Bandi Sanjay Reaction on KTR Notices: కేసీఆర్ కొడుకు పరువు, ప్రతిష్ట విలువ ప్రస్తుతం రూ. 100 కోట్లయితే, తెలంగాణలో ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న 30 లక్షల మంది యువత భవిష్యత్ మీ పాలనవల్ల ప్రశ్నార్థమైంది. మరి వారికెంత మూల్యం చెల్లిస్తారో చెప్పాలి. పరువు నష్టం పేరుతో కూడా డబ్బులు సంపాదించాలనుకోవడం సిగ్గుచేటు అంటూ మంత్రి కేటీఆర్ పై బండి సంజయ్ నిప్పులు చెరిగారు.
KTR Defamation Suit: హైదరాబాద్: తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ లో ఏఈ పరీక్ష పేపర్ల లీకేజ్ వ్యవహారంలో తనపై నిరాధారమైన, అసత్య ఆరోపణలు చేస్తున్న తెలంగాణ పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి, తెలంగాణ రాష్ట్ర బిజేపీ అధ్యక్షుడు బండి సంజయ్‌లకు మంత్రి కల్వకుంట్ల తారకరామా రావు లీగల్ నోటీసులు పంపారు.
Bandi Sanjay On Rahul Gandhi: కాంగ్రెస్‌కు పట్టిన శని రాహుల్ గాంధీ అని.. ఆయనవల్లే పార్టీ భ్రష్టు పట్టిందని సొంత పార్టీ కార్యకర్తలే చెబుతున్నారని అన్నారు బండి సంజయ్. కోర్టు ఇచ్చిన తీర్పును రాహుల్ గాంధీ శిరసావహించాలన్నారు. రాహుల్ గాంధీ ఏం మాట్లాతున్నారో ఆయనకే తెలియదన్నారు.
సిట్ విచారణకు తాను హాజరుకావట్లేదని తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ అన్నారు. తనకు నోటీసులు అందలేదని.. ఇంటి వద్ద ఏవో పేపర్లు పడి ఉన్నాయన్నారు. తన దగ్గర ఉన్న ఆధారాలు సిట్‌కు ఇవ్వనని చెప్పారు.
Bandi Sanjay About TSPSC Paper Leakage Scam: టీఎస్పీఎస్సీతో సంబంధం లేదని ట్విట్టర్ టిల్లు చెప్పడం పెద్ద జోక్. ఆయనది నాలుకా? తాటిమట్టా? ఏ సంబంధం లేకపోతే సీఎం నిర్వహించే సమీక్షలో ఎందుకు పాల్గొన్నారు. విద్యాశాఖ మంత్రి, చీఫ్ సెక్రటరీ, టీఎస్పీఎస్సీ అధికారులతో కలిసి మీడియాతో మాట్లాడుతూ పేపర్ లీకేజీకి ఇద్దరు వ్యక్తులే తప్ప టీఎస్పీఎస్సీ తప్పిదం లేనే లేదని ఎట్లా చెబుతారు అని బండి సంజయ్ ప్రశ్నించారు.
KTR legal notices to Revanth Reddy and Bandi Sanjay: టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌లకు మంత్రి కేటీఆర్ లీగల్ నోటీసులు పంపించారు. టీఎస్పీఎస్సీ వ్యవహారంలో ఈ ఇద్దరు నేతలు మంత్రిపై సంచలన వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. రాజకీయ దురుద్దేశంతోనే తన పేరును లాగుతున్నారంటూ కేటీఆర్ ఫైర్ అయ్యారు.
Minister KTR Vs Bandi Sanjay: మంత్రి కేటీఆర్, బండి సంజయ్ ట్విట్టర్ వేదికగా వెరైటీగా విమర్శలు గుప్పించుకున్నారు. ఉగాది పంచాంగం చెబుతూ.. మంత్రి కేటీఆర్ ట్వీట్ చేయగా.. బండి సంజయ్ కూడా అదేరీతిలో కౌంటర్ ఇచ్చారు. ప్రస్తుతం ఈ ట్వీట్లు వైరల్ అవుతున్నాయి.
Teenmar Mallanna Arrest : తీన్మార్ మల్లన్న అరెస్ట్‌ను బండి సంజయ్ ఖండించాడు. కేసీఆర్ నీకు మూడిందంటూ ఫైర్ అయ్యాడు. దొంగల్లా వచ్చి పోలీసులు మల్లన్నను ఎత్తుకుపోతారా? అంటూ నిలదీశాడు.
Teenmaar Mallanna Wife : ప్రభుత్వం చేస్తోన్న పనులు, ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తుడటం, విమర్శలు చేస్తుండటంతోనే ఇలా అరెస్ట్ చేశారని, ఆయనకు ఏం జరిగినా కేసీఆర్‌దే బాధ్యత అని మల్లన్న భార్య చెప్పుకొచ్చింది.
Bandi Sanjay On Teenmar Mallanna Arrest: క్యూ న్యూస్ అధినేత తీన్మార్ అరెస్ట్‌ను బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ తప్పుబట్టారు. ప్రశ్నించే గొంతులను అణిచివేస్తారా..? అని సీఎం కేసీఆర్‌ను ప్రశ్నించారు. తక్షణమే అరెస్ట్ చేసిన జర్నలిస్టులను విడుదల చేయాలని డిమాండ చేశారు.
TSPSC Paper Leakage Case: తెలంగాణ ప్రజల ఆకాంక్షలను, కార్యకర్తల మనోభావాలను గాలికొదిలేసిన కేసీఆర్ ఇవాళ కార్యకర్తలకు లేఖ రాసిన తీరే ఎన్నో సందేహాలను తావిచ్చిందన్నారు. కేసీఆర్ కార్యకర్తలకు రాసిన లేఖను ఉద్దేశిస్తూ బండి సంజయ్ బహిరంగ లేఖ రాశారు.
Bandi Sanjay On TSPSC Paper Leakage: టీఎస్పీఎస్సీ పేపర్ లీకేజీపై బీజేపీ పోరాటం ఉధృతం చేసింది. 'మా నౌకర్లు మాక్కావాలె' నినాదంతో అన్ని జిల్లా కేంద్రాల్లో బీజేపీ దీక్ష చేపట్టనుంది. మంత్రి కేటీఆర్‌ను బర్తరఫ్ చేసే వరకు ఉద్యమం ఆగదని బండి సంజయ్ హెచ్చరించారు.
Bandi Sanjay Press Meet: తన విషయంలో మహిళా కమిషన్ లీక్ ఇచ్చినట్లుగా తాను భావించడం లేదన్న బండి సంజయ్.. మీడియాకు లీకుల పేరుతో జరుగుతున్న ప్రచారంపై మహిళా కమిషనే వివరణ ఇవ్వాలి అని పేర్కొన్నారు. మహిళా కమిషన్ ఇచ్చిన నోటీసులకు స్పందిస్తూ లిఖిత పూర్వకంగా సమాధానం ఇచ్చాను అని తెలిపారు.
Serious Warning to Bandi Sanjay: ఎమ్మెల్సీ కవితను ఈడీ విచారణకు ఢిల్లీ రమ్మని కోరిన సమయంలో చేసిన అనుచిత వ్యాఖ్యలకు గాను బండి సంజయ్ మహిళా కమిషన్ ముందు హాజరయ్యారు. ఈ క్రమంలో మహిళా కమిషన్ ఆగ్రహం వ్యక్తం చేసినట్టు తెలుస్తోంది.
Bandi Sanjay On TSPSC Paper Leakage: టీఎస్పీఎస్సీ పేపర్ లీకేజీ వ్యవహారంలో బీజేపీ నేతలు ఉన్నారని ఆరోపించడం సిగ్గుచేటని బండి సంజయ్ అన్నారు. పేపర్ లీకేజీకి బాధ్యుడు మంత్రి కేటీఆర్ అని అన్నారు. ఆయనను బర్తరఫ్ చేయాలన డిమాండ్ చేశారు.
Bandi Sanjay On Tspsc Paper Leakage: టీఎస్పీఎస్సీ పేపర్ లీకేజీ వ్యవహారంపై బండి సంజయ్ స్పందించారు. దీనికి పెద్ద కుట్రదాగి ఉందన్నారు. లక్షలాది మంది నిరుద్యోగుల జీవితాలను ఫణంగా పెట్టడం క్షమించరాని నేరమని ఫైర్ అయ్యారు. గ్రూప్-1 పరీక్ష ప్రశ్నాపత్రం కూడా లీక్ అయినట్లు ఆధారాలు కనిపిస్తున్నాయని అన్నారు.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.