Delta variant cases: కరోనావైరస్ సెకండ్ వేవ్‌లో ప్రస్తుతం డెల్టా వేరియంట్ డేంజర్ బెల్స్ మోగిస్తోంది. ఇప్పటికే 135 దేశాలకు వ్యాపించిన డెల్టా వేరియంట్ అత్యంత ప్రమాదకరంగా మారినట్టు ఇంగ్లండ్‌లోని యూనివర్సిటీ ఆఫ్ అలబామా పరిశోధకులు హెచ్చరించారు. డెల్టా వేరియంట్‌ను నివారించాలంటే 80-90 శాతం మంది హెర్డ్ ఇమ్యూనిటీ (Herd immunity) పొందడమే ఒక మార్గం అని పరిశోధకులు తెలిపారు.
Delta variant cases rising amid Corona second wave: హైదరాబాద్: డెల్టా ప్లస్ వేరియంట్ కేసులు భారీగా వ్యాపిస్తున్నాయని చెప్పిన తెలంగాణ రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ హెల్త్ డైరెక్టర్ శ్రీనివాస్ రావు.. జనం మరింత జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉందని అన్నారు. థర్డ్ వేవ్ గురించి శ్రీనివాస రావు మంగళవారం మీడియాతో మాట్లాడుతూ.. కరోనా థర్డ్ వేవ్ (Corona third wave) రావటం అనేది జనం చేతుల్లోనే ఉందని అన్నారు.
Night curfew extended in Andhra pradesh: అమరావతి: కరోనావైరస్ను కట్టడి చేయడం కోసం ఆంధ్రప్రదేశ్‌లో రాత్రి కర్ఫ్యూను మరోసారి పొడిగిస్తూ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాల మేరకు ఆగస్టు 14వ తేదీ వరకు నైట్ కర్ఫ్యూని పొడిగిస్తూ వైద్య ఆరోగ్య శాఖ ముఖ్య కార్యదర్శి ఎకె సింఘాల్ ఉత్తర్వులు జారీ చేశారు.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.