Medaram Jatara Bus Timings: మేడారం సమ్మక్క, సారలమ్మ జాతర నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం తగిన ఏర్పాట్లు చేస్తోంది. జాతరకు వెళ్లే భక్తుల కోసం ప్రత్యేక బస్సులను ఏర్పాటు చేసేందుకు టీఎస్ఆర్టీసీ సిద్ధమైంది. ఫిబ్రవరి 16 నుంచి 19 వరకు ఈ ప్రత్యేక బస్సులను నడపనున్నట్లు రాష్ట్ర రవాణా మంత్రి పువ్వాడ అజయ్ తెలిపారు.
tsrtc run special buses for medaram jatara : మేడారం జాతరకు టీఎస్ ఆర్టీసీ ప్రత్యేక బస్సులు నడుపుతోంది. హన్మకొండ నుంచి మేడారానికి స్పెషల్ బస్సులు. ఇవాల్టి నుంచే నడుస్తోన్న సర్వీసులు. జాతర సమయంలో మరో 3,845 బస్సులు నడపనున్న ఆర్టీసీ.
దేశంలోనే అతిపెద్ద గిరిజన జాతరగా పేరుగాంచిన మేడారం జాతర ఏర్పాట్లను పరిశీలించడానికి రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్ తో కలసి పోలీస్ డైరెక్టర్ జనరల్ ఎం.మహేందర్ రెడ్డి, అడిషనల్ డీ.జీ. జితేందర్ లు పర్యటించారు.
Sammakka Saralamma Jatara తెలంగాణ కుంభమేళా మేడారం జాతర ప్రారంభమైంది. పలు రాష్ట్రాల నుంచి భక్తులు రావడంతో అక్కడ పండుగ వాతావరణం నెలకొంది. బీఎస్ఎన్ఎల్ ఉచిత వైఫై సేవల్ని అందుబాటులోకి తెచ్చింది.
ప్రపంచ గిరిజన జాతరకు కుటుంబసమేతంగా ఈ నెల 7వ తేదీన కేసీఆర్ మేడారంలో పర్యటించనున్నట్టుగా సీఎంఓ వర్గాలు తెలిపాయి. సీఎం కేసీఆర్ సమ్మక్క-సారక్క దేవతలకు మొక్కులు చెల్లించుకుంటారని ఆయనతో పాటు
మేడారం జాతరకు హాజరు కావాలనే భక్తులకు బేగంపేట నుండి విమాన సేవలను ఉపయోగించుకోవచ్చని, జీఎస్టీతో సహా ఒక లక్ష ఎనభై వేల రూపాయలు చెల్లించి తిరిగి రావచ్చని పర్యాటక శాఖ తెలిపింది. ఈ యాత్రలో ఆరుగురు భక్తులు మేడారం సందర్శించి రావచ్చని తెలిపింది.
మేడారం జాతరకు వచ్చే భక్తుల రద్దీని దృష్టిలో పెట్టుకుని బస్సు సేవలు పెంచేందుకు ప్రణాళికలు సిద్ధం చేసుకున్న టిఎస్ఆర్టీసీ.. అదే సమయంలో బస్సు చార్జీలు కూడా పెంచి మేడారం భక్తులకు షాక్ ఇచ్చింది. ఫిబ్రవరి 5 నుండి ఫిబ్రవరి 8 వరకు జరగబోయే మేడరం జాతరకు వెళ్లే బస్సుల ఛార్జీలను పెంచుతూ తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ నిర్ణయం తీసుకుంది.
మేడారం జాతరకు ఏర్పాట్లు జరుగుతున్నాయని తెలంగాణ రాష్ట్ర గిరిజన సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాథోడ్ తెలిపారు. జాతరకు కోటిన్నర మంది భక్తులు వచ్చే అవకాశముందని అంచనా వేస్తూ.. అందుకనుగుణంగా ఏర్పాట్లు చేయాలని మంత్రి అధికారులను ఆదేశించారు.
ఆసియా ఖండంలోనే అతిపెద్ద గిరిజన జాతరగా పేరున్న మేడారం మహా జాతర శనివారం రాత్రి ముగిసింది. ప్రతీ రెండేళ్లకొకసారి జరిగే ఈ జాతరలో, సంప్రదాయం ప్రకారం సమ్మక్క, సారలమ్మ అమ్మవార్లను చివరిగా వన ప్రవేశం చేయించడం ఆనవాయితీ. గిరిజన జాతర సంప్రదాయం ప్రకారమే పూజారులు సమ్మక్కను చిలకలగుట్ట, సారలమ్మను కన్నెపల్లికి, గోవిందరాజును కొండాయి, పగిడిద్దరాజును పూనుగొండ్లకు తీసుకెళ్లారు.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.