UAE T20 League: యూఏటీ టీ20 గ్లోబల్ మీడియా, ప్రసార హక్కులు సొంతం చేసుకున్న జీ గ్రూపు, జీ5లో లైవ్ స్ట్రీమింగ్

UAE T20 League: ఐపీఎల్ 2022 ముగుస్తోంది. మరి కొద్దిరోజుల్లో ప్రతిష్టాత్మకంగా ప్రారంభం కానున్న యూఏఈ టీ20 లీగ్ మీడియా హక్కుల్ని జీ గ్రూప్ సొంతం చేసుకుంది. ప్రపంచవ్యాప్తంగా జీ5లో ప్రత్యక్ష ప్రసారాలు జరగనున్నాయి.

Written by - Md. Abdul Rehaman | Last Updated : May 24, 2022, 02:55 PM IST
  • జీ సంస్థ కీలక మైలురాయి ప్రతిష్టాత్మక యూఏఈ టీ20 లీగ్ గ్లోబల ్ మీడియా, ప్రసార హక్కులు జీ సొంతం
  • యూఏఈ టీ20 లీగ్, జీ మధ్య కుదిరిన ఒప్పందం, 190పైగా దేశాల్లో ప్రత్యక్ష ప్రసారాలు, జీ5లో లైవ్ స్ట్రీమింగ్
  • 6 జట్లు, 34 మ్యాచ్‌లతో త్వరలో ప్రారంభం కానున్న యూఈఏ టీ20 లీగ్
UAE T20 League: యూఏటీ టీ20 గ్లోబల్ మీడియా, ప్రసార హక్కులు సొంతం చేసుకున్న జీ గ్రూపు, జీ5లో లైవ్ స్ట్రీమింగ్

UAE T20 League: ఐపీఎల్ 2022 ముగుస్తోంది. మరి కొద్దిరోజుల్లో ప్రతిష్టాత్మకంగా ప్రారంభం కానున్న యూఏఈ టీ20 లీగ్ మీడియా హక్కుల్ని జీ గ్రూప్ సొంతం చేసుకుంది. ప్రపంచవ్యాప్తంగా జీ5లో ప్రత్యక్ష ప్రసారాలు జరగనున్నాయి.

జీ గ్రూప్ మరో ప్రతిష్టాత్మక మైలురాయి. కీలకమైన, ప్రతిష్టాత్మక యూఏఈ టీ20 పోటీల లైవ్ , మీడియా హక్కుల్ని జీ5 సొంతం చేసుకుంది. త్వరలో ప్రారంభం కానున్న యూఏఈ టీ20 లీగ్ మీడియా హక్కులు జీ సొంతం చేసుకుంది. జీ గ్రూప్ ఓటీటీ వేదికైన జీ5లో ప్రపంచవ్యాప్తంగా ప్రత్యక్ష ప్రసారాలు స్ట్రీమింగ్ కానున్నాయి. ప్రపంచవ్యాప్తంగా 190కు పైగా దేశాల్లో జీ5 ద్వారా యూఏఈ టీ20 లీగ్ పోటీలు ప్రసారమౌతాయి.

యూఏఈ టీ20 లీగ్, జీ గ్రూప్ మధ్య గ్లోబల్ మీడియా హక్కులపై ఒప్పందం కుదిరింది. స్వయంగా యూఏఈ టీ 20 లీగ్ ఈ విషయాన్ని ప్రకటించింది. యూఈఏ టీ20 ప్రత్యక్ష ప్రసారాలు ప్రపంచవ్యాప్తంగా జీ అనుబంధ ఛానెల్స్, ఓటీటీ వేదిక జీ5లో ప్రసారం కాబోతున్నాయి.

యూఏఈ టీ20 లీగ్ మ్యాచ్‌లు జీ గ్రూపుకు చెందిన పది ఛానెల్స్, ఇంగ్లీషు, హిందీ, తమిళ భాషల్లో ప్రసారమౌతాయి. అదే సమయంలో జీ గ్రూపుకు చెందిన ఓటీటీ వేదిక జీ5లో కూడా ప్రపంచవ్యాప్తంగా స్ట్రీమింగ్ కానుంది. జీ గ్రూపుకు ప్రపంచవ్యాప్తంగా 190కు పైగా దేశాల్లో నెట్‌వర్క్ బలంగా ఉంది. అడ్వర్టైజర్స్, పంపిణీ భాగస్వామ్యులకు ఇదొక మంచి అవకాశంగా మారుతుంది. జీ గ్రూపుకు ప్రసార హక్కులు లభించడం ద్వారా యూఈఈ టీ20 ప్రత్యక్ష ప్రసారాన్ని వంద మిలియన్ల ఇళ్లకు అందించవచ్చు.

యూఏఈ టీ20 లీగ్

యూఏఈ టీ20 లీగ్ అనేది త్వరలో ప్రారంభం కానుంది. ఐపీఎల్ 2022 తరహాలో త్వరలో తొలి సీజన్ ప్రారంభం కానుంది. ఇందులో 6 జట్లు పాల్గొంటున్నాయి. మొత్తం 34 మ్యాచ్‌లుంటాయి. ఇందులో ప్రధానంగా రిలయన్స్ ఇండస్ట్రీస్, అదాని స్పోర్ట్స్‌లైన్, కోల్‌కతా నైట్ రైడర్స్, లేన్సర్ కేపిటల్, జీఎంఆర్ గ్రూప్, క్యాప్రి గ్లోబల్ జట్లున్నాయి. షారుఖ్ ఖాన్‌కు చెందిన కోల్‌కతా నైట్ రైడర్స్ జట్టు అబుదాబి నైట్‌రైడర్స్ ఫ్రాంచైజీని దక్కించుకుంది. 

యూఏఈ టీ20 లీగ్ ఛైర్మన్ ఏమన్నారు

ప్రతిష్టాత్మకమైన యూఏఈ టీ20 ప్రసార హక్కుల కోసం జీ గ్రూప్ వంటి అత్యంత విశ్వసనీయమైన బ్రాడ్‌కాస్ట్ భాగస్వామి లభించడమంటే అంతకుమించి సంతృప్తి మరొకటి లేదని యూఏఈ టీ20 లీగ్ ఛైర్మన్ ఖాలిద్ అల్ జరూనీ తెలిపారు. పునీత్ గోయెంకా, రాహుల్ జోహ్రిలకు ఆయన కృతజ్ఞతలు తెలిపారు. యూఏఈ టీ20 తొలి మీడియా హక్కుల్ని సొంతం చేసుకోవడం ద్వారా జీ గ్రూపు మరోసారి స్పోర్ట్స్ బ్రాడ్‌కాస్ట్ రంగంలో ప్రవేశించింది. మా లీగ్ మ్యాచెస్‌ను అప్రతిహతంగా అందరికీ చేరువయ్యేలా జీ గ్రూప్ చేస్తుందని నమ్ముతున్నామన్నారు.

జీల్ సౌత్ ఆసియా బిజినెస్ ప్రెసిడెంట్ రాహుల్ జోహ్రీ ఏమన్నారు

జీ ఎంటర్‌టైన్‌మెంట్ ఎంటర్‌ప్రైజెస్ లిమిటెడ్ జీల్ బిజినెస్ సౌత్ ఆసియా రాహుల్ జోహ్రి ఈ ఒప్పందం గురించి మాట్లాడారు. యూఈఏ టీ20 ప్రసార హక్కుల్ని దక్కించుకోవడం ఆనందంగా ఉందన్నారు. పెద్ద పెద్ద క్రికెట్ సార్స్, పెద్ద ఫ్రాంచైజీలతో కూడిన యూఈఏ టీ20 లీగ్ ఇప్పటికే అందరి దృష్టీ ఆకర్షిస్తోందన్నారు. ప్రేక్షకులకు అద్భుతమైన క్రికెట్, ఎంటర్‌టైన్‌మెంట్ ప్రపంచవ్యాప్తంగా అందిస్తామన్నారు. 

జీ ఛానెల్స్ అద్భుత రీచ్

యూఏఈ టీ20 లీగ్, జీ గ్రూపులకు ఎమిరేట్స్ క్రికెట్ బోర్డ్ ఈసీబీ జనరల్ సెక్రటరీ ముబష్షిర్ ఉస్మానీ అభినందనలు తెలిపారు. జీ ఛానెల్స్ అద్భుత రీచ్, డిజిటల్ మీడియా వేదిక సామర్ధ్యాన్ని గుర్తించామని..అది లీగ్ వ్యూయర్ షిప్‌కు ఉపయోగపడుతుందని చెప్పారు. ఈ టోర్నమెంట్ ఎమిరేట్స్ క్రికెట్ అభివృద్ధికి..లోకల్ ట్యాలెంట్ ప్రోత్సహించేందుకు దోహదపడుతుందన్నారు. 

Also read: GT vs RR Playing XI: క్వాలిఫయర్-1‌‌లో టాప్ జట్ల మధ్య పోటీ.. అందరి కళ్ళు ఆ ఇద్దరిపైనే! తుది జట్లు ఇవే!

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి TwitterFacebook 

Trending News