Siddipet IT towers Inauguration: మంత్రి కేటీఆర్ గురించి మంత్రి హరీశ్ రావు మాట్లాడుతూ, కేటీఆర్ గురించి ఎంత చెప్పినా తక్కువే అని కొనియాడారు. కేటీఆర్ లాంటి ఐటీ మినిస్టర్ ఇతర రాష్ట్రాల్లో కావాలని యువత కోరుకుంటోంది అని చెబుతూ మంత్రి కేటీఆర్ పని తీరుపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
కేపీహెచ్‌బీ డివిజన్ 5వ ఫేజ్‌లోని లోధ టవర్స్ సమీపంలో 100 పడకల ప్రభుత్వ ఆసుపత్రి నిర్మాణానికి మంత్రి హరీష్ రావు శంకుస్థాపన చేశారు. రెండేళ్ల పాటు కష్టపడి మీ ఎమ్మెల్యే ఈ ఆసుపత్రి వచ్చేలా కృషి చేశారని అన్నారు. 1000 పడకల టిమ్స్ ఆసుపత్రి వస్తుందని.. పఠాన్ చెరులో మరో సూపర్ స్పెషాలిటీ వస్తుందని తెలిపారు.
Telangana Suparipalana Dinotsavam In Sangareddy: ఏపీ నేతలపై మంత్రి హరీష్ రావు సెటైర్లు వేశారు. అక్కడి నేతల మాటలు దాటాయని.. చేతలు పకోడీలు వేసినట్లు ఉందన్నారు. వాళ్లది పని తక్కువ.. మనది పని ఎక్కువ అన్నారు.
Minister Harish Rao: మహాభారతంలో కౌరవుల్లాగా బీజేపీ, కాంగ్రెస్ పార్టీ నేతలు ఇక్కడ గౌరవెల్లి ప్రాజెక్టును ఆపాలని ఎంతో ప్రయత్నం చేశారు. కానీ చివరకు న్యాయం గెలిచి ధర్మం నిలబడ్డట్టు మేము రైతుల కోసం, ప్రజల కోసం చేపట్టిన గౌరవెల్లి ప్రాజెక్టును విజయవంతంగా పూర్తి చేశాం.
Minister Harish Rao: కాళేశ్వరం ప్రాజెక్టులో ఈఎన్సీ హరేరాం పాత్ర చాలా గొప్పది. అన్నీ సమయాల్లో, సందర్భాల్లో అండగా ఉన్నారు అని మంత్రి హరీశ్ రావు అన్నారు. దశాబ్ది ఉత్సవాలలో భాగంగా రంగనాయక జలాశయం నడి మధ్య సాగునీటి పండుగ జరగడం సంతోషంగా ఉందన్నారు.
Minister Harish Rao Speech in Achhampeta BRS meeting: తెలంగాణ గొప్పతనం నిలిపే విధంగా కేసిఆర్ సెక్రటేరియట్ కడితే.. బిజెపి నాయకుడు కూలగొడతా అన్నాడు. కాంగ్రెస్ వారు పేల్చేస్తాం అన్నాడు. కూల్చేటోడో లేక పేల్చేటోడో కావాలా.. లేదంటే తెలంగాణ నిర్మించేటోడు కావాలా అనేది జనమే నిర్ణయించుకోవాలి అని మంత్రి హరీష్ రావు సూచించారు.
YS Sharmila Slams Minister Harish Rao: బీఆర్ఎస్ ప్రభుత్వం మోసాలు రాస్తే రామాయణం.. వింటే మహాభారతం అవుతుందని వైఎస్ షర్మిల అన్నారు. తెలంగాణ రాష్ట్రాన్ని అప్పుల కుప్పగా మార్చారని విమర్శించారు. దొంగల పాలనను అంతం చేసే రోజులు దగ్గర్లోనే ఉన్నాయన్నారు.
Minister Harish Rao Comments on Revanth Reddy: రేవంత్ రెడ్డిది వక్ర బుద్ది... వంకర మాటలు ఎక్కువ మాట్లాడుతున్నాడు. ఆయనకి ఉద్యోగాలు ఎలా భర్తీ చేస్తారు అనే విషయం కూడా తెలియకుండానే ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నాడని చెబుతూ.. రేవంత్ రెడ్డిపై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు.
TPCC Chief Revanth Reddy Challenges Ministers KTR, Harish Rao: లక్ష కోట్ల విలువైన ఆస్తిని కేవలం రూ.7,300 కోట్లకు అమ్ముకున్నారని ఆరోపించారు. దీంతో పోలిస్తే ఢిల్లీ లిక్కర్ స్కాం చాలా చిన్నదని రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. అయితే ఇంత బహిరంగంగానే దోపిడీ జరుగుతుంటే బీజేపీ నేతలు ఏంచేస్తున్నారని ప్రశ్నించారు.
Gram Panchayats Funds: గత కొంతకాలంగా గ్రామ పంచాయతీలకు నిలిచిన నిధులను విడుదల చేసింది కేసీఆర్ సర్కారు. మొత్తం రూ.1190 కోట్లు విడుదల చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఈ మేరకు మంత్రులు హరీష్ రావు, ఎర్రబెల్లి దయాకర్ రావు వివరాలు వెల్లడించారు.
Telangana Cabinet Meeting Decisions: కొత్తగా ఏర్పాటైన తెలంగాణ సచివాలయంలో జరిగిన కేబినెట్ భేటీలో తీసుకున్న నిర్ణయాలను మంత్రులు హరీశ్ రావు, తలసాని శ్రీనివాస్ యాదవ్, గంగుల కమలాకర్, మల్లా రెడ్డి, వేముల ప్రశాంత్ రెడ్డి మీడియాకు వెల్లడించారు. కేబినెట్ భేటీలో తీసుకున్న కీలక నిర్ణయాలు ఇలా ఉన్నాయి.
Minister Harish Rao: వైద్యం, వైద్య విద్య విషయంలో తెలంగాణ ఏర్పడిన తొలినాళ్లలో 4, గడిచిన ఏడాదిలో ఒకేసారి 8 మెడికల్ కాలేజీలు ప్రారంభించుకొని ఎంతో వృద్ధి సాధించామని, ఈ ఏడాది మరో 9 మెడికల్ కాలేజీల్లో వంద ఎంబీబీఎస్ సీట్లతో తరగతులు ప్రారంభించుకోబోతున్నట్లు ఆర్థిక, వైద్య ఆరోగ్య శాఖ మంత్రి హరీశ్ రావు తెలిపారు.
Assistant Professors Posts: జిల్లాకు ఒక మెడికల్ కాలేజీ ఏర్పాటు చేయాలన్న సీఎం కేసీఆర్ నిర్ణయంతో రాష్ట్రంలో వైద్య విద్య అవకాశాలు పెరిగి, సూపర్ స్పెషాలిటీ సేవలు మారుమూల ప్రాంతానికి సైతం చేరువ అయ్యాయని మంత్రి హరీశ్ రావు పేర్కొన్నారు. ప్రభుత్వ ఆసుపత్రుల్లో అసిస్టెంట్ ప్రొఫెసర్లుగా ఎంపికైన వైద్యులకు మంత్రి శుభాకాంక్షలు తెలిపారు.
Harish Rao Comments On Governor Tamilisai Soundararajan: గవర్నర్ తమిళ్ సై సౌందరరాజన్‌పై మంత్రి హరీష్ రావు తీవ్రస్థాయిలో మండిపడ్డారు. రాష్ట్ర అభివృద్ధికి సంబంధించిన బిల్లులు ఎందుకు పెండింగ్‌లో పెడుతున్నారని ప్రశ్నించారు. గవర్నర్‌కు ఎన్నికల్లో పోటీ చేయాలని ఉంటే.. బీజేపీలో చేరి ఎక్కడైనా పోటీ చేయొచ్చన్నారు.
NIMS Hospital Expansion: నూతన సచివాలయంలో మంత్రి హరీష్ రావు తొలి సమీక్ష సమావేశం నిర్వహించారు. నిమ్స్ ఆసుపత్రి విస్తరణపై అధికారులతో చర్చించారు. నిమ్స్‌లో నూతన భవన నిర్మాణానికి వేగంగా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.
Telangana Ministers in Telangana New Secretariat: కొత్త సచివాలయంలో మంత్రులు ఎవరికి కేటాయించిన చాంబర్లలో వారు ప్రత్యేక పూజలు చేపట్టిన అనంతరం తమకు కేటాయించిన శాఖల బాధ్యతలు చేపట్టారు. ఈ నేపథ్యంలో ఏయే శాఖల మంత్రులు ఏయే ఫైళ్లపై తమ తొలి సంతకాలు చేశారంటే...
Minister Harish Rao On Amit Shah: బీజేపీ అధికారంలోకి రావడం ఎండమావేనని.. మళ్లీ హ్యాట్రిక్ కొట్టేది మనమేనని మంత్రి హరీష్ రావు ధీమా వ్యక్తం చేశారు. కర్ణాటక ఎన్నికల్లో ఓటమి తప్పదనే ఫ్రస్టేషన్లో అమిత్ షా మాట్లాడుతున్నారని అన్నారు.
Minister Harish Rao : మెదక్ ఆర్డినెన్స్‌ను ప్రైవేట్ పరం చేయొద్దని మంత్రి హరీష్ రావు అన్నారు. ఈ మేరకు రక్షణ శాఖ మంత్రి రాజ్ నాథ్ సింగ్‌కు లేఖ రాశారు. నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు. మేకిన్ ఇండియా స్పూర్తిని దెబ్బ తీస్తోందని అన్నారు.
Harish Rao Letter To Rajnath Singh: మెదక్ సహా ఇతర ఆర్డినెన్స్ ఫ్యాక్టరీలను ప్రైవేట్ పరం చేయొద్దంటూ కేంద్ర మంత్రి రాజ్‌నాథ్ సింగ్‌కు మంత్రి హరీష్ రావు లేఖ రాశారు. ప్రైవేట్ పరం చేస్తే.. దాదాపు 25 వేల మంది భవిష్యత్ అంధకారంలో పడుతుందని అన్నారు.
Minister Harish Rao Comments On BJP: బీఆర్ఎస్ ప్రభుత్వానివి పథకాలు, పనులు అయితే.. బీజేపీవి కుట్రలు, పన్నాగాలు అని మంత్రి హరీష్ రావు కామెంట్స్ చేశారు. బీజేపీ పాలిత రాష్ట్రాలది గన్ కల్చర్ అయితే.. మనది అగ్రికల్చర్ అని అన్నారు. తెలంగాణ వచ్చిన తర్వాత నల్గొండ తల రాత మారిందని మంత్రి జగదీశ్ రెడ్డి చెప్పారు.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.