Mukesh ambani రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముకేశ్ అంబానీ తిరిగి తన స్థానాన్ని పదిలపర్చుకున్నారు. సంపదనలో తనను ఈ మధ్య దాటేసిన గౌతమ్ అదానీని వెనక్కి నెట్టి మళ్లీ మొదటి స్థానంలో నిలిచారు. షేర్ మార్కెట్లో ఆర్ఐఎల్ షేర్లకు తెగ డిమాండ్ ఏర్పడడంతో మళ్లీ తన స్థానాన్ని చేజిక్కించుకున్నారు. రిలయన్స్ షేర్ల ధరలు దూకుడు ప్రదర్శించడం... అంబానీ షేర్లు క్షీణించడం ముకేష్ అంబానీకి కలిసి వచ్చింది. ప్రస్తుతం తాజా లెక్కల ప్రకారం ముకేశ్ ఆస్థి 7.74 లక్షల కోట్లుగా నమోదు అయ్యాయి. 7.66 లక్షల కోట్లతో అదానీ రెండో స్థానంలో నిలిచారు.
Jio 5G Service to Launch in India: రిలయన్స్ జియో 5జీ సేవల కోసం ఎదురుచూస్తున్నవారికి కీలక ప్రకటన వచ్చింది. ఇండియా మొబైల్ కాంగ్రెస్ 2020 సమావేశంలో మంగళవారం మాట్లాడుతూ.. వచ్చే ఏడాది ద్వితీయార్ధంలో జియో 5జీ సేవలు అందుబాటులోకి రానున్నాయని ముఖేష్ అంబానీ ప్రకటించారు.
రిలయన్స్ తక్కువ ధరకే 4జి స్మార్ట్ ఫోన్ అందుబాటులోకి తీసుకొచ్చిన విషయం అందరికీ తెలిసిందే. ఇప్పటికే ఫోన్ తొలివిడత బుకింగ్ చేసుకున్న వారికి డెలివరీ చేసే పనిలో పడింది జియో. కానీ తాజా జియో షరతులతో ఫోన్ కొనాలా? వద్దా? అని వినియోగదారులు ఆలోచిస్తున్నారు. అయితే జియో నుంచి స్మార్ట్ ఫోన్ విడుదలైన ప్రస్తుత తరుణంలో, దాని కంటే ఎక్కువ ఫీచర్స్ తో, కేవలం 2500 రూపాయలకే స్మార్ట్ ఫోన్ అందేలా ఎయిర్టెల్ ఒక కొత్త ఫోన్ ను తయారుచేస్తుంది. ఎయిర్టెల్ స్పీడ్ చూస్తుంటే, బహుశా దీపావళి లేదా అంతకు ముందే ఫోన్ విడుదల చేసే అవకాశం ఉంది. జియో లాగే వాయిస్, డేటా సర్వీసెస్ లు ఎయిర్టెల్ ఫోన్ లో ఉన్నాయట.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.