BJP MLAs Raghunandan Rao, Raja Singh to join BRS ?: బీజేపీలో ట్రిపుల్ R గా పేరు తెచ్చుకున్న డైనమిక్ ఎమ్మెల్యేస్ లో వీరు ఇద్దరు పార్టీలో తమ గళాన్ని గట్టిగ వినిపించి ఇప్పుడు ఒక్కసారిగా మౌనం పాటిస్తున్నారు. రఘునందన్ రావు ఒక పదవిపై కన్నువేయడం, రాజసింగ్ నోటి మాటల వలెనే బీజేపీ అధిష్టానం వీరిని పక్కన పెట్టినట్టు సమాచారం. దీనికి వారిలో అసంతృప్తి కారణమా ? సరైన గుర్తింపు లేకపోవడమా ?
Minister Singireddy Niranjan Reddy: కొండను తవ్వి ఎలుకను పట్టినట్లు, ఏదో రంధ్రాన్వేషణ చేసినట్లు తొలుత భూములు కొని ఎస్టీల పేరు మీదకు.. ఆ తర్వాత మంత్రి కుటుంబసభ్యుల పేరు మీదకు వెళ్లాయని రఘునందన్ రావు ఆరోపించారు. కానీ దానివెనుకున్న అసలు వాస్తవం వేరే ఉంది అంటూ రఘునందన్ రావు చేసిన ఆరోపణలకు మంత్రి నిరంజన్ రెడ్డి వివరణ ఇచ్చారు.
BJP MLA Raghunandan Rao: మంత్రి నిరంజన్ రెడ్డిపై బీజేపి ఎమ్మెల్యే రఘునందన్ రావు సంచలన ఆరోపణలు చేశారు. కృష్ణా నది భూములు ఆక్రమించి మంత్రి ఫామ్ హౌజ్ నిర్మించుకున్నారన్న రఘునందన్ రావు.. ఆయా భూములకు సంబంధించిన రికార్డులు మానోపాడు తహశీల్దార్ కార్యాలయంలో జరిగిన అగ్ని ప్రమాదంలో కాలిపోయాయని అన్నారు.
Raghunandan Rao: ఐటీ దాడులపై మంత్రి మల్లారెడ్డి చేసిన వ్యాఖ్యలను బీజేపీ ఎమ్మెల్యే రఘునందన్ రావు ఖండించారు. కక్ష సాధింపులో భాగంగానే ఐటీ దాడులు చేస్తున్నారని మంత్రి ఆరోపించడం సరికాదన్నారు. సాక్ష్యాల ఆధారంగానే ఐటీ అధికారులు సోదాలు జరుపుతారన్నారు.
మునుగోడు ఎన్నికల ప్రచారం జరుగుతోంది. అన్ని పార్టీలు గెలుపు కోసం శాయశక్తుల శ్రమిస్తున్నాయి. ఈ నేపథ్యంలో దుబ్బాక ఎమ్మెల్యే రఘునందన్ రావు బీజేపీ తరుపున మునుగోడు ప్రచారం నిర్వహించేందుకు వెళ్లారు. అయితే అక్కడ ఆయనకు ప్రజల నుంచి నిరసన సెగ తగిలింది. పూర్తి సమాచారం కోసం వీడియోను చూడండి.
Raghunandan Comments: తెలంగాణలో అధికార టీఆర్ఎస్, బీజేపీ నేతల మధ్య డైలాగ్ వార్ కంటిన్యూ అవుతోంది. కేంద్ర ప్రభుత్వంపై టీఆర్ఎస్ నేతలు ఆరోపణలు చేస్తుంటే.. రాష్ట్ర సర్కార్ తీరుపై కమలం నేతలు భగ్గుమంటున్నారు. తాజాగా దుబ్బాక బీజేపీ ఎమ్మెల్యే రఘునందన్ రావు కేసీఆర్ సర్కార్ పై సంచలన వ్యాఖ్యలు చేశారు.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.