పెట్రో ఉత్పత్తులపై వ్యాట్ తగ్గింపు...

Last Updated : Oct 11, 2017, 03:34 PM IST
పెట్రో ఉత్పత్తులపై వ్యాట్ తగ్గింపు...

దీపావళి కానుకగా అభివర్ణిస్తూ  పెట్రో ఉత్సత్తులపై దేశంలోని మూడు రాష్ట్రాలు వ్యాట్ ను తగ్గించాయి. పెట్రోల్, డీజిల్ పై విలువ ఆధారిత పన్ను ( వ్యాట్) తగ్గిస్తూ ప్రధాని సొంత రాష్ట్రమైన గుజరాత్ తో పాటు ముంబై, హిమాచర్‌ప్రదేశ్ రాష్ట్రాల ప్రభుత్వాలు ప్రకటించాయి. గుజరాత్ 4 శాతం , మహారాష్ట్ర ప్రభుత్వం 2 శాతం, హిమాచల్ ప్రదేశ్ లో ఒక శాతం తగ్గించాయి. అంతర్జాతీయంగా చమురు ధరలు తగ్గినా దేశీయంగా మాత్రం మార్పు లేకపోవడంపై దేశవ్యాప్తంగా పెల్లుబుకుతున్న అసంతృప్తి నేపథ్యంలో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నాయి. బుధవారం నుంచి కొత్త ధరలు అమల్లోకి వచ్చాయి. దీంతో తెలుగు రాష్ట్రాలతో పాటు మిగిలిన రాష్ట్రాల్లో కూడా ఇలాంటి డిమాండ్లే వినిపిస్తున్నాయి. పెట్రో ఉత్పత్తులపై వ్యాట్ ను తగ్గించే అంశంపై ఏపీ, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వాలు కసరత్తు చేస్తున్నాయి.

Trending News