మాట్లాడుతూ 2019 ప్రపంచకప్‌ తరువాత క్రికెట్ కు గుడ్ బై చెప్పాలని ఉందని తన మనసులో మాటను బయటపెట్టాడు.  

ఐపీఎల్ పైనే దృష్టి..

ప్రస్తుతం తాను రాబోయే ఐపీఎస్ పై  దృష్టి సారించానని ..అందులో సత్తాచాటాల్సిన అవసరముందన్నాడు. తను తిరిగి మళ్లీ అంతర్జాతీయు జట్టులో స్థానం సంపాదిస్తాని ఆశాభావం వ్యక్తం చేశాడు ఈ వెటరన్ ఆటగాడు..ఈ సందర్భంగా యువరాజ్ మాట్లాడుతూ తన కెరీర్‌ తొలి 6-7 ఏళ్లు అద్భుతంగా సాగిందని..అయితే టెస్టుల్లో ఆడే అవకాశాలు రాలేదన్నాడు. 

 

Trending News