వైఎస్ రాజశేఖర రెడ్డి చేపట్టిన పాదయాత్ర ఆయన జీవిత గమనాన్ని, పార్టీ స్థితిగతుల్ని మార్చేసింది. నవంబర్ 6 నుంచి వైఎస్. జగన్ చేపట్టిన పాదయాత్ర ఆయన రాజకీయ చరిత్రను, అధికారాన్ని కట్టబెడుతుందా..? సరిగ్గా 15ఏళ్ల క్రిందట ఆంధ్రప్రదేశ్లో కాంగ్రెస్ పార్టీ పరిస్థితి అగమ్య గోచరం. ప్రతిపక్షంలో ఉండి అధికారం కోసం ఎదురుచూస్తున్నజాతీయపార్టీ. 2004 ఎన్నికల్లో అధికారం చేపట్టి..పార్టీకి బలమైన పునాది ఏర్పాటు చేయాలని వైఎస్ కంకణం కట్టుకున్నారు.
వైఎస్సాఆర్సీపీ చీఫ్ వై ఎస్ జగన్మోహన్ రెడ్డి చేపట్టిన 'ప్రజా సంకల్ప యాత్ర' నేటి నుంచి ప్రారంభం కానుంది. వైఎస్ఆర్ కడప జిల్లాలోని ఇడుపులపాయ నుంచి శ్రీకాకుళం జిల్లా ఇచ్ఛాపురం వరకు ఈ యాత్ర కొనసాగుతుంది. సుమారు 3,000 కిలోమీటర్లు పాదయాత్ర చేయనున్నారు.
ప్రజా సంకల్ప యాత్రకు బయలుదేరే ముందు వైఎస్ఆర్ సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి శనివారం తెల్లవారుజామున నైవేద్య సమయంలో తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామివార్లను దర్శించుకున్నారు. ఆతరువాత రంగనాయకులు మండపం చేరుకొని వేద పండితుల ఆశీర్వచనాలు తీసుకున్నారు. వైఎస్ జగన్ మోహన్ రెడ్డి వెంట ఆ పార్టీ ఎంపీలు, ఎమ్మెల్యేలు, పలువురు నేతలు ఉన్నారు.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.