Allu Aravind: సొంత తండ్రి గురించి అల్లు అర్జున్‌ షాకింగ్‌ కామెంట్స్‌.. మా నాన్న పరమ పిసినారి

Allu Arjun Shocking Comments About His Father Allu Aravind: తన కుటుంబంలోని ఆసక్తికర విషయాలను అల్లు అర్జున్‌ పంచుకున్నారు. బాలకృష్ణ షోలో తన తండ్రి.. తన తల్లితోపాటు అన్నదమ్ముళ్ల అనుబంధంపై షాకింగ్‌ విషయాలు చెప్పారు.

Written by - Ravi Kumar Sargam | Last Updated : Nov 15, 2024, 04:01 PM IST
Allu Aravind: సొంత తండ్రి గురించి అల్లు అర్జున్‌ షాకింగ్‌ కామెంట్స్‌.. మా నాన్న పరమ పిసినారి

Unstoppable With NBK Show: సినీ పరిశ్రమలో తన రేంజ్‌ పెంచుకుని పాన్‌ వరల్డ్‌ స్టార్‌గా ఎదుగుతున్న అల్లు అర్జున్‌ తొలిసారి తన కుటుంబ విషయాలు పంచుకున్నారు. తన తండ్రి అల్లు అరవింద్‌, తల్లి నిర్మల.. అన్నదమ్ముళ్ల విషయాలపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తన తమ్ముడు, అన్నతో ఉన్న అనుబంధంతో పాటు తన స్నేహితులు.. ముఖ్యంగా తన తండ్రి గురించి బన్నీ షాకింగ్‌ కామెంట్స్‌ చేశారు. అసలు తన తండ్రి పరమ పిసినారి అని.. 'బడ్జెట్‌ పద్మనాభం' అంటూ వ్యాఖ్యానించారు.

Add Zee News as a Preferred Source

Also Read: Daaku Maharaaj: డాకూ మహారాజ్ గా బాలయ్య.. గండ్ర గొడ్డలి పట్టిన యమ ధర్మరాజుగా నందమూరి హీరో..

ఆహాలో ప్రసారమవుతున్న నందమూరి బాలకృష్ణ అన్‌స్టాపబుల్‌ సీజన్‌ 4లో అల్లు అర్జున్‌ పాల్గొన్నాడు. పుష్ప 2 విడుదల సందర్భంగా బన్నీతో బాలకృష్ణ ఇంటర్వ్యూ చేశారు. ఇతరులతో కన్నా అల్లు అర్జున్‌తో సాగిన ఈ ఎపిసోడ్‌కు భారీగా ప్రేక్షకుల నుంచి స్పందన లభిస్తోంది. ఇప్పటికే లక్షల్లో ఈ షోను తిలకించారు. అన్‌స్టాపబుల్‌లో సరికొత్త గణాంకాలు అల్లు అర్జున్‌ ఇంటర్వ్యూ నమోదు చేస్తోంది. సరదా సరదా ఆటలు.. ఎవరికీ తెలియని విషయాలు పంచుకోవడంతో ఈ ఎపిసోడ్‌కు ప్రేక్షకులు భారీగా చూస్తున్నారు.

Also Read: Gaddar: విప్లవ కవి గద్దర్ నటించిన చివరి చిత్రం ‘ఉక్కు సత్యాగ్రహం’.. ఈ నెల 29న విడుదల..

 

ఇంటర్వ్యూ ఆరంభంలోనే బాలకృష్ణ, అల్లు అర్జున్‌ మాట్లాడుకున్న మాటలు ఆసక్తి రేపాయి. 'నేను కృష్ణుడిని.. నువ్వు అర్జునుడిని' అని బాలయ్య చెప్పడంతో నవ్వుకున్న బన్నీ 'అయితే మీరు గీత ఇవ్వండి.. నేను కురుక్షేత్రం చేస్తా' అని చెప్పడంతో ప్రేక్షకుల నుంచి ఈలలు కేకలు వచ్చాయి. ఈ ఇంటర్వ్యూలో ప్రధానంగా మాట్లాడుకోవాల్సిన అంశం అల్లు అర్జున్ తన తండ్రి అరవింద్‌ గురించి చెప్పిన వ్యాఖ్యలు. తన బాల్యం నుంచి అరవింద్‌ తనకు విలాసవంతమైన జీవితం ఇవ్వలేదని చెప్పాడు. మధ్య తరగతి మనిషిలాగా పెంచాడని చెప్పుకొచ్చాడు.

చెన్నైలో ఒక సాధారణ స్కూల్‌లో వేశాడని అల్లు అర్జున్‌ గుర్తుచేసుకున్నాడు. అసలు తన తండ్రి పర్సు అనేది వాడడని.. బట్టల్లో డబ్బులు దాచుకునేవాడని చెప్పాడు. తన తండ్రి వద్ద సరదాగా డబ్బులు దొంగతనం చేసేంత లేదని వివరించాడు. 'మా నాన్న బడ్జెట్‌ పద్మనాభం' అని వర్ణించాడు. కానీ తన తండ్రి అలాం పెంచడం ద్వారానే ఇప్పటికీ తాము మధ్య తరగతి ఆలోచనలతోనే ఉన్నామని వెల్లడించాడు. 18 ఏళ్లు దాటితే కారు కొనిస్తానని చెప్పిన అల్లు అరవింద్‌ తర్వాత డొక్కు కారు కొనిచ్చాడని బన్నీ తెలిపాడు. ఆ కారు నడపడం కన్నా తోయడం ఎక్కువగా ఉందని చెప్పడంతో బాలకృష్ణతోపాటు అల్లు అర్జున్‌ పగలబడి నవ్వుకున్నాడు. ఇదే క్రమంలో అల్లు అర్జున్‌ తల్లి నిర్మల కూడా షోకు రావడం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. మరో ఎపిసోడ్‌ అల్లు అర్జున్‌ పిల్లలు కూడా రావడంతో ఆ షో మరింత హైలెట్‌గా నిలిచే అవకాశం ఉంది.

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి. 

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

 సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిFacebookTwitter

About the Author

Ravi Kumar Sargam

సర్గం రవి కుమార్‌. జీ తెలుగు డిజిటల్ మీడియాలో సబ్ ఎడిటర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ 2024 నుంచి రాజకీయాలు, స్పోర్ట్స్, వినోదం, క్రైమ్, జాతీయ వ్యవహరాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు.

...Read More

Trending News