Money Saving Tips For Women: ప్రతిరోజూ మనం చేసే చిన్న చిన్న ఖర్చులు పెద్దగా అనిపించకపోవచ్చు. కానీ నెలాఖరుకు ఆ ఖర్చులన్నీ కలిపితే.. అది పెద్ద మొత్తం అవుతుంది. ముఖ్యంగా పిల్లల చదువుల ఫీజులు, బస్ ఛార్జీలు, బుక్స్, స్కూల్ ఈవెంట్స్.. ఇలా వచ్చేసరికి చాలా మందికి భారం పెరుగుతుంది. అయితే ఇంట్లో కొన్ని అలవాట్లను మార్చుకున్నట్లయితే లక్షన్న వరకు పొదుపు చేసుకోవచ్చు. అంటే ఆ డబ్బుతో మీ పిల్లలు స్కూల్ ఫీజులే కాదు.. కోచింగ్, డ్రాయింగ్ క్లాస్, స్పోర్ట్స్ ఫీజులు కూడా కవర్ అవుతాయి.
Money Saving Tips For Women: సాధారణంగా డబ్బు పొదుపు చేయడంలో మహిళల దగ్గర ఉన్నన్ని మాస్టర్ ప్లాన్ పురుషుల దగ్గర ఉండవు. 10 రూపాయల్లో 5 రూపాయలు ఖర్చు చేసి 5 రూపాయలను మిగుల్చుతారు. పొదుపు అంటే మహిళలు.. మహిళలు అంటే పొదుపు అనే పదానికి చక్కటి నిర్వచనమని చెప్పాలి. భర్త కు వచ్చిన నెల జీతంలో ఇంటి ఖర్చులు భార్యకు ఇస్తే ఆ డబ్బులో సగం మిగల్చడమనేది మహిళల గొప్పతనం. అయితే ఈ నాలుగు పనులు చేస్తే.. ఏడాదికి లక్ష రూపాయలు పోగు చేస్తారు. ఆ నాలుగు చిట్కాలు ఏంటో చూద్దాం.
Money Saving Tips: కొందరు డబ్బును నీళ్లలా ఖర్చు చేస్తుంటారు. ఇంకొందరు ఒక పైసాకు పది ముడులు వేస్తుంటారు. కష్టపడి సంపాదించిన డబ్బును నీళ్లలా ఖర్చు చేయడం కంటే.. పది ముడులు వేస్తూ పొదుపు చేస్తే మీ జీవితం సాఫీగా సాగిపోతుంది. కాబట్టి మీరు చేస్తున్న ఉద్యోగానికి వస్తున్న జీతంతో జీవితాన్ని ఆస్వాదిస్తూ కొంత డబ్బు పొదుపు చేయాలంటే వెంటనే ఈ 4 సూత్రాలను ఫాలో అవ్వండి.
Money Saving Tips: డబ్బు ఎలా పొదుపు చేయాలి. ఆర్థికంగా ఎలా స్థిరపడాలి. ఇలాంటి ఆందోళన సాధారణ మధ్య తరగతి కుటుంబాల్లో ఎక్కువగా కనిపిస్తుంది. నెల జీతం రాగానే ఖర్చులు క్యూలో నిల్చుంటాయి. పొదుపు చేయాలని ఎంత ప్రయత్నించినా.. చివరికి చేతిలో చిల్లిగవ్వ కూడా మిగలదు. ఇలాంటి సమస్యల నుంచి బయటపడేందుకు పెద్ద పెద్ద ప్లాన్స్ వేయాల్సిన అవసరం లేదు. కొన్ని సులభమైన ఆర్థిక నియమాలు పాటిస్తే సరిపోతుంది. మీరు కూడా మీ డబ్బును క్రమపద్ధతిలో మంచి సేవింగ్స్ నిర్మించుకుంటారు. యూట్యూబర్ అంకుర్ చెప్పిన ఈ 5 ముఖ్యమైన ఫైనాన్షియల్ ఫార్మూలాలు మీ పొదుపు మార్గాన్ని రెట్టింపు చేస్తాయి. అవేంటో చూద్దాం.
Money Saving Tips: పిల్లలు భవిష్యత్తులో ఆర్థికంగా స్వతంత్రులు కావాలంటే, చిన్న వయస్సులోనే వారికి డబ్బు విలువను అర్థం చేసుకునేలా చేయాలి. తల్లిదండ్రులుగా మనం చూపించే ప్రేమ, మమత ఎంత ముఖ్యమో, పిల్లలను సరైన దిశలో నడిపించడం కూడా అంతే ముఖ్యం. చిన్నప్పుడు అలవాటు చేసిన కొన్ని చిన్న చిన్న పాఠాలు, వారు పెద్దయ్యాక పెద్ద మార్పులు తీసుకొస్తాయి. ముఖ్యంగా పొదుపు అనే అలవాటు భవిష్యత్తులో వారికి పెద్ద రక్షణగా మారుతుంది.
Money Invest Schemes: ప్రస్తుత పరిస్థితుల్లో ఖర్చులు భారీగా పెరుగుతున్నాయి. రోజువారీ వ్యయాలను మాత్రమే కాదు, రాబోయే ఆర్థిక సవాళ్లను కూడా ఎదుర్కోవాలంటే పొదుపు, పెట్టుబడులు రెండూ తప్పనిసరి. ముఖ్యంగా 25 ఏళ్ల వయస్సు నుంచే సరైన ఆర్థిక క్రమశిక్షణను పాటిస్తే, భవిష్యత్తును సురక్షితంగా మార్చుకోవచ్చు. నెలకు 5,000 రూపాయల చొప్పున నాలుగు విభిన్న పెట్టుబడి అవకాశాల్లో ఇన్వెస్ట్ చేస్తూ 50 ఏళ్లు వచ్చే వరకు కొనసాగిస్తే, పెద్ద మొత్తంలో సంపాదన మీ చేతిలోకి రావచ్చు. ప్రస్తుతం మీ నెల ఆదాయంలో 20,000 రూపాయలు సేవింగ్ కోసం కేటాయించి నాలుగు స్కీముల్లో సమానంగా పెట్టుబడి పెడితే చివరికి ఎంత సంపదను సృష్టించవచ్చో
Money Saving Tips: ఈ రోజుల్లో డబ్బు సంపాదించడం ఎంత కష్టమో.. సేవింగ్స్ చేయడం అంతకంటే కష్టంగా అనిపిస్తుంది. ముఖ్యంగా నెలకు రూ. 21వేలు జీతం వస్తే ఇంటి అద్దె, ఆహారం, కరెంట్, నీటి బిల్లులు, ప్రయాణ ఖర్చులు.. ఇవి అన్నీ కలిస్తే చేతిలో చిల్లిగవ్వ కూడా మిగలదు. అయినప్పటికీ సరైన ప్రణాళికతో ప్రతినెల రూ. 4వేల నుంచి రూ. 6వేలు వరకు ఆదా చేయడం సాధ్యం అవుతుంది. అంటే ఏడాదికి రూ. 40వేల నుంచి రూ. 70వేల వరకు పొదుపు చేయవచ్చు. ఇది ఎలాంటి మ్యాజిక్ కాదు… చాలా మంది ఇదే విధానాన్ని అనుసరించి తమ ఫైనాన్స్‌లను సరిచేసుకున్నారు. తక్కువ జీతంతోనూ ఎలా సేవింగ్ చేయాలో తెలుసుకోవాలనుకుంటే ఈ మార్గదర్శకం మీకోసమే.
Money Saving Tips: అకౌంట్లో జీతం పడిన రెండు రోజులకే సున్నా అవుతుంది. పర్సులో చిల్లిగవ్వా లేకపోవడంతో అప్పులు చేయాల్సి వస్తుంది. నేటికాలంలో చాలా మంది ఎదుర్కొంటున్న సమస్యలు ఇవే. అయితే కొద్దిగా తెలివిగా ఆలోచిస్తే..నెల జీతంలోనే పొదుపు కూడా చేసుకోవచ్చు. బ్యాంక్ బ్యాలెన్స్ కూడా పెంచుకోవచ్చు. బ్యాంక్ బ్యాలెన్స్ తగ్గడానికి పెద్ద ఖర్చులే కారణం కాదు.. మనకు తెలియకుండానే రోజూ చేసే చిన్న చిన్న అలవాట్లే మన పొదుపును క్రమంగా దెబ్బతీస్తుంది. ఈ అలవాట్లలో కొద్దిపాటి మార్పులు చేస్తే, మీరు ఊహించని విధంగా మీ పొదుపును పెంచుకోవచ్చు. ప్రతిరోజూ డబ్బు ఆదా చేయడంలో సహాయపడే ముఖ్యమైన విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం.
Money Saving Tips: సూపర్ మార్కెట్‌లోకి అడుగు పెట్టగానే మనం ఒక కొత్త ప్రపంచంలోకి వెళ్లినట్లుగా అనిపిస్తుంది. రకరకాల వస్తువులు, ఆకర్షణీయమైన ఆఫర్లు, డిస్కౌంట్ బోర్డులు మన దృష్టిని ఆకర్షిస్తాయి. ఫలితంగా మనం ముందుగా ప్లాన్ చేయని వస్తువులను కూడా కొనుగోలు చేస్తూ, చివరికి బిల్లు చూసినప్పుడు షాక్ అవుతాము.
Money Saving Tips: ప్రభుత్వం పెట్రోల్ లేదా డీజిల్ ధరలను పెంచిన వెంటనే, దాని ప్రభావం నేరుగా ప్రజల రోజువారీ జీవితంపై పడుతుంది. పెరుగుతున్న ద్రవ్యోల్బణం కారణంగా, ఇంధనానికి వెచ్చించే ప్రతి రూపాయి ఇప్పుడు మరింత విలువైనదిగా మారింది. అందుకే చాలా మంది తమ వాహనాల వినియోగంతో పాటు పెట్రోల్ పంపుల వద్ద కూడా డబ్బు ఆదా చేసే మార్గాలను అన్వేషిస్తున్నారు. సరైన పద్ధతులు పాటిస్తే, పెట్రోల్ లేదా డీజిల్ కొనుగోలు చేసే సమయంలో కేవలం కొద్దిగా జాగ్రత్తతోనే భారీగా డబ్బు ఆదా చేసుకోవచ్చు. అంతేకాకుండా, ఈ జాగ్రత్తలు మోసాలను నివారించడంలో కూడా సహాయపడతాయి.
Money Saving Tips: కుటుంబ ఆర్థిక పరిస్ధితి ఆరోగ్యంగా ఉండాలంటే.. అది ఆ ఇంట్లోని మహిళపైనే ఆధారపడి ఉంటుంది. ప్రస్తుతం వంటగదిలో మీరు చేసే వంట విధానంలోనూ అదేవిధంగా కొన్ని పద్థతులను మార్చుకుంటే ఏడాదికి లక్ష రూపాయల వరకు పోగు చేస్తారు. అవును నిజమే.. వారానికి సరిపడా కొనుగోలు చేసే కూరగాయల నుంచే పొదుపు మొదలుపెడితే.. మరెన్నో విషయాల్లోనూ ఇదే కొనసాగుతుంది. ఒకసారి మీరు ఊహించుకోండి..నెలకు ఎంత పొదుపు చేయవచ్చో.
Salaried Employees: మనలో చాలా మంది ఉద్యోగం చేస్తూ జీవించే వారు ఉంటారు. చాలీచాలని జీతాలతో కుటుంబాలను నెట్టుకొచ్చేవారు ఎక్కువగా ఉంటారు. జీవన వ్యయాలు పెరుగుతున్నా.. జీతం పెరగకపోవడంతో.. వచ్చే కొద్దిపాటి జీతంతో నెలంతా గడపాల్సి వస్తుంది. అయితే అనుకోకుండా వచ్చే ఖర్చులకు అప్పులు చేయాల్సి వస్తుంది. మీకు నెలకు 30వేల జీతం వస్తున్నప్పటికీ..అందులో నుంచి ప్రతినెలా కొంచెం పొదుపు చేయడం ప్రారంభించినట్లయితే ఏడాదిలో ఎక్కువ మొత్తంలో డబ్బును జమ చేసుకోవచ్చు. అదెలాగో ఇప్పుడు చూద్దాం.
Chit Funds 2025: చిట్టీ డబ్బులు అప్పులు తీర్చుకోవడానికి ఉపయోగించే ముందు.. మీ ఆర్థిక పరిస్థితిని పూర్తిగా అర్థం చేసుకోవడం ముఖ్యం. ఇక్కడ ఒక సమగ్రమైన ప్రణాళికను వివరంగా తెలుసుకుందాం.
Money Tips: నేటికాలంలో భార్యభర్తలు ఇద్దరూ ఉద్యోగం చేస్తేనే ఎలాంటి ఆర్థిక ఇబ్బందులు లేకుండా జీవితం గడపవచ్చు. అయితే పెరుగుతున్న ఖర్చులు పెరుగుతుండటం..ఆదాయం తగ్గుతుండటంతో భార్యభర్తలు ఇద్దరు పనిచేసినా..డబ్బులు మిగలనివారు ఎంతో మంది ఉన్నారు. అలాంటి వారు ఉద్యోగం చేస్తూనే కొన్ని పద్ధతులు పాటించినట్లయితే మీ జీతం కంటే ఎక్కువ డబ్బు సంపాదించే అవకాశం ఉంది. అదేంటో చూద్దాం.
Car Buying Tips: సొంత ఇళ్లు..సొంత కారు అనేది చాలామంది కల. మీరు కూడా సొంత కారు కొనాలనుకుంటుంటే..కొన్ని సూచనలు పాటించాల్సిందే. లేకపోతే మీ డబ్బు వృధా అవుతుంది. ఏ చిన్న పొరపాటు చేసినా ఖర్చు పెరిగిపోతుంది.
Money Saving on Home Loan Repayment: బ్యాంకులు వరుసగా పెంచుతున్న వడ్డీ రేట్లు రుణ గ్రహీతలపై మరింత ఆర్థిక భారాన్ని పెంచుతున్నాయి. మరీ ముఖ్యంగా హోమ్ లోన్ బారోవర్స్‌పై ఈ భారం మరింత అధికంగా పడుతోంది. మీరు కూడా సొంత ఇంటి కలను నెరవేర్చుకోవడం కోసం హోమ్ లోన్ తీసుకున్నారా ? అయితే హోమ్ లోన్ చెల్లింపులపై డబ్బు ఎలా ఆదా చేసుకోవాలో మీకు తెలుసా ?
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.